న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇషాన్‌ కిషన్‌ బ్యాటింగ్‌కు నేనేం ఆశ్చర్యపోలేదు: జాసన్‌ రాయ్‌

Jason Roy Not Surprised To See Star Player Ishan Kishan Teeing Off

అహ్మదాబాద్: టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్(32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56) మెరుపు బ్యాటింగ్ చూసి తానేమీ ఆశ్చర్యపోలేదని ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌ అన్నాడు. ఆదివారం జరిగిన సెకండ్ టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి భారీ భాగస్వామ్యాన్ని అందించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో ఈ యువ హిట్టర్‌పై సర్వత్రా ప్రశంసల జల్లుకురిసింది. ఈ నేపథ్యంలోనే ఓ బ్రిటీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాన్ ఇన్నింగ్స్‌పై స్పందించిన జాసన్ రాయ్ ఆసక్తికర వ్యాక్యలు చేశాడు.

ఐపీఎల్‌లోనే తెలుసు..

ఐపీఎల్‌లోనే తెలుసు..

ఇషాన్‌ కిషన్ స్టార్‌ ప్లేయరని, ఇదివరకే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున అనేకసార్లు విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడని జాసన్ రాయ్‌ గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే రెండో టీ20లో అతను విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగినా తనకు ఆశ్చర్యం కలిగించలేదని తెలిపాడు. 'ఇషాన్ కిషన్ ఓ స్టార్ ప్లేయర్. ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతను ఇలా ఆడుతాడని నాతో పాటు అందరికి తెలుసు. అందుకే అతని ఇన్నింగ్స్‌తో నేనేం ఆశ్చర్యానికి గురవ్వలేదు'అని జాసన్ రాయ్ చెప్పుకొచ్చాడు.

 దూకుడే మంత్రంగా..

దూకుడే మంత్రంగా..

ఇక ఇంగ్లండ్‌ ఆటతీరుపై స్పందించిన రాయ్‌.. దూకుడుగా ఆడటమే తాము నియమంగా పెట్టుకున్నామని చెప్పాడు. అయితే, మొతేరా లాంటి పిచ్‌మీద ఆడేటప్పుడు మరింత కచ్చితత్వంతో ఆడాలని, పిచ్‌ను త్వరగా ఆర్థం చేసుకోవాలన్నాడు. కానీ ధాటిగా ఆడే క్రమంలో కొన్నిసార్లు బ్యాట్స్‌మెన్‌ విఫలమౌతారని చెప్పాడు. కానీ తమకున్న బ్యాటింగ్‌ లైనప్‌ను బట్టి టాప్‌ఆర్డర్‌ ధాటిగా ఆడే అవకాశం ఉందన్నాడు. మరోవైపు తొలి రెండు మ్యాచ్‌ల్లో(49, 46) నిలకడగా ఆడిన తాను ఇకపై భారీ ఇన్నింగ్స్‌ ఆడాలనుకుంటున్నట్లు రాయ్‌ చెప్పుకొచ్చాడు.

నా టార్గెట్ అతను..

నా టార్గెట్ అతను..

ఇక సెకండ్ టీ20లో ఒకే బౌలర్‌ను లక్ష్యం చేసుకోని ఆడాలనుకున్నానని, కానీ అతని బౌలింగ్‌లోనే ఔటయ్యానని రాయ్ తెలిపాడు. 'ఒకే బౌలర్‌ను లక్ష్యం చేసుకొని ఆడాల్సిన పిచ్‌ అది. దురదృష్టంకొద్దీ నేను ఎంపిక చేసుకున్న బౌలరే నన్ను ఔట్‌ చేశాడు. సుందర్‌ను లక్ష్యంగా చేసుకొని ఆడాలనుకున్నా. కానీ, అతడే ఔట్‌ చేశాడు. ఆ ఓవర్‌లో నేను కొన్ని పరుగులు సాధించి ఉంటే అది మా బ్యాటింగ్‌కు మరింత దూకుడు పెంచేది' అని ఈ ఇంగ్లండ్ ఓపెనర్‌ పేర్కొన్నాడు. ఇక మంగళవాం జరిగే మూడో టీ20లో తమ జట్టు మరింత బలంగా పుంజుకొని ఆడుతుందని ధీమా వ్యక్తం చేశాడు.

Story first published: Tuesday, March 16, 2021, 18:26 [IST]
Other articles published on Mar 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X