కరుణ్ నాయర్ 'ర్యాంప్ షాట్' సచిన్‌ను గుర్తు చేసిన వేళ (వీడియో)

Posted By:
Karun Nair on a RAMP shot against Royal challengers bangalore

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ టోర్నీలో వారం రోజులు పూర్తయింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్‌ పాటు కళాత్మక షాట్లతోనూ క్రికెటర్లు ఆకట్టుకుంటున్నారు. రెండు రోజుల క్రితం చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు ర్యాంప్ షాట్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

తాజాగా శుక్రవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు కరుణ్ నాయర్ మరోసారి ర్యాంప్ షాట్‌‌తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్ నాయర్ 26 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేశాడు.

బెంగళూరు ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ మూడో బంతిని క్రీజులో ఉన్న కరుణ్ నాయర్ వెనక్కి వంగుతూ.. ర్యాంప్‌ షాట్‌తో బౌండరీకి తలరించిన తీరు అద్భుతం. ఇందుకు సంబంధించిన వీడియో ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ఓపెనర్ రాహుల్ (47), కెప్టెన్ అశ్విన్ (33) దూకుడుగా ఆడినప్పటికీ, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో 19.2 ఓవర్లలో 155 పరుగులకి ఆలౌటైంది. అనంతరం 156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు చేధనలో ఏబీ డివిలియర్స్ (57), డికాక్ (45) దూకుడుగా ఆడటంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Saturday, April 14, 2018, 14:30 [IST]
Other articles published on Apr 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి