న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: త్రివేండ్రంలో టీమిండియాకు నిరసన సెగ.. రచ్చ చేసిన సంజూ ఫ్యాన్స్!

Kerala Fans chant ‘Sanju Sanju’ as Team India reaches Thiruvananthapuram

తిరువనంతపురం: సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌కు సిద్దమైన టీమిండియాకు నిరసన సెగ తగిలింది. ఆదివారం ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచిన రోహిత్ సేన మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

ఈ విజయంతో ఆత్మవిశ్వాసాన్ని రెండింతలు చేసుకున్న టీమిండియా సోమవారం తిరువనంతపురం చేరింది. సెప్టెంబర్ 28 నుంచి సౌతాఫ్రికాతో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం సన్నదమవుతోంది. తిరువనంతపురం చేరిన టీమిండియాకు అభిమానుల నుంచి ఊహించని షాక్ తగిలింది.

సంజూ నామస్మరణతో దద్దరిల్లిన

టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కని సంజూ శాంసన్‌కు మద్దతుగా అతని అభిమానులు రచ్చ చేశారు. సంజూకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ నిరసను తెలియజేశారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి భారత ఆటగాళ్లు బయటకు రాగానే సంజూ.. సంజూ అని బిగ్గరగా నినాదాలు చేశారు. కేరళకు చెందిన సంజూ శాంసన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే సంజూకు అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. సౌతాఫ్రికాతో జరిగే తొలి మ్యాచ్‌లోనూ ఈ నిరసన కొనసాగే అవకాశం ఉంది. అయితే తమ నిరసనను నినాదాల వరకే పరిమితం చేయడంతో భారత ఆటగాళ్లూ ఊపిరి పీల్చుకున్నారు.

సంజూ ఫొటో చూపించిన సూర్య..

సంజూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సూర్యకుమార్ యాదవ్ తన మొబైల్‌లో ఉన్న సంజూ శాంసన్ ఫొటోను అభిమానులను కూల్ చేసే ప్రయత్నం చేయగా.. అశ్విన్, చాహల్ తమ ఇన్‌స్టా స్టోరీలో త్రివేండ్రంలో సంజూ పేరు దద్దరిల్లుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సంజూ అభిమానుల నిరసనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

పంత్‌ను పక్కనపెట్టి..

ఇక ఆసియాకప్ 2022 టోర్నీలో దారుణంగా విఫలమైన రిషభ్ పంత్‌పై వేటు వేసి సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. కానీ ఈ వాదనను పట్టించుకోని బీసీసీఐ.. పంత్‌నే కొనసాగించింది. దాంతో టీమ్‌మేనేజ్‌మెంట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణించకున్నా పంత్‌కు ఎన్ని అవకాశాలు ఇస్తారని, సంజూ శాంసన్ చేసిన నేరం ఏంటని మండిపడ్డారు. డానిష్ కనేరియా వంటి మాజీ క్రికెటర్లు సైతం సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

లెఫ్టాండర్ కావడంతోనే..

లెఫ్టాండర్ కావడంతోనే..

అయితే సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించాడు. అసలు టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసే జట్టు కోసం సంజూ పేరునే పరిశీలించలేదన్నాడు. అతన్ని వన్డే ఫార్మాట్‌లో కొనసాగిస్తామని, సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేస్తామని చెప్పాడు. ఆసియా కప్ 2022లో విఫలమైన రిషభ్ పంత్‌ను పక్కన పెట్టాలనే ఉద్దేశమే సెలెక్టర్లకు లేదని, భారత జట్టులో ఏకైక లెఫ్టాండ్ బ్యాటర్ అతనేనని చెప్పాడు. తనదైన రోజున పంత్ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే పంత్‌ను సెలెక్ట్ చేసినట్లు స్పష్టం చేశాడు.

Story first published: Monday, September 26, 2022, 18:05 [IST]
Other articles published on Sep 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X