సంజూ శాంసన్‌తో ఉన్న సమస్యే అది: కపిల్ దేవ్

న్యూఢిల్లీ: నిలకడలేమి ఆటనే యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌తో ఉన్న అతి పెద్ద సమస్యని భారత దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. అతనిలో అపార నైపుణ్యం ఉందని, కానీ స్థిరంగా రాణించడని చెప్పాడు. ఇదొక్కటే అతనిలో ఉన్న అతిపెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీ20 ప్రపంచకప్‌‌ను ఉద్దేశించి మాట్లాడిన కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజూ శాంసన్ ఒకటి రెండు మ్యాచ్‌ల్లో బాగా ఆడుతాడని.. ఆ తర్వాత అదే స్థిరమైన ప్రదర్శన కొనసాగించడంలో విఫలమవుతాడని పేర్కొన్నాడు.

 నలుగురు వికెట్ కీపర్లు..

నలుగురు వికెట్ కీపర్లు..

'అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని చూస్తే జట్టులో యువ ఆటగాళ్లకు కొదువలేదు. అన్ని విభాగాల్లోకెల్లా మనకు నలుగురు వికెట్‌ కీపర్లు అందుబాటులో ఉన్నారు. ఆ నలుగురే సంజూ శాంసన్‌, రిషభ్ పంత్‌, దినేశ్‌ కార్తిక్‌, ఇషాన్‌ కిషన్‌లు. విడివిడిగా చూస్తే ఈ నలుగురు ఎవరికి వారే.

బ్యాటింగ్‌, స్టంపింగ్‌ చేయడంలో మంచి నైపుణ్యం కలిగినవారు. తమదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉంది.

ఆ ఒక్కడితో ఇదే ఇబ్బంది..

ఆ ఒక్కడితో ఇదే ఇబ్బంది..

అయితే నా దృష్టిలో ఒక వికెట్‌ కీపర్‌ మాత్రం నిలకడ చూపించలేకపోతున్నాడు. ఆ క్రికెటర్‌ సంజూ శాంసన్‌. కెప్టెన్‌గా అతను సమర్థుడే కావొచ్చు.. టాలెంట్‌కు కొదువ లేదు. కానీ వరుసగా అవకాశాలు ఇస్తే సంజూ ఒకటి రెండు మ్యాచ్‌ల్లో మంచి ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి.. ఆ తర్వాత అదే స్థిరమైన ప్రదర్శన చేయడంలో మాత్రం విఫలమవుతాడు. ఇదొక్కటే అతనిలో ఉన్న మైనస్‌ పాయింట్‌.'అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.

టైటిల్ జస్ట్ మిస్..

టైటిల్ జస్ట్ మిస్..

ఇక ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ అద్బుత ప్రదర్శనతో రన్నరప్‌గా నిలిచింది. సంజూ శాంసన్ కెప్టెన్సీలో లీగ్‌ దశలో మంచి విజయాలు సాధించిన రాజస్థాన్‌ రెండో సారి ఫైనల్‌ చేరినప్పటికి.. గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ సీజన్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 17 మ్యాచ్‌ల్లో 863 పరుగులు చేసిన బట్లర్‌ ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకున్నాడు. బట్లర్‌ ఖాతాలో నాలుగు సెంచరీలు ఉండడం విశేషం. సంజూ శాంసన్ కూడా ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, June 15, 2022, 14:23 [IST]
Other articles published on Jun 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X