న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏమనుకుంటున్నావ్? అంటూ జర్నలిస్ట్‌తో కోహ్లీ వాగ్వాదం.. !!

Virat Kohli Fires On journalist who accuses him of swearing at Kane Williamson, New Zealand crowd

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఓ జర్నలిస్ట్‌తో వాగ్వాదానికి దిగాడు. సదరు జర్నలిస్ట్ కూడా భారత కెప్ట్‌న్ మాటకు మాట బదులిచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాడి వేడిగా మాటల యుద్దం నడిచింది. సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడి సిరీస్‌ను 0-2తో చేజార్చుకున్న విషయం తెలిసిందే.

ఈ ఓటమిపై స్పందిస్తూ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ప్రణాళికలను అమలు పరచడంలో విఫలమవ్వడం.. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలయ్యామని తెలిపాడు. అంతేకాకుండా తమ ఓటమికి ఎలాంటి సాకులు లేవని, ప్రత్యర్ధి జట్టు వ్యూహాలకు కట్టుబడి విజయాన్నందుకుందన్నాడు. అయితే ప్రశ్నల సెషన్‌లో ఓ జర్నలిస్ట్ మైదానంలో కోహ్లీ అసభ్యకర ప్రవర్తనను ప్రస్తావించాడు.'

సగం సంగం ప్రశ్నలతో రాకు..

సగం సంగం ప్రశ్నలతో రాకు..

‘విరాట్, మైదానంలో మీ ప్రవర్తనపై మీ స్పందన ఏంటి? విలియమ్సన్ ఔటైనప్పుడు మీరు చేసిన సైగలు.. అన్న మాటలు.. అలాగే ప్రేక్షకులవైపు చేసిన అసభ్య సైగలకు అర్థం ఏంటి? భారత కెప్టెన్‌గా మైదానంలో ఇలానే ప్రవర్తిసారా?'అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు చిర్రెత్తుకు పోయిన కోహ్లీ అసలు నువ్వేం అనుకుంటున్నావని మండిపడ్డాడు. దీనికి సదరు జర్నలిస్ట్ కూడా సమాధానమివ్వడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక చివరకు సగం తెలిసి.. తెలియని ప్రశ్నలతో వచ్చి విసగించవద్దని, పూర్తి వివరాలతో మంచి ప్రశ్నలతో రావాలని సూచిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను ఈ వ్యవహారంపై మ్యాచ్ రిఫరీతో మాట్లాడానని అతనెలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నాడు.

ఇద్దరీ మధ్య సంభాషణ ఇలా...

ఇద్దరీ మధ్య సంభాషణ ఇలా...

జర్నలిస్ట్ : విరాట్, మైదానంలో మీ ప్రవర్తనపై మీ స్పందన ఏంటి? విలియమ్సన్ ఔటైనప్పుడు మీరు చేసిన సైగలు.. అన్న మాటలు.. అలాగే ప్రేక్షకులవైపు చేసిన అసభ్య సైగలకు అర్థం ఏంటి? భారత కెప్టెన్‌గా మైదానంలో ఓ మంచి ఆటగాడిగా ఉండదలుచుకోలేదా?

విరాట్ : ఏం అనుకుంటున్నావ్?

జర్నలిస్ట్: నేను మిమ్మల్ని ప్రశ్న అడిగా?

విరాట్ : నేను నిన్ను సమాధానం అడుగుతున్నా.

జర్నలిస్ట్: మీరు మైదానంలో సరిగ్గా ప్రవర్తించాల్సింది.

విరాట్: ముందు నువ్వు మైదానంలో ఏం జరిగిందో తెలుసుకో. మంచి ప్రశ్నలతో రా. సగం సగం తెలుసుకొని ప్రశ్నలు వేయకు. నువ్వు వివాదాన్ని సృష్టించాడానికి ఇది సరైన వేదిక కాదు. నేను మ్యాచ్ రిఫరీతో కూడా మాట్లాడా. ఆ ఘటనపై అతనేలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

2018లో కూడా..

2018లో కూడా..

ఇక కోహ్లీ గతంలో కూడా ఓ మీడియా ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండేళ్ల క్రితం ఇంగ్లండ్ చేతిలో టెస్ట్ సిరీస్ ఓడిన తర్వాత ఇలానే మీడియా సమావేశంలో అసహనానికి గురయ్యాడు. ‘గత 15 ఏళ్లలో భారత్ ఉత్తమ జట్టు! ఈ ట్యాగ్‌లు మీపై ఒత్తిడి తెస్తున్నాయా? మీరు నిజంగానే బెస్ట్ టీమ్ అని నమ్ముతున్నారా? ' అని ప్రశ్నించాడు. దీనికి కోహ్లీ అవును తాము బెస్ట్ టీమ్ అని అందులో సందేహం ఎందుకని సమాధానమిచ్చాడు.దీనికి జర్నలిస్ట్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. కోహ్లీ అది ‘నీ అభిప్రాయం' అని చురకలంటించాడు.

కోహ్లీ బూతు పురాణం..

రెండో టెస్ట్‌లో కివీస్ తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా కోహ్లీ అసభ్య పదజాలం వాడాడు. ఆ జ‌ట్టు కెప్టెన్ విలియ‌మ్స‌న్‌కు సెండాఫ్ ఇస్తూ, కోహ్లీ చాలా కోపంగా, అసభ్యకరంగా ప్రవర్తించాడు. చూపుడు వేలిని చూపిస్తూ, ఏవో అసభ్య పదాలను ఉపయోగించాడు. ఇక మహ్మద్ షమీ బౌలింగ్‌లో టామ్ లాథమ్ ఔటవ్వగా.. తన సంతోషాన్ని వ్యక్తం చేసిన కోహ్లీ.. ప్రేక్షకుల వైపు తిరగుతూ.. నోరు మూసుకోవాలి అన్నట్లు సైగ చేశాడు. అంతేకాకుండా రాయలేని బూతు పదాలు ఉపయోగించినట్లు దీనికి సంబంధించిన వీడియోలో అతని లిప్ సింక్‌ చూస్తే అర్థమైంది.

Story first published: Monday, March 2, 2020, 13:23 [IST]
Other articles published on Mar 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X