న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: డ్రింక్స్‌ అందించడంలో తప్పేముంది.. అది నా డ్యూటీ: స్టార్ స్పిన్నర్

Its My Duty: Imran Tahirs Heartfelt Post on Carrying Drinks for his CSK teammates in IPL 2020

దుబాయ్: ఇమ్రాన్‌ తాహిర్‌.. దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ 2019లో 17 మ్యాచ్‌లు ఆడిన తాహిర్‌.. 26 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) సొంతం చేసుకున్నాడు. అయితే ఐపీఎల్ 2020‌లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. మైదానంలోని తమ జట్టు ఆటగాళ్లకు డ్రింక్స్‌ అందిస్తున్నాడు. తాహిర్‌ను మైదానం వెలుపల ఉంచడంపై సోషల్‌ మీడియాలో చర్చ జరగడంతో అతడు ట్విటర్‌ వేదికగా స్పందించాడు.

చిన్నతనంగా భావించడం లేదు

మైదానం లోపల ఉన్న ఆటగాళ్లకు డ్రింగ్స్‌ అందించడాన్ని తాను చిన్నతనంగా భావించడం లేదని ఇమ్రాన్‌ తాహిర్ తెలిపాడు. గత మ్యాచ్‌ల్లో నేను లోపల ఉన్నప్పుడు చాలా మంది డ్రింక్స్‌ అందించారని, ఇప్పుడు వారికి తిరిగి ఇస్తున్నానని, అందులో తప్పేముందని ఎదురు ప్రశ్నించాడు. 'గ్రౌండ్‌ లోపల నేనున్నప్పుడు చాలా మంది ఆటగాళ్లు నా కోసం డ్రింక్స్‌ తెచ్చేవాళ్లు. ఇప్పుడు నేను అందిస్తున్నా. అది నా పని. ఇప్పుడు నేను ఆడుతున్నానా? లేదా? అన్నది ముఖ్యం కాదు. నేను జట్టు కోసం పని చేస్తున్నానా? లేదా? అన్నదే కావాలి. అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా ఆడతాను. జట్టు గెలుపే నాకు ముఖ్యం' అని తాహిర్ ట్విటర్‌లో పోస్టు చేశాడు.

టచ్ చేశావ్ బాస్

టచ్ చేశావ్ బాస్

ఇమ్రాన్‌ తాహిర్ చేసిన ట్వీట్ కొద్ది నిమిషాల్లోనే నెట్టింట వైరల్ అయ్యింది. చెన్నై సూపర్ కింగ్స్ గెలవడమే నాకు ముఖ్యమంటూ తాహిర్ చేసిన ట్వీట్ సీఎస్‌కే అభిమానులను కదిలిచింది. టచ్ చేశావ్ బాస్ అంటూ.. తమిళ తంబీలు దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ తాహిర్‌కు సెల్యూట్ చేస్తున్నారు. 'నిజమైన ఆటగాడు అంటే ఇలా ఉండాలి', 'రియల్‌ ఛాంపియన్'‌ అంటూ మిగతా ఫాన్స్ కామెంట్లు పెడుతున్నారు. తాహిర్ దక్షిణాఫ్రికా తరఫున 20 టెస్టులు, 107 వన్డేలు, 38 టీ20లు ఆడాడు.

నలుగురు విదేశీ ఆటగాళ్లే

నలుగురు విదేశీ ఆటగాళ్లే

ఐపీఎల్ టోర్నీ తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉండాలన్న నిబంధన కారణంగా.. ఇమ్రాన్ తాహిర్‌కు ఈ సీజన్లో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇప్పటి వరకూ అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్లుగా షేన్ వాట్సన్, ఫాప్ డుప్లెసిస్ వస్తున్నారు. ఆల్‌రౌండర్‌ కోటాలో సామ్ కరన్, డ్వేన్ బ్రేవోలు ఆడుతున్నారు. ఈ నలుగురు జట్టుకు కీలక కాబట్టి తుది జట్టులో తాహిర్‌కు అవకాశం లేకుండా పోయింది. ఇక స్పిన్ విభాగంను రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లా, కరణ్ శర్మలతో మహీ నెట్టుకొస్తున్నాడు.

ఆ విషయం తాహిర్‌కు తెలుసు

ఆ విషయం తాహిర్‌కు తెలుసు

మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ ద్వారా వేరే జట్టుకు బదిలీ అయ్యే అవకాశం అతడికి ఉంది. కానీ చెన్నై అందుకు సుముఖంగా లేదు. జట్టు ప్రయోజనాల కోసం తనకు తుది జట్టులో అవకాశం లభించలేదని తాహిర్‌కు తెలుసని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. రాబోయే రోజుల్లో యూఏఈ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయి. కాబట్టి తమకు తాహిర్ కీలకం అవుతాడన్నారు. మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో ద్వారా ఆటగాళ్ల బదిలీకి తాము సుముఖంగా లేమని విశ్వనాథన్ స్పష్టం చేశారు.

CSA: షాకింగ్.. దక్షిణాఫ్రికా క్రికెట్‌పై నిషేధం!!

Story first published: Thursday, October 15, 2020, 15:00 [IST]
Other articles published on Oct 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X