న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫారిన్ లీగ్స్ మోజులో పడి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చిన జిమ్మీ నీషమ్! మళ్లీ ముందే తెలుసంటూ కవరింగ్!

 James Neesham explains why he declines New Zealand central contract

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు ఆ జట్టు ఆటగాళ్లు షాకిస్తున్నారు. ఫారిన్ లీగ్స్ మోజులో పడి ఆ దేశ సెంట్రల్ కాంట్రాక్టులనే వదులుకుంటున్నారు. కొద్దిరోజుల రోజుల క్రితమే న్యూజిండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, కొలిన్ గ్రాండ్ హోమ్.. సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులుకోగా.. ఇప్పుడు ఆ దేశ స్టార్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ వారి బాటలోనే నడిచాడు. సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే డబ్బుల కోసం తాను ఈ పని చేయడం లేదని, ఫారిన్ లీగ్స్‌లో ముందుగా కుదుర్చుకున్నా ఒప్పందాల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సోషల్ మీడియా వేదికగా ఆ దేశ అభిమానులకు వివరణ ఇచ్చాడు.ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేశాడు.

తప్పనిసరి పరిస్థితుల్లోనే..

తప్పనిసరి పరిస్థితుల్లోనే..

'నేను సెంట్రల్ కాంట్రాక్టును వదులుకోవడంతో డబ్బుల కోసమే ఈ పని చేసాననే వార్తలు రావడంతో పాటు అందరూ తప్పుబడతారనే విషయం నాకు ముందే తెలుసు. న్యూజిలాండ్ క్రికెట్ జూలై వరకు సెంట్రల్ కాంట్రాక్టు ఇచ్చి ఉంటే అస్సలు వదులుకునేవాడిని కాదు. అలా చేయకపోవడంతోనే నేను విదేశీ లీగ్స్‌లో ఆడేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాను. సెంట్రల్ కాంట్రాక్టును వదులుకోవడం చాలా కఠిన నిర్ణయం. ముందస్తుగా చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. న్యూజిలాండ్‌కు ఆడటం ఎప్పటికీ గొప్ప గౌరవంగా భావిస్తా. సెంట్రల్ కాంట్రాక్టు వదులుకున్నా నేను జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటా.. నా దేశం తరఫున ఆడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటా.'అని పేర్కొన్నాడు. అయితే జిమ్మీ మాటలను ఎవరూ నమ్మడం లేదు. ఈ కవరింగ్‌లు ఆపాలంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

 అనుమతి లేకుండా ఆడోచ్చనే..

అనుమతి లేకుండా ఆడోచ్చనే..

న్యూజిలాండ్‌లో సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లకే జట్టు ఎంపికలో తొలి ప్రాధాన్యత లభిస్తుంది. సెంట్రల్ కాంట్రాక్టులో ఉండి అందుబాటులో లేకుంటేనే మిగతా ఆటగాళ్లకు అవకాశం ఇస్తారు. సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్లు విదేశీ లీగ్స్ ఆడాలంటే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ తలనొప్పులు లేకుండా విదేశీ లీగ్స్ ఆడుకోవాలనే ఉద్దేశంతోనే ట్రెంట్ బౌల్ట్, కొలిన్ గ్రాండ్ హోమ్ సెంట్రల్ కాంట్రాక్టులను వదులుకున్నారు. తాజాగా జిమ్మీ నీషమ్ సైతం వారి జాబితాలో చేరాడు.

6 రెట్ల సంపాదన..

6 రెట్ల సంపాదన..

న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్టుతో వచ్చే డబ్బుల కంటే విదేశీ లీగ్స్ ద్వారా నాలుగు, ఐదు రెట్లు ఎక్కువగా సంపాదించవచ్చు. దాంతో ఆ జట్టు ఆటగాళ్లంతా విదేశీ లీగ్స్ వైపు చూస్తున్నారు. ముందుగా బౌల్ట్ సెంట్రల్ కాంట్రాక్టు వదులుకోగా.. ఆ కొద్దిరోజులకే గ్రాండ్ హోమ్ కూడా అతని బాటలో నడిచాడు. ఒకవిధంగా సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పుకోవడమంటే అనధికారిక రిటైర్మెంట్‌తోనే సమానం. ఒక్కసారి లీగ్ లో ఆట, డబ్బుకు అలవాటు పడ్డ క్రికెటర్లు మళ్లీ వెళ్లి దేశం తరఫున ఆడటం అంత సులువు కాదు. అదీగాక ఎప్పుడో గానీ అందుబాటులో ఉండే ఆటగాళ్లను సెలక్టర్లు కూడా పట్టించుకోరు. దానివల్ల జట్టు కూర్పు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.

 ఇంకెంతమంది..

ఇంకెంతమంది..

అయితే ఇది జిమ్మీ నీషమ్‌తోనే ఆగిపోతుందా? మరికొంతమంది ఆటగాళ్లు విదేశీ లీగ్స్ కోసం సెంట్రల్ కాంట్రాక్టులు వదులుకుంటారా? అనేది తేలాల్సి ఉంది. ఐపీఎల్ తో పాటు యూఏఈ వేదికగా జరుగనున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్, ది హండ్రెడ్, బిగ్ బాష్ లీగ్‌లతో ఫ్రాంచైజీ క్రికెట్ కళకళలాడుతున్నది. వీటిలో పాల్గొనేందుకే బౌల్ట్ తోపాటు మిగిలిన క్రికెటర్లూ తమ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికేందుకు కూడా వెనుకాడటం లేదు.

Story first published: Friday, September 16, 2022, 16:14 [IST]
Other articles published on Sep 16, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X