న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను సిక్స్ కొడితే ధోనీ గుస్సా అయ్యాడు: ఇషాంత్ శర్మ

Ishant Sharma reveals how he irritated MS Dhoni in the Qualifier of IPL 2019

న్యూఢిల్లీ: గత ‌ఐపీఎల్‌లో తన బ్యాటింగ్ స్కిల్స్ చూసి మహేంద్ర సింగ్ ధోనీ ఇరిటేట్ అయ్యాడని టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ తెలిపాడు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన లంబూ.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్‌లో కొన్ని షాట్లతో అలరించాడు. దాంతో తనకు బ్యాటింగే రాదని వెక్కిరించే ధోనీ షాకయ్యాడని వెల్లడించాడు.

జడ్డూపై అరిచాడు..

ప్రస్తుతం లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఈ లాంకీ పేసర్.. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో మహీ ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు.‘నువ్వు సిక్సర్లు కొట్టలేవని ధోనీ భాయ్ నన్ను ఆటపట్టిస్తుండేవాడు. నాలో ఆ సత్తా లేదని అనేవాడు. కానీ గతేడాది నేను జడ్డూ బౌలింగ్‌లో వరుసగా 4, 6 కొట్టా. దీనికి ధోనీ రియాక్షన్ ఎలా ఉందో అని అతని వైపు చూశా. అంతే.. కెప్టెన్ కూల్ వెంటనే జడ్డూపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎలా బౌలింగ్ చేస్తున్నావ‌ని క‌సురుకున్నాడు'అని ఇషాంత్ చెప్పుకొచ్చాడు.

మూడు బంతుల్లో 10 రన్స్..

మూడు బంతుల్లో 10 రన్స్..

గత ఐపీఎల్ సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో మూడు బంతులైతే ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ముగుస్తుందనగా లంబూ క్రీజులోకి వచ్చాడు. ఈ మూడు బంతుల్లో 10 పరుగులు రాబట్టడంతో ఢిల్లీ స్కోర్ 147కు చేరింది. అనంతరం చెన్నై 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకొని 6 వికెట్లతో గెలుపొందింది. ఫాఫ్ డూప్లెసిస్, షేన్ వాట్సన్ హాఫ్ సెంచరీలతో ఎల్లో ఆర్మీని ఫైనల్‌కు చేర్చారు. కానీ ధోనీ సేన ఫైనల్లో ముంబై చేతిలో ఒక్క పరుగుతో ఓడి టైటిల్ చేజార్చుకుంది.

పీక కోస్తానని హెచ్చరించడంతోనే 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టా: యువరాజ్

గుర్తుండిపోయే ప్రదర్శనలు..

ఇక లార్డ్స్ టెస్ట్‌లో తీసిన ఏడు వికెట్ల హాల్, ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో ఐదు వికెట్ల హాల్, ఈ రెండూ తన కెరీర్‌లో గుర్తుండిపోయే ప్రదర్శనలని ఇషాంత్ చెప్పుకొచ్చాడు. ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలంటే మాత్రం చాలా కష్టమన్నాడు.

 కరోనా కట్టడికి లంబూ 20 లక్షల విరాళం..

కరోనా కట్టడికి లంబూ 20 లక్షల విరాళం..

కరోనా కట్టడికి తనవంతు సాయంగా ఇషాంత్, తన సతీమణి ప్రతిమా సింగ్‌తో కలిసి రూ.20 లక్షల విరాళాన్ని పీఎం కేర్స్‌కు అందజేసిన విషయం తెలిసిందే. ‘ కరోనాతో దేశంలో నెలకొన్న దయనీయ పరిస్థితుల్లో నా వంతు సాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కేర్స్‌కు అందజేశాను. ఈ ఆపత్కాలంతో అందరూ అండగా నిలవడాల్సిన అవసరం ఉంది. ప్రతీ ఒక్కరు తోచిన సాయం చేయండి. చిన్న చిన్న విరాళాలు అన్ని కలిపితేనే పెద్దవి అవుతాయి'అని లంబూ అప్పట్లో ట్వీట్ చేశాడు.

Story first published: Tuesday, April 21, 2020, 9:40 [IST]
Other articles published on Apr 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X