న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్ సిరీస్‌ ఓటమి.. ఇంగ్లండ్ ఆటగాళ్లపై వేటు!

James Anderson and Stuart Broad both left out of England Test squad for West Indies tour

లండన్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభావం పొందిన ఇంగ్లండ్ జట్టుపై ఆ దేశ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంది. జట్టులోని సీనియర్ ఆటగాళ్లపై వేటు వేసింది. వచ్చె నెలలో వెస్టిండీస్ పర్యటనకు ఇంగ్లండ్ టీమ్ వెళ్లాల్సి ఉంది. ఈ పర్యటనలో మూడు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌లో వెస్టిండీస్‌తో తలపడే జట్టును ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) మంగళవారం ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడా జట్టు వివరాలను వెల్లడించింది.

అయితే ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో దారుణంగా విఫలమైన 8 మంది ఆటగాళ్లపై వేటు వేస్తూ ఈసీబీ కఠిన నిర్ణయం తీసుకుంది. సీనియర్ ప్లేయర్స్ జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, హసీబ్ హమీద్ , డేవిడ్ మలన్ స‌హ మ‌రి కొంత మంది ఆట‌గాళ్ల‌ను జట్టు నుంచి తప్పిస్తూ చర్యలు తీసుకుంది. అలెక్స్ లీస్,మాథ్యూ ఫిషర్ వంటి యువ ఆట‌గాళ్లకు అవకాశం కల్పించగా.. విండీస్‌తో సిరీస్‌లో ఇంగ్లండ్ త‌రుపున వాళ్లంతా టెస్టుల్లోఅరంగ‌ట్రేం చేయ‌నున్నారు. ఇక ఆంటిగ్వా వేదిక‌గా ఇంగ్లండ్- వెస్టిండీస్ మ‌ధ్య తొలి టెస్ట్ మార్చి 8న ప్రారంభం కానుంది.

ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన యాషెస్ పరాభావంతో ఇంగ్లండ్ క్రికెట్‌లో గత వారం రోజులుగా ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, జోస్ బట్లర్‌ను జట్టు నుంచి ఈసీబీ తప్పించగా.. డైరెక్టర్ అష్లే గిలెస్, హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్, అసిస్టెంట్ కోచ్ గ్రహమ్ తోర్పె తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇక ఐదు టెస్ట్‌ల యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-4 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో చిత్తయిన విషయం తెలిసిందే. ఒక్క టెస్ట్ డ్రా చేసుకున్న ఇంగ్లండ్.. మిగతా అన్ని మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలను ఎదురు చూసింది.

వెస్టిండీస్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ఎంపిక చేసిన ఇంగ్లండ్ జ‌ట్టు:
జో రూట్ (కెప్టెన్), జొనాథన్ బెయిర్‌స్టో, జాక్ క్రాలీ, మాథ్యూ ఫిషర్, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, సాకిబ్ మహమూద్, క్రెయిగ్ ఓవర్టన్, మాథ్యూ పార్కిన్సన్, ఒల్లీ పోప్, బెన్ స్టీక్ రాబిన్సన్ , క్రిస్ వోక్స్, మార్క్ వుడ్

Story first published: Wednesday, February 9, 2022, 11:11 [IST]
Other articles published on Feb 9, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X