న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంత్ షాట్లు చూసి ఆశ్చర్యపోయా.. : ధావన్

India vs West Indies : Rishabh Pant's Extraordinary Shots | Oneindia Telugu
India vs West Indies: Shikhar Dhawan’s return to form was important ahead of Australia tour, says Rohit Sharma

హైదరాబాద్: భారత్‌-వెస్టిండీస్‌ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఉత్కంఠపోరులో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో చెన్నై వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో ఆరువికెట్ల తేడాతో విండీస్‌పై గెలిచి 3-0తో సిరీస్‌ సొంతం చేసుకుంది. 182 పరుగుల లక్ష్యాన్ని శిఖర్ ధావన్ (92: 62 బంతుల్లో 10ఫోర్లు, 2సిక్సులు), రిషబ్ పంత్ (58: 38 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సులు) దూకుడుగా ఆడటంతో భారత్ జట్టు ఆఖరి బంతికి ఛేదించిన విషయం తెలిసిందే.

రిషబ్ పంత్ చాలా బాగా ఆడాడని

రిషబ్ పంత్ చాలా బాగా ఆడాడని

ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ (4), కేఎల్ రాహుల్ (17) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కి చేరిపోయినా.. ధావన్-పంత్ జోడి మూడో వికెట్‌కి అభేద్యంగా 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా విజయం ఖాయమైంది. యువ హిట్టర్ రిషబ్ పంత్ చాలా బాగా ఆడాడని ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రశంసించాడు.

అద్భుతమైన భాగస్వామ్యం

అద్భుతమైన భాగస్వామ్యం

మ్యాచ్‌ చూసే వారికే కాదు టీమిండియా ఆటగాళ్లకూ ఉత్కంఠభరితంగా సాగింది. చాలా మంచి మ్యాచ్‌ ఆడాం. రిషబ్‌ చాలా బాగా ఆడాడు. మా ఇద్దరి మధ్య అద్భుతమైన భాగస్వామ్యం కుదిరింది. మ్యాచ్ ప్రారంభంలోనే టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ కష్టం నుంచి బయటపడాలంటే మేం బాగా ఆడాలి. రిషబ్‌తో నాకు మంచి భాగస్వామి లభించినట్లు అయింది.

షాట్లు బాదుతుంటే చూసి ఆశ్చర్యపోయా

షాట్లు బాదుతుంటే చూసి ఆశ్చర్యపోయా

పంత్ భారీ షాట్లు బాదుతుంటే చూసి ఆశ్చర్యపోయాను. చాలా చక్కగా ఆడాడు. స్పిన్నర్లు, పేసర్లని సమర్థంగా ఎదుర్కొన్న పంత్ కొన్ని చూడచక్కని సిక్సర్లు కూడా బాదాడు. నేను కొన్ని మ్యాచ్‌ల్లో బాగా ఆడివుండకపోవచ్చు. ఐదు వన్డేల సిరీస్‌లో 154 పరుగులే చేయడంతో నాపై విమర్శలు గుప్పించారు. కానీ.. వాటిని నేను పట్టించుకోలేదు. మళ్లీ ఫామ్ అందుకున్నందుకు సంతోషంగా ఉంది.

కొందరైతే టీమిండియాకు పనికి రానని

కొందరైతే టీమిండియాకు పనికి రానని

అప్పడు చాలా విమర్శించారు. కొందరైతే టీమిండియాకు పనికి రానని కూడా అన్నారు. ఈ మాటలు ఏవీ నా మీద ప్రభావం చూపలేదు. వారికి నా ఆట ద్వారా మాత్రమే సమాధానం చెప్పాలనుకున్నాను. ఎవరికైనా సమాధానం చెప్పుకోవాలంటే అది నా అంతరాత్మకే. విమర్శకుల మాటలు పట్టించుకుంటూ ఉంటే అవే నిజం చేసినట్లవుతుంది.

Story first published: Monday, November 12, 2018, 17:42 [IST]
Other articles published on Nov 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X