న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మావాళ్లకు ఫైర్ ట్రక్స్ కావాలి సాయం చేయగలరా?: పఠాన్

Irfan Pathan takes sly dig at trollers after facing backlash over firecrackers criticism

న్యూఢిల్లీ: కరోనాపై పోరాటానికి దేశ సమైక్యతను చాటుతూ ఆదివారం 9 గంటల నుంచి 9 నిమిషాలపాటు దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన లభించిన విషయం తెలిసిందే. కశ్మీర్ నుంచి కన్యా కుమారి దాకా.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. ప్రతీ ఒక్కరు లైట్లను ఆపేసి..దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు.

అయితే కొంతమంది మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రధాని ఉద్దేశానికి వ్యతిరేకంగా లాక్‌డౌన్ నిబంధనలను తుంగలోకి తొక్కి వీధుల్లో కాగడాలతో ర్యాలీ చేయడం, టపాసులు పేల్చడం వంటివి చేశారు. ఇలాంటి వారిపై ఇప్పటికే భారత క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, గౌతం గంభీర్, హర్భజన్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు.

మీ నమాజ్ కన్నా నయం..

మీ నమాజ్ కన్నా నయం..

అయితే ఈ అత్యుత్సాహ ప్రదర్శనలను ముందే ఊహించిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. ప్రధాని మోదీ పిలుపునకు మద్దతు తెలియజేస్తూనే.. క్రాకర్స్ కాల్చనంతవరకు ఈ కార్యక్రమం బాగుంటుందని ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ నచ్చని కొందరూ పఠాన్‌పై తీవ్ర ట్రోలింగ్‌కు దిగారు. రోజుకు ఐదు సార్లు చేసే మీ నమాజ్ కన్నా ఇదే బెటరేనని కామెంట్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఇర్ఫాన్ దిమ్మతిరిగే కౌంటరించ్చాడు. ‘మా వాళ్లకి క్రాకర్స్ ట్రక్ కావాలి ఎవరైన సాయం చేయగలరా?'అని వ్యంగ్యంగా బదులిచ్చాడు. క్రాకర్స్ కాల్చవద్దంటే.. కాలుస్తామంటారేందని అసహనం వ్యక్తం చేశాడు.

అభాగ్యులకు పఠాన్ బ్రదర్స్ అండ..

అభాగ్యులకు పఠాన్ బ్రదర్స్ అండ..

కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించడంతో రెక్కాడితే కానీ డొక్కాడని జీవులు రోడ్డున పడ్డారు. వీరికి అండగా అనేక మంది తమ విరాళాలను ప్రకటిస్తుండగా.. పఠాన్ బ్రదర్స్ మాత్రం నేరుగా సాయం అందించారు. ఇప్పటికే నిరుపేద ప్రజలకు మాస్క్‌‌లను పంచిన ఈ స్టార్ ప్లేయర్స్.. తాజాగా తమ సమీపంలోని అభాగ్యులకు 10వేల కేజీల బియ్యం, 700 కేజీల ఆలుగడ్డలను అందజేశారు. తమకు చేతనైనంత సాయం చేయడానికి ఎప్పుడూ సిద్దమేనని ప్రకటించారు.

మూర్ఖుల వల్ల అసాధ్యం..

మూర్ఖుల వల్ల అసాధ్యం..

టపాసుల వల్ల జైపూర్‌లోని ఓ ఇంట్లో ఆదివారం రాత్రి మంటలు ఏర్పడ్డాయని ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది దీనిపై హర్భజన్ సింగ్ ఫైర్ అయ్యాడు. ‘కరోనా వైరస్‌ నిర్మూలనకు మనం ఓ మార్గాన్ని కనిపెట్టగలం. కానీ ఇలాంటి వారి మూర్ఖత్వం వల్ల అది ఎలా సాధ్యమవుతుంది'అని తీవ్ర ఆగ్రహం వక్తం చేస్తూ ట్వీట్ చేశాడు.

ఇది సందర్భమా..?

ఇది సందర్భమా..?

టపాసులు పేల్చడంపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘కరోనాపై పోరులో మధ్యలోనే ఉన్నాం. ఇంకా విజయం సాధించలేదు. టపాసులు పేల్చడానికి ఇది సందర్భం కాదు. అందరూ ఇళ్లలోనే ఉండండి' అని గంభీర్‌ ట్వీట్‌ చేశాడు. ఇక ఈ క్రాకర్స్ ఎక్కడ దొరికాయ్ అంటూ అశ్విన్ వ్యంగ్యస్త్రాలు సంధించగా.. వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకోవడానికి భారత్ ఇంకా ప్రపంచకప్ గెలవలేదని, దానికి ఇంకా సమయం ఉందని రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు.

Story first published: Tuesday, April 7, 2020, 16:41 [IST]
Other articles published on Apr 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X