Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR v SRH: 'కేవలం ఒక్క డకౌట్‌తో.. నేనేం చెడ్డ ఆటగాడిని కాను'

KKR v SRH: Dinesh Karthik says single duck doesnt make player bad

అబుదాబి: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఐపీఎల్ 2020లో బోణీ కొట్టింది. ఎస్‌ఆర్‌హెచ్‌‌ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా సునాయాసంగా ఛేదించింది. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ ‌(70 నాటౌట్:‌ 62 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్ ‌(42 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో కోల్‌కతా సారథి దినేష్ కార్తీక్‌ డకౌట్‌ అయ్యాడు. దీనిపై కార్తీక్‌ స్పందించాడు.

ఒక్క డకౌట్‌తో చెడ్డవాడిని కాను

ఒక్క డకౌట్‌తో చెడ్డవాడిని కాను

'సన్‌రైజర్స్ మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యా. కేవలం ఒక్క డకౌట్‌ ఏ ఆటగాడికి చెడ్డ పేరు తీసుకురాలేదు. నా అంశంలోనూ ఇది వర్తిస్తుంది. ఒక్కో రోజు పరుగులు చేయలేకపోవచ్చు. ఈ రోజు అదే జరిగింది. తర్వాతి మ్యాచ్‌లో పరుగులు చేస్తా' అని దినేష్ కార్తీక్‌ ధీమా వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన శుభమన్‌ గిల్‌ను కార్తీక్‌ ప్రశంసల్లో ముంచెత్తాడు. 'గిల్‌ కీలకం అవుతాడని ఐపీఎల్‌ ప్రారంభానికి ముందే అనుకున్నాం. అతడు తన జర్నీని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా. అతని స్ట్రోక్‌ప్లే అద్భుతంగా ఉంది. 21 ఏళ్ల వయసున్న గిల్..‌ భవిష్యత్తులో గొప్ప ఆటగాడు అవుతాడని బలంగా నమ్ముతున్నా' అని పేర్కొన్నాడు.

ట్రోల్‌ చేసిన వారికి ఇదే సమాధానం

ట్రోల్‌ చేసిన వారికి ఇదే సమాధానం

'సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచ్‌లో మా జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచింది. హిట్టర్లుగా పేరున్న కేకేఆర్‌కు యువ ఆటగాళ్ల బలం కూడా ఎక్కువగానే ఉంది. జట్టులో ఆల్‌రౌండర్లకు కొదువ లేదు. వారు అందరూ బాగా ఆడుతున్నారు. పాట్ కమిన్స్‌ ఫామ్‌లోకి రావడం శుభపరిణామం. మొదటి మ్యాచ్‌లో విఫలమైనందుకు కమిన్స్‌ మీద ట్రోల్‌ చేసిన వారికి తన ప్రదర్శనతోనే సమాధానం ఇచ్చాడు' అని దినేష్ కార్తీక్ తెలిపాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన కమిన్స్.. 49 పరుగులు సమర్పించుకుని కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అయితే సన్‌రైజర్స్ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 19 పరుగులు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.

నాగర్‌కోటి కేకేఆర్‌కు ఆడడం లాభాదాయకం

నాగర్‌కోటి కేకేఆర్‌కు ఆడడం లాభాదాయకం

మ్యాచ్‌ ద్వారా కమలేశ్‌ నాగర్‌కోటి మళ్లీ కేకేఆర్‌కు ఆడడం లాభాదాయకమని దినేష్ కార్తీక్‌ వెల్లడించాడు. గత రెండు సీజన్లుగా కేకేఆర్‌లో ఉంటున్న నాగర్‌కోటితో మాకు మంచి ఎమోషనల్‌ జర్నీ ఉందన్నాడు. గతేడాది ఐపీఎల్‌ సందర్భంగా గాయపడిన నాగర్‌కోటి సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌ దిగి మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2018లో కేకేఆర్‌ నాగర్‌కోటిని కొనుగోలు చేసింది. కేకేఆర్‌ తన తర్వాతి మ్యాచ్‌ సెప్టెంబర్‌ 30 (బుధవారం)న రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది.

Story first published: Sunday, September 27, 2020, 15:00 [IST]
Other articles published on Sep 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+