న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియాకు షాక్.. స్టార్ పేసర్‌కు కరోనా!

KKRs Prasidh Krishna tests positive for Covid-19
WTC Final కి ఎంపికైన ఆటగాడికి కరోనా ! నాలుగో KKR ప్లేయర్ || Oneindia Telugu

బెంగళూరు: కోల్‌కతా నైట్‌రైడర్స్, టీమిండియా పేసర్ ప్రసిద్ కృష్ణ కరోనా వైరస్ బారిన పడ్డాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో అతనికి పాజిటీవ్ వచ్చింది. దాంతో మహమ్మారి బారిన పడిన నాలుగో కేకేఆర్ ప్లేయర్‌గా ప్రసిద్ నిలిచాడు. ఇప్పటికే ఆ జట్టు ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌, టీమ్ సిఫెర్ట్‌లకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

ఓ మ్యాచ్‌లో గాయపడిన వరుణ్ చక్రవర్తిని.. గ్రీన్ చానెల్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి హోటల్ రూమ్‌కు తిరిగి వచ్చిన తర్వాత వరుణ్ నిబంధనల ప్రకారం వారం రోజులు క్వారంటైన్‌లోకి వెళ్లకుండా సందీప్‌తో కలిసి భోజనం చేశాడు. ఈ సంఘటన ఈ నెల 1న జరిగింది. భోజనం తర్వాత ఇద్దరు ప్లేయర్లు.. మిగతా టీమ్‌తో కలిసి ప్రాక్టీస్‌కు వెళ్లారు.

అక్కడే తనకు హెల్త్ బాగాలేదని వరుణ్ చెప్పాడు. వెంటనే అతన్ని ఐసోలేట్ చేసి టెస్ట్‌లు నిర్వహించారు. కానీ అప్పటి వరకు వరుణ్‌తో కలిసి తిరిగిన సందీప్ ఇతర ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేశాడు. ఆ క్రమంలోనే ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రాతో మాట్లాడాడు. ఇలా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెంది చివరకు ఐపీఎల్ 2021 సీజన్‌ను నిరవధిక వాయిదాకు కారణమైంది.

KKRs Prasidh Krishna tests positive for Covid-19

లీగ్ అర్థాంతరంగా ఆగిపోవడంతో ఆటగాళ్లంతా తమ స్వస్థలలాకు బయలదేరారు. వారంతా బబుల్‌ను వీడే ముందు నిబంధనల ప్రకారం కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రసిద్ కూడా అహ్మదాబాద్‌లో కేకేఆర్ క్యాంప్ వీడే ముందు పరీక్షలు చేయించుకున్నాడు. కానీ అక్కడ అతనికి నెగటివ్ వచ్చింది. తీరా బెంగళూరు చేరుకున్న తర్వాత అతని పరీక్షలు నిర్వహించగా పాజిటీవ్ వచ్చింది.

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో సెలెక్టర్లు ప్రసిద్ కృష్ణ స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు. ఇంతలోనే అతను కరోనా బారిన పడ్డాడు. అయితే ఇంగ్లండ్ ప్రయాణానికి ఇంకా గడువు ఉండటంతో అతను కోలుకునే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ప్రసిధ్.. 3 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీశాడు.

Story first published: Saturday, May 8, 2021, 15:02 [IST]
Other articles published on May 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X