న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే ఓడాం: కేన్ మామ

Kane Williamson says Australia put us under pressure after T20 World Cup final loss

దుబాయ్: ఒత్తిడిని అధిగమించకపోవడం వల్లే టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఓటమిపాలయ్యామని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మెగాఫైనల్లో కివీస్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలై మరోసారి ప్రపంచకప్‌ను తృటిలో చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన కేన్ మామ ఓటమి గల కారణాలను తెలియజేశాడు. ఆస్ట్రేలియా అద్భుతమైన ఆటతో తమను ఒత్తిడిలోకి నెట్టేసిందని, బౌలింగ్ వైఫల్యం ఏమాత్రం కాదన్నాడు. తాము విధించిన లక్ష్యం సరిపోతుందనుకున్నామని, కానీ ఆసీస్ సూపర్ బ్యాటింగ్‌తో సులువుగా ఛేదించిందని చెప్పాడు. అయితే తమ ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నామన్న కేన్ మామ.. ఎంతో బాగా ఆడి టైటిల్‌ను చేజార్చుకోవడం బాధగా ఉందన్నాడు.

కొంచెం బాధగా ఉంది..

కొంచెం బాధగా ఉంది..

'మేం సాధించిన స్కోరు సరిపోతుందని అనుకున్నాం. కానీ ఆసీస్‌ అద్భుతంగా ఆడి ఛేదించింది. ఈ రోజు మాకు కలిసి రాలేదు. అయితే మా ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నాం. విజేతగా నిలవాలని ఎవరికైనా ఉంటుంది. ఎంతో బాగా ఆడి ఎన్నో అంచనాలతో ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి కొంత బాధ సహజం. మా ఓటమికి బౌలింగ్ వైఫల్యం ఏమాత్రం కాదు. ఈ టోర్నీలో బౌలింగ్ బలంతోనే ఇక్కడిదాకా వచ్చాం. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ అద్భుతంగా ఆడారు. ఈ విజయానికి వారు అర్హులు. అయితే మన ఆటతీరును ప్రత్యర్థి, వేదికను బట్టి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో మేం కొంత తడబడ్డాం.

ఒత్తిడిలోకి నెట్టేసింది..

ఒత్తిడిలోకి నెట్టేసింది..

ఈ మ్యాచ్‌లో మేం మెరుగ్గా రాణించాల్సింది. కానీ ఆస్ట్రేలియా అసాధారణమైన పోరాటాన్ని కనబర్చింది. మమ్నల్ని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేసింది. వారి సూపర్ బ్యాటింగ్‌తో మాకు కావాల్సిన బ్రేక్ త్రూస్ కూడా అందుకోలేకపోయాం. ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి క్రియేట్ చేయలనేప్పుడు మనం 170, 200 పరుగుల లక్ష్యమైనా చిన్నబోతుంది.

ఈ మ్యాచ్‌లోను అదే జరిగింది. మూమెంటమ్ అందుకున్న ఆస్ట్రేలియా ఎక్కడా తగ్గలేదు. మేం విధంచిన లక్ష్యం సరిపోతుందనుకున్నాం. కానీ మైదాన పరిస్థితులు కీలక పాత్ర పోషించాయి.

ఇంకొన్ని రన్స్ ఉంటే..

ఇంకొన్ని రన్స్ ఉంటే..

స్కోర్ బోర్డుపై పరుగులుంటే ప్రత్యర్థిపై ఒత్తిడిని తీసుకురావచ్చు. అవకాశాలను అందుకోవచ్చు. టీ20 ఫార్మాట్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతుంటాయి. కానీ ఈ రోజు అవేం జరగలేదు. ఇక దుబాయ్ వంటి భిన్నమైన వికెట్‌పై ధాటిగా ఆడటం కష్టమనుకున్నా. కానీ మంచి భాగస్వామ్యం నెలకొల్పి ఆ తర్వాత వేగంగా ఆడి పరుగులు రాబట్టడం సంతోషానిచ్చింది.

ఇక టోర్నీలో మా జట్టు కనబర్చిన ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా. ఫైనల్ ఆడుతున్నప్పుడు సానుకూల ఫలితంతో పాటు ప్రతికూల ఫలితం ఉంటుందని తెలుసు. ఈ రోజు మాకు కలిసి రాలేదంతే. ఈ టోర్నీలోని సానుకూల అంశాలలో మరింత బలంగా తయారవుతాం 'అని కేన్ మామ చెప్పుకొచ్చాడు.

ఆసీస్ అలవోకగా..

ఆసీస్ అలవోకగా..

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ (48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 85) అద్భుతంగా ఆడగా... హాజల్‌వుడ్‌ (3/16) బౌలింగ్‌లో రాణించాడు. అనంతరం ఆసీస్‌ 18.5 ఓవర్లలో 2 వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' మిచెల్‌ మార్ష్ (50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 నాటౌట్‌), డేవిడ్‌ వార్నర్‌ (38 బంతుల్లో4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) రెండో వికెట్‌కు 59 బంతుల్లోనే 92 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. మొత్తం 289 పరుగులు చేసిన వార్నర్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ'గా నిలిచాడు.

Story first published: Monday, November 15, 2021, 9:20 [IST]
Other articles published on Nov 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X