న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్‌కు అవకాశం ఇవ్వరా? టీమ్‌లో ఏం జరుగుతోంది: కపిల్ దేవ్

Kapil Dev says I dont understand Man of the Match being dropped

న్యూఢిల్లీ: టీమిండియా మేనేజ్‌మెంట్‌పై దిగ్గజ క్రికెట్ కపిల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రతీ మ్యాచ్‌కు ఆటగాళ్లను మారుస్తూ ఉండటాన్ని తప్పుబట్టాడు. మ్యాన్ ది మ్యాచ్ అందుకున్న ప్లేయర్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వకపోడం ఏంటో తనకు అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్‌ పర్యటనలో తొలి టెస్టులో 8 వికెట్లు తీసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గెలిచిన కుల్దీప్ యాదవ్‌ను ఆ మరుసటి మ్యాచ్‌కే దూరం పెట్టింది. కుల్దీప్ యాదవ్ స్థానంలో జయ్‌దేవ్ ఉనద్కత్‌కు అవకాశం ఇచ్చారు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచినా..

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచినా..

శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో సెంచరీ చేసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గెలిచిన సూర్యకుమార్ యాదవ్‌ను ఆ వెంటనే రెండు వన్డేలకు దూరం పెట్టారు.బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ బాది 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గెలిచిన ఇషాన్ కిషన్‌‌కు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అవకాశం ఇవ్వలేదు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో సత్తా చాటిన యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను.. న్యూజిలాండ్‌తో తొలి రెండు వన్డేల్లో అవకాశం ఇవ్వలేదు.

దాంతో టీమ్‌మేనేజ్‌మెంట్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వన్డే ప్రపంచకప్ కోసం సన్నదమవుతున్న టీమిండియా ఒకే టీమ్‌తో ఆడాలని ఇప్పటికే సునీల్ గవాస్కర్, గౌతమ్ గంభీర్‌లు టీమ్‌మేనేజ్‌మెంట్‌కు సూచించారు. తాజాగా కపిల్ దేవ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. గల్ఫ్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఓ సెట్ ఆఫ్ ప్లేయర్లతో ఆడాలి..

ఓ సెట్ ఆఫ్ ప్లేయర్లతో ఆడాలి..

'టీమిండియా ఓ సెట్ ఆఫ్ ప్లేయర్లను ఫిక్స్ చేసుకోవాలి. వాళ్లకు వరుస అవకాశాలు ఇస్తూ రావాలి. ఇంతకుముందు కెప్టెన్లు ఇదే చేశారు. అవసరమైతే ఒకటి రెండూ మార్పులు చేయడంలో తప్పు లేదు. వాటిని అర్థం చేసుకోగలం.

అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన ప్లేయర్, ఆ తర్వాతి మ్యాచ్‌లో రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సి వస్తే.. క్రికెటర్లుగా టీమ్‌లో ఏం జరుగుతుందో మాకైతే అర్థం కావడం లేదు. ఇది క్రికెట్ బోర్డుకి, సెలక్టర్లకే వదిలేయాలేమో.

ఫార్మాట్‌కో టీమ్ సిద్దం చేయండి..

ఫార్మాట్‌కో టీమ్ సిద్దం చేయండి..

ఎంతో మంది క్రికెటర్లు వస్తున్నారు. అందరికీ అవకాశాలు దక్కాలని అనుకోవడంలో తప్పు లేదు. అయితే వచ్చిన ప్లేయర్లు, బాగా ఆడితే ఆ తర్వాతి మ్యాచ్‌లో కూడా అవకాశం దక్కకపోతే ఇక లాభం ఏంటి? మరి రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ ఏమనుకుంటున్నారో వాళ్లకే తెలియాలి.

టీ20, వన్డే, టెస్టు ఫార్మాట్లకు వేర్వేరుగా మూడు జట్లను తయారుచేస్తే ఇంకా బాగుంటుందేమో చూడండి. అప్పుడు ఇలాంటి ప్రశ్నలే రావు. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ కూడా సెట్ అవుతుంది.'అని కపిల్ దేవ్ సూచించాడు. ఇక సూర్యకుమార్ యాదవ్‌కు వన్డేల్లో వరుస అవకాశాలు ఇవ్వాలని కపిల్ దేవ్ సూచించాడు.

Story first published: Saturday, January 21, 2023, 16:17 [IST]
Other articles published on Jan 21, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X