న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డేల్లో అత్యధిక పరుగులు.. గంగూలీని అధిగమించిన కోహ్లీ

Virat Kohli surpasses Sourav Ganguly to become second run getter for India in ODIs

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: రికార్డుల రారాజు, పరుగుల యంత్రం, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీ సాధించాడు. కోహ్లీ వన్డే కెరీర్‌లో ఇది 42వ సెంచరీ. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అరుదైన ఘనతలు సాధించాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ జాబితాలో కోహ్లీ రెండో స్థానానికి దూసుకెళ్లాడు.

<strong>కోహ్లీ, భువనేశ్వర్‌ షో.. రెండో వన్డేలో భారత్‌ విజయం</strong>కోహ్లీ, భువనేశ్వర్‌ షో.. రెండో వన్డేలో భారత్‌ విజయం

గంగూలీని వెనక్కి నెట్టి:

గంగూలీని వెనక్కి నెట్టి:

వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. రెండో వన్డేలో కోహ్లీ (120; 125 బంతుల్లో 14×4, 1×6) అద్భుత సెంచరీ చేయడంతో.. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ (11,363)ని వెనక్కి నెట్టి ద్వితీయ స్థానానికి చేరాడు. ప్రస్తుతం కోహ్లీ 11,406 పరుగులతో ఉన్నాడు. గుంగూలీ 311 మ్యాచ్‌ల్లో 11,363 పరుగులు సాధిస్తే.. కోహ్లీ 238వ వన్డేలోనే అధిగమించాడు.

తొలి స్థానంలో సచిన్‌:

తొలి స్థానంలో సచిన్‌:

వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌లలో భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ 18,426 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. సచిన్ తర్వాత కుమార సంగక్కర (14,234), రికీ పాంటింగ్‌ (13,704), సనత్ జయసూర్య (13,430), మహేళ జయవర్దనే (12,650), ఇంజమామ్‌ ఉల్ హాక్ (11,739), జాక్వస్‌ కలిస్‌ (11,579)లు వరుసగా ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.

అందరూ కెప్టెన్‌లే:

అందరూ కెప్టెన్‌లే:

వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌లో సచిన్ (18,426), కోహ్లీ (11,406), గంగూలీ (11,363)లు తొలి మూడు స్థానాల్లో ఉండగా.. మాజీ కెప్టెన్లు రాహుల్ ద్రవిడ్‌ (10,889), ఎంఎస్ ధోనీ (10,773)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అందరూ కెప్టెన్లు కావడం ఇక్కడ విశేషం. కోహ్లీ వన్డేల్లో 42 సెంచరీలు చేసాడు. వన్డేల్లో అత్యధిక శతకాల వీరుడు సచిన్‌ (49)కు ఇంకో 7 సెంచరీల దూరంలోనే ఉన్నాడు. ఒకే ప్రత్యర్థిపై సచిన్ (9, ఆస్ట్రేలియాపై) తర్వాత ఎక్కువ శతకాలు చేసిన రెండవ బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు.

మెరిసిన 'బాహుబలి'.. ఎట్టకేలకు బోణీ కొట్టిన తెలుగు టైటాన్స్‌

అత్యధిక పరుగుల వీరుడు:

అత్యధిక పరుగుల వీరుడు:

వన్డే ఫార్మాట్‌లో వెస్టిండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 26 ఏళ్లుగా పాకిస్తాన్‌ దిగ్గజ ఆటగాడు జావేద్‌ మియాందాద్‌ (1930 పరుగులు) పేరున ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 19 వద్ద కోహ్లీ.. మియాందాద్‌ రికార్డును బ్రేక్ చేశాడు. కోహ్లీ 34 మ్యాచ్‌ల్లోనే 71 సగటుతో ఈ ఘనత సాధించాడు. మియాందాద్ విండీస్‌పై 64 మ్యాచ్‌లాడి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిస్తే.. కోహ్లీ కేవలం 34 మ్యాచ్‌ల్లోనే అధిగమించాడు.

1
46247
Story first published: Monday, August 12, 2019, 10:23 [IST]
Other articles published on Aug 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X