న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ, భువనేశ్వర్‌ షో.. రెండో వన్డేలో భారత్‌ విజయం

India vs West Indies, 2nd ODI: Team India Defeat West Indies By 59 Tuns Via DLS Method!!
India Vs West Indies: India won by 59 runs, Virat Kohli, Bhuvneshwar Kumar help India bag 1-0 lead

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: బ్యాట్‌తో కెప్టెన్ విరాట్ కోహ్లీ (120; 125 బంతుల్లో 14×4, 1×6), బంతితో పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ (4/31) చెలరేగడంతో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విండీస్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270కి సవరించారు. టార్గెట్ ఛేజింగ్‌కు దిగిన విండీస్ భారత బౌలర్ల ధాటికి 42 ఓవర్లలో 210 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్‌ లూయిస్‌ (65; 80బంతుల్లో 8×4, 1×6), నికోలస్ పూరన్‌ (42; 52బంతుల్లో 4×4, 1×6)లు రాణించారు. భారత బౌలరల్లో షమీ (2/39), కుల్దీప్‌(2/59) ఆకట్టుకున్నారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ 1-0తో బోణీ కొట్టింది. మూడో వన్డే ఈ నెల 14న జరగనుంది.

<strong>రోజర్స్‌ కప్‌.. సెమీస్‌లో బోపన్న జోడీ ఓటమి</strong>రోజర్స్‌ కప్‌.. సెమీస్‌లో బోపన్న జోడీ ఓటమి

మరోసారి గేల్‌ విఫలం:

మరోసారి గేల్‌ విఫలం:

లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌కు ఆరంభం దక్కలేదు. ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ (11; 24బంతుల్లో 1×4) ఈ మ్యాచ్‌లోనూ తన ప్రభావం చూపలేకపోయాడు. భారత బౌలర్లను ఎదుర్కొలేక పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. మరోవైపు లూయిస్‌ బ్యాట్‌ ఝళిపించాడు. గేల్‌ తడబడుతూ చివరకు 10వ ఓవర్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. అనంతరం షై హోప్‌ (5), హెట్‌మయర్‌ (18)లు కూడా త్వరగానే పెవిలియన్‌కు చేరడంతో విండీస్‌ కష్టాల్లో పడింది.

ఆదుకున్న లూయిస్‌-పూరన్‌:

ఆదుకున్న లూయిస్‌-పూరన్‌:

ఈ సమయంలో పూరన్‌తో కలిసి లూయిస్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరూ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఈ క్రమంలో లూయిస్‌ 23వ ఓవర్‌లో అర్ధ శతకం బాదాక.. కుల్దీప్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. తర్వాత పూరన్‌, ఛేజ్‌(18) పోరాడే ప్రయత్నం చేశారు. అయితే భువనేశ్వర్‌ 35వ ఓవర్‌లో ఇద్దరినీ వెంటవెంటనే పెవిలియన్‌కు పంపాడు. తర్వాతి ఓవర్‌లో జడేజా బ్రాత్‌వైట్‌ను (0) వెనక్కి పంపాడు. 42వ ఓవర్‌లో షమీ.. కాట్రెల్‌(17; 18బంతుల్లో 2×4, 1×6), థామస్‌ (0)లను ఔట్‌ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది.

విరాట్ షో:

విరాట్ షో:

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్‌, రోహిత్‌ శర్మలు ఆశించిన ఆరంభాన్నివ్వలేదు. తొలి ఓవర్ మూడో బంతికి ధావన్‌ (2) వికెట్ల ముందు దొరికిపోయాడు. తొలి ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. రెండో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి జోరు కొనసాగించాడు. మరోవైపు రోహిత్‌ మాత్రం నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశాడు. దీంతో 10 ఓవర్లకు భారత్‌ స్కోరు 55. 16వ ఓవర్ వేసిన చేజ్‌.. రోహిత్ శర్మను ఔట్ చేసాడు. నాలుగో స్థానంలో వచ్చిన రిషబ్‌ పంత్‌ (20) కూడా ప్రభావం చూపలేకపోయాడు.

'నాలుగో స్థానం గురించి ఆలోచించడం లేదు.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేస్తా'

శతక భాగస్వామ్యం:

శతక భాగస్వామ్యం:

శ్రేయస్‌ అయ్యర్‌ మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కోహ్లీతో కలిసి అతను ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ క్రమంలో 38వ ఓవర్లో కోహ్లీ సెంచరీ చేసాడు. కాసేపటికే అయ్యర్‌ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో విండీస్‌ బౌలర్లు చెలరేగడంతో.. కోహ్లీ, అయ్యర్‌ (71; 68బంతుల్లో 5×4, 1×6) పెవిలియన్ బాట పట్టారు. దీంతో నాలుగో వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇన్నింగ్స్ చివరలో జాదవ్‌ (16), జడేజా (16 నాటౌట్‌) బ్యాట్‌ ఝళిపించలేకపోయారు. ఆఖరి 10 ఓవర్లలో భారత్‌ 67 పరుగులు చేయగలిగింది. బ్రాత్‌వైట్‌ మూడు వికెట్లు తీసాడు.

1
46247
Story first published: Monday, August 12, 2019, 8:42 [IST]
Other articles published on Aug 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X