న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా ప్రపంచకప్ మెడల్ దొరికిందోచ్.. : జోఫ్రా ఆర్చర్

Jofra Archer finds lost World Cup 2019 medal

లండన్‌: 'నా ప్రపంచకప్ మెడల్ పోయింది బాబోయ్'.. అంటూ తెగ బాధపడిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్.. అది దొరికిందని వెల్లడించాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఇతర క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో సవాళ్లు విసురుకుంటుంటే ఈ ఇంగ్లండ్‌ పేసర్ మాత్రం కనిపించకుండా పోయిన 2019 వన్డే ప్రపంచకప్‌ పతకాన్ని వెతికే పనిలో పడి తెగ ఇబ్బంది పడ్డాడు. వారం రోజులుగా ఇంట్లో అణువణువూ వెతికానని అయినా తన ప్రపంచకప్‌ మెడల్ దొరకలేదని అసహనం వ్యక్తం చేశాడు. కొన్ని రోజుల క్రితమే ఆర్చర్‌ తన పాత ఇంటిని వదిలి కొత్త ఇంటికి చేరాడు.

ఇలా ఇళ్లు మారిన సమయంలో మెడల్‌ని కోల్పోయానని బీబీసీ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్చర్ తెలిపాడు. 'నా కోసం ఒకరు తయారు చేసిన ఓ ఫొటో ఫ్రేమ్‌లో నేను ఆ మెడల్‌ని ఉంచాను. అయితే అపార్ట్‌మెంట్ మారిన తర్వాత చూస్తే.. అక్కడ ఫొటో మాత్రమే ఉంది.. మెడల్ లేదు. ఇళ్లు మొత్తం వెతికాను. కానీ ఎక్కడా కనిపించలేదు. నాకు తెలిసి అది ఇంట్లోనే ఉంటుంది. కచ్చితంగా దొరుకుతుందని ధీమాతో ఉన్నాను. కానీ, దాని కోసం వెతికి నాకు పిచ్చి ఎక్కింది'' అని ఆర్చర్ అన్నాడు.

అయితే తాజాగా ఆ మెడల్ దొరికిందని ట్వీట్ చేశాడు. యాదృచ్చికంగా గెస్ట్ రూమ్‌లో వెతుకుతున్న స‌మ‌యంలో మెడ‌ల్ నా కంట ప‌డింది. హ‌మ్మ‌య్య‌ అని మెడల్ ఫొటోను షేర్ చేశాడు. ఇక ర‌స‌వ‌త్త‌రంగా సాగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో బౌండరీల లెక్క ఆధారంగా న్యూజిలాండ్‌పై నెగ్గిన ఇంగ్లండ్ తొలిసారి ట్రోఫీ ముద్దాడిన విష‌యం తెలిసిందే.

ఇక 2019లోనే అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన ఆర్చర్.. ఉత్కంఠగా సాగిన ప్రపంచకప్ ఫైనల్లో సూపర్ ఓవర్‌‌లో బాధ్యయుతంగా బౌలింగ్ చేసి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఈ మెగాటోర్నీలో 20 వికెట్లు తీసి టాప్-3 బౌలర్‌గా నిలిచాడు.

ఒక్కసారి కాఫీ తాగే.. భారీ మూల్యం చెల్లించుకున్నా: హార్దిక్ పాండ్యాఒక్కసారి కాఫీ తాగే.. భారీ మూల్యం చెల్లించుకున్నా: హార్దిక్ పాండ్యా

Story first published: Monday, April 27, 2020, 11:30 [IST]
Other articles published on Apr 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X