
కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం
తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘భారత జట్టు కాలక్రమేణా ఎంతో మారుతోంది. యువ క్రీడాకారిణులు జట్టులోకి వస్తున్నారు. ఏదో ఒక దశలో వ్యక్తిగతంగా కాకుండా జట్టు కోసం ఆలోచిస్తే.. కచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇదే. జట్టు కుదురుకుందని అనుకుంటే బహుశా ఇదే నా చివరి టీ20 ప్రపంచకప్ కావొచ్చు' అని ఆమె తెలిపింది.
పంత్ షాట్లు చూసి ఆశ్చర్యపోయా.. : ధావన్

మిథాలీ రాజ్ మరో ఓపెనర్ మంధానాతో 73
ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ రాజ్ మరో ఓపెనర్ మంధానాతో కలిసి 73 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇది భారత మహిళల జట్టుకు రెండో టీ20 మ్యాచ్. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతోన్న టోర్నీలో తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. అదే తరహాలో రెండో మ్యాచ్‌లో పాక్‌ను ఉతికారేసింది.

ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభించా
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను మిడిల్ ఆర్డర్‌లో ఆడి ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఓపెనర్‌గా క్రీజులోకి రావడంపై ఆమె మాట్లాడుతూ... ‘పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభించాను. పాక్ స్పిన్నర్లతో బరిలోకి దిగింది. దీంతో ఓపెనర్‌గా రావడమే సరైన నిర్ణయమనుకున్నాం. ఓపెనర్‌గా నాకు సాధ్యమైనంత వరకు బాగా ఆడతాను.'

అందుకనే ఆ స్థానంలో ఆడేందుకు సిద్ధపడ్డా
'న్యూజిలాండ్ బలమైన జట్టు. బాగా అనుభవం కలిగిన బ్యాటర్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించాలని అనుకున్నాం. అందుకనే ఆ స్థానంలో ఆడేందుకు సిద్ధపడ్డాను' అని మిథాలీ తెలిపింది. కాగా, భారత మహిళల జట్టు తన తదుపరి మ్యాచ్‌ను నవంబరు 15న ఐర్లాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే.. టీమిండియా హ్యాట్రిక్‌ను అందుకుంటుంది. నవంబరు 25న ఈ ప్రపంచ కప్ ముగుస్తుంది.