న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మైదానంలో కోహ్లీ ప్రవర్తనపై విలియమ్సన్ ఏమన్నాడంటే?

 Kane Williamson Says Its Typical of Virat on Kohlis expletive-laden send-off in 2nd Test

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ 0-2తో వైట్ వాష్ అయ్యిందానికన్నా.. మైదానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయంపై మీడియా సమావేశంలో జర్నలిస్ట్‌తో కోహ్లీ వాగ్వాదానికి దిగడం కూడా ఈ డిబేట్‌కు ఊతం ఇచ్చింది.

ఆటపై ఉన్న పిచ్చి..

ఆటపై ఉన్న పిచ్చి..

అయితే మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మైదానంలో వ్యవహరించిన తీరుపై న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ప్రశ్నిస్తే.. సమాధానంగా ఓ చిరునవ్వు నవ్వాడు. అది విరాట్ విలక్షణమైన తీరని సమాధానమిచ్చాడు. ‘అది ఆటపై విరాట్‌కు ఉన్న పిచ్చికి స్వరూపం. ఆ ఘటనను మేం బూతద్దంలో చూడాలనుకోవడం లేదు'అని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.

 అత్యద్భుతంగా ఉంది..

అత్యద్భుతంగా ఉంది..

వరల్డ్‌క్లాస్ జట్టైన భారత్‌పై గెలవడం సంతృప్తికరంగా ఉందని విలియమ్సన్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘రెండు టెస్ట్‌ల్లో విజయం సాధించడం సంతోషంగా ఉంది. ఇదో అద్భుతమైన అనుభూతి. మా విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు.

పిచ్ కూడా అనుకూలించింది. కీలక భాగస్వామ్యాలు మా విజయానికి దోహదపడ్డాయి. మొత్తానికి ఈ సిరీస్ అద్భుతంగా సాగింది. ప్రపంచ స్థాయి జట్టు అయిన భారత్‌ను ఓడించడం సంతృప్తినిచ్చింది.'అని విలియమ్సన్ తెలిపాడు.

ఏమనుకుంటున్నావ్? అంటూ జర్నలిస్ట్‌తో కోహ్లీ వాగ్వాదం.. !!

 కోహ్లీ అభ్యంతరకర ప్రవర్తన..

కోహ్లీ అభ్యంతరకర ప్రవర్తన..

రెండో టెస్ట్‌ రెండో రోజు సహనం కోల్పోయిన కోహ్లీ మైదానంలో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఎన్నడు లేని విధంగా ప్రత్యర్థి ఆటగాళ్లు, ప్రేక్షకులవైపు అసభ్య పదజాలం ఉపయోగిస్తూ అభ్యంతరకర సైగలు చేశాడు. ఇదంతా టీవీ కెమెరాల్లో రికార్డవ్వడంతో.. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేశాయి. న్యూజిలాండ్ కెప్టెన్ విలియ‌మ్స‌న్‌కు సెండాఫ్ ఇస్తూ, టామ్ లాథమ్ ఔటైనప్పుడు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోహ్లీ.. బూతు పురాణం అందుకున్నాడు. ప్రేక్షకుల వైపు తిరగుతూ.. నోరు మూసుకోవాలి అన్నట్లు సైగ చేశాడు. అంతేకాకుండా రాయలేని బూతు పదాలు ఉపయోగించినట్లు వీడియోల్లో అతని లిప్ సింక్‌ చూస్తే అర్థమైంది.

కివీస్ అలవోకగా..

కివీస్ అలవోకగా..

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ నిర్ధేశించిన 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్‌ 36 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి ఛేదించింది. లాథమ్‌(52), బ్లండెల్‌(55) అర్ధసెంచరీలతో రాణించారు. విలియమ్సన్‌ 5 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. భారత్ బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్‌ ఒక వికెట్‌ తీశాడు.అంతకు ముందు 90/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 124 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి(9), రిషభ్‌ పంత్‌(4), మహ్మద్‌ షమీ(5), బుమ్రా(4) స్వల్ప స్కోర్లకు వెనుదిరగడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ముగిసింది. రవీంద్ర జడేజా(16) అజేయంగా నిలవగా.. పుజారా(24) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్‌ 4 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. సౌథీ మూడు, వాగ్నర్, గ్రాండ్ హోమ్ తలో వికెట్ తీశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 242 పరుగులకు కుప్పకూలగా.. న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌటైంది.

Story first published: Monday, March 2, 2020, 13:36 [IST]
Other articles published on Mar 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X