
అక్టోబర్ 27 వరకు గడువు
సమస్యను పరిష్కరించడంలో సీఎస్‌ఏకు సహకరించేందుకు పలుమార్లు సమావేశమైనప్పటికీ.. బోర్డు సభ్యుల తీరులో ఎలాంటి మార్పు రాలేదని నాతి మెథ్వీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 'సీఎస్‌ఏ పాలనలో స్థిరత్వం తీసుకురావడానికి చాలా ప్రయత్నించాం. కానీ వారి నుంచి సహకారం అందలేదు. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాం. ఇక వారితో ఎటువంటి సంప్రదింపులు చేయం' అని మెథ్వీ తెలిపారు. తాను ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోకూడదో తెలిపేలా తమ వాదనలు వినిపించాలని దక్షిణాఫ్రికా క్రికెట్ అధికారులకు మెథ్వీ అక్టోబర్ 27 వరకు గడువును ఇచ్చారు.

ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు
ఐసీసీ రాజ్యాంగం ప్రకారం సభ్య దేశాల క్రికెట్ వ్యవహారాల్లో ఆయా ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు. అలా జరిగితే ఆ క్రికెట్ బోర్డును ఐసీసీ అంతర్జాతీయ పోటీల నుంచి బహిష్కరిస్తుంది. అవినీతి ఆరోపణలతో గత ఆగస్టులో సీఎస్‌ఏ సీఈవో తదితరులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక సీఎస్‌ఏలో అవినీతి జరిగినట్టు ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నిర్ధారించింది. దాంతో సీఎస్‌ఏపై చర్యలు తీసుకొనేందుకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది.

జింబాబ్వే, నేపాల్ క్రికెట్ వ్యవహారాల్లో
జింబాబ్వే, నేపాల్ క్రికెట్ వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడంతో.. 2019 జులైలో వారి సభ్యత్వాన్ని ఐసీసీ రద్దు చేసింది. ఆ తర్వాత రెండు దేశాల ప్రభుత్వాలు వెనక్కి తగ్గి.. క్రికెట్ బోర్డుకి స్వయం ప్రతిపర్తిని కట్టబెట్టాయి. ఆ తర్వాత ఐసీసీ మళ్లీ జింబాబ్వే, నేపాల్‌కి సభ్యత్వం ఇచ్చింది.

వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన
దక్షిణాఫ్రికా జట్టు క్రికెట్‌లో అత్యుత్తమ జట్టులలో ఒక్కటి. ఒకప్పుడు మేటి జట్లకు ధీటుగా ఉండేది. అయితే కొన్నెళ్లుగా సఫారీ జట్టు విఫలమవుతూ వస్తోంది. చిన్న జట్లకు సైతం పోటి ఇవ్వలేక చతికిలపడుతోంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన దక్షిణాఫ్రికా జట్టు కనీసం గ్రూప్ దశని కూడా దాటలేకపోయింది. టోర్నీలో 9 మ్యాచ్‌లాడిన ప్రొటీస్.. మూడింట్లో మాత్రమే విజయం సాధించింది. ఆ సమయంలో జట్టు ఎంపికలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపించాయి. స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ కూడా ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇక మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకుని.. మళ్లీ జట్టులోకి వస్తానని రెండేళ్ల నుంచి మొత్తుకుంటున్నా సీఎస్ఏ పెద్దలు పట్టించుకోవడం లేదు. బోర్డులో అంతర్గత కుమ్ములాటలు కారణంగా ఉన్నత స్థాయి అధికారులు బాధ్యతలు నుంచి తప్పుకున్నారు. బోర్డులో రాజకీయాలపై గత ఏడాది నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications

2014 తర్వాత తొలిసారి డకౌట్.. ఆ బ్యాట్స్‌మన్ ఎవరో తెలుసా?










