న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓపెనర్లు విఫలమైన వేళ... నాపై మరింత బాధ్యత పెరిగింది: కోహ్లీ

India vs West Indies, 2nd ODI : Virat Kohli Says It Was My Chance To Step Up And Take Responsibility
It was my chance to step up and take responsibility: Virat Kohli

హైదరాబాద్: ఓపెనర్లు ఓపెనర్లు శిఖర్‌ధావన్(2)‌, రోహిత్‌ శర్మ(18) విఫలమయ్యాక పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత తనపై పడిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. విరాట్ కోహ్లీ (120) సెంచరీతో రాణించగా, యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (71) హాఫ్ సెంచరీతో పరుగుల వరద పారించాడు.

దీంతో వర్షం కారణంగా డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిలో 46 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్‌ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "270కిపైగా పరుగులు చేస్తేనే మ్యాచ్‌పై పట్టు సాధించొచ్చని మాకు తెలుసు. ఓపెనర్లిద్దరూ ఔటయ్యాక జట్టును ఆదుకునే బాధ్యత నాపై పడింది" అని అన్నాడు.

<strong>విండీస్ దిగ్గజం లారా రికార్డులు బద్దలు కొట్టిన క్రిస్ గేల్‌</strong>విండీస్ దిగ్గజం లారా రికార్డులు బద్దలు కొట్టిన క్రిస్ గేల్‌

వన్డేల్లో కోహ్లీ 42వ సెంచరీ

వన్డేల్లో కోహ్లీ 42వ సెంచరీ

"క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి అడుగుపెట్టి సెంచరీ చేయడం సంతోషానిచ్చింది. శిఖర్ ధావన్‌, రోహిత్‌ శర్మలు పెద్ద ఇన్నింగ్స్‌ ఆడలేకపోయారు. దీంతో ఆ అవకాశం నాకు వచ్చింది" అని కోహ్లీ తెలిపాడు. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా... ఓపెనర్లు విఫలమైనప్పటికీ కోహ్లీ, అయ్యర్‌లు రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది.

వన్డేల్లో అత్యధిక పరుగులు.. గంగూలీని అధిగమించిన కోహ్లీ

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడంపై

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడంపై

ఈ క్రమంలో వన్డేల్లో విరాట్ కోహ్లీ 42వ సెంచరీ సాధించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడంపై కోహ్లీ "టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవడమే మంచిదే అయింది. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్‌లో విండీస్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా పిచ్‌ నెమ్మదించింది. ఆపై వారికి బ్యాటింగ్‌ చేయడం కష్టంగా మారింది. కీలక సమయంలో హెట్‌మెయర్‌, నికోలస్ వికెట్లు తీయడం మాకు కలిసి వచ్చింది" అని అన్నాడు.

కుల్దీప్‌ను జట్టులోకి తీసుకున్నాం

కుల్దీప్‌ను జట్టులోకి తీసుకున్నాం

విండీస్‌ జట్టులో ఎడమచేతి బ్యాట్స్‌మెన్‌ ఎక్కువగా ఉండడంతో చాహల్‌కి బదులు కుల్దీప్‌ను జట్టులోకి తీసుకున్నాం" అని పేర్కొన్నాడు. ఇక, ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్‌పై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. అయ్యర్‌లో ఆత్మవిశ్వాసం కనిపించిందని, అతడు తోడుగా నిలవడంతో తన మీద ఒత్తిడి తొలగిపోయిందని కోహ్లీ వెల్లడించాడు.

కోహ్లీ, భువనేశ్వర్‌ షో.. రెండో వన్డేలో భారత్‌ విజయం

ఓటమి బాధించింది

ఓటమి బాధించింది

కాగా 280 పరుగుల లక్ష్య చేధనకు దిగిన వెస్టిండిస్ జట్టు 27 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 148 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్నా... ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి 210 పరుగులకే కుప్పకూలింది. విండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ మాట్లాడుతూ "మా బౌలర్లు మంచి ప్రదర్శన చేసినా బ్యాట్స్‌మెన్‌ రాణించలేకపోయారు. ఈ ఓటమి బాధించింది" అని పేర్కొన్నాడు.

Story first published: Monday, August 12, 2019, 11:43 [IST]
Other articles published on Aug 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X