న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL: పాపం.. ఆ నలుగురికి సీజన్​ మొత్తం నిరాశే.. ఒక్క మ్యాచ్‌లో చాన్స్ రాలే!

IPL: These 4 players who were part of squads but never got a chance in XI

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రపంచంలోనే ది బెస్ట్ టీ20 లీగ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్వాలిటీ ఆఫ్ క్రికెట్, ఎంటర్‌టైన్‌మెంట్‌ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. ఈ లీగ్ ద్వారా ఎంతో మంది ఆటగాళ్లు రాత్రికి రాత్రే స్టార్లయ్యారు. అందుకే ఈ లీగ్ ఆడేందుకు క్రికెటర్లందరూ ఎగబడుతుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఐపీఎల్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే జట్టులో నలుగురి విదేశీ ఆటగాళ్లే ఉండాలనే నిబంధన చాలా మంది ఓవర్‌సీస్ ఆటగాళ్లకు శాపంగా మారింది.

అత్యుత్తమ క్రికెటర్ అనుకున్నా.. తుది జట్టులో చోటు దక్కడం లేదు. సరైన కాంబినేషన్, టీమ్ మేనేజ్‌మెంట్ ప్రణాళికల్లో భాగంగా చాలా మంది స్టార్ ప్లేయర్లు బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. ఇలా 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో జట్టులో ఉంటూ ఓ సీజన్ మొత్తం బెంచ్‌కే పరిమితమైన ఓ నలుగురు స్టార్ ప్లేయర్లు గురించి తెలుసుకుందాం!

స్టీవ్ స్మిత్ (ఆర్‌సీబీ)

స్టీవ్ స్మిత్ (ఆర్‌సీబీ)

ఈ తరం క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లు ఎవరంటే.. అందరి నోట వచ్చే పేర్లు విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్. ఈ ముగ్గురు వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మైదానంలో వారు సాధించిన ఘనతలే నిదర్శనం. అయితే విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ ఒకే డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నారన్న విషయం చాలా మందికి తెలియదు.

కానీ 2010 సీజన్​లో విరాట్, స్మిత్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి ఆడారు. కోహ్లీ జట్టుకు ప్రధాన బ్యాట్స్​మన్​గా ఉండగా, స్మిత్​ స్పెషలిస్ట్ బౌలర్​, బ్యాట్స్​మన్​గా ఉండేవాడు. కానీ అతని సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసిన ఆర్‌సీబీ సీజన్​ మొత్తం స్మిత్​ను బెంచ్​కే పరిమితం చేసింది. కానీ అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్​లో 11 వికెట్లతో ఈ ఆసీస్ క్రికెటర్ సత్తా చాటాడు. స్పిన్నర్‌గా కెరీర్ ప్రారంభించిన స్మిత్ తర్వాత పూర్తి బ్యాట్స్‌‌మన్‌గా మారిన విషయం తెలిసిందే.

జోష్ హజల్​వుడ్ (ముంబై ఇండియన్స్)

జోష్ హజల్​వుడ్ (ముంబై ఇండియన్స్)

ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్న జోష్ హజల్ వుడ్ కూడా ఐపీఎల్‌లో ఓ సీజన్ మొత్తం బెంచ్‌కే పరిమితమయ్యాడు. 2014 సీజన్​లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతను తుది జట్టులో అవకాశం అందుకోలేకపోయాడు. లసిత్ మలింగా లాంటి దిగ్గజ విదేశీ పేసర్ ఉండటంతోమరో ఓవర్‌సీస్ బౌలర్​కు అవకాశం లేకుండా పోయింది. మరోవైపు భారత స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఉండటంతో హజల్ వుడ్ ముంబై ఇండియన్స్​ తరఫున ఆడకుండానే ఆ సీజన్​ను ముగించాడు.

నికోలస్ పూరన్ (ముంబై ఇండియన్స్)

నికోలస్ పూరన్ (ముంబై ఇండియన్స్)

ఐపీఎల్ 2017 సీజన్​లో ముంబయి ఇండియన్స్ వెస్టిండీస్ విధ్వంసకర​ బ్యాట్స్​మన్ నికోలస్ పూరన్​ను జట్టులోకి తీసుకుంది. ఆ సమయంలో అతని వయసు 21 ఏళ్లు. ప్రతి సీజన్​లోనూ అత్యుత్తమ ఆటగాళ్లతో బరిలో దిగే ముంబై ఇప్పటికి చాలామందిని బెంచ్​కే పరిమితం చేసింది. రెండు సీజన్లుగా విధ్వంసకర ఓపెనర్ క్రిస్ లిన్ ఒకే మ్యాచ్ ఆడాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగే 2017లోనూ నికోలస్ పూరన్​ను ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. ఆ ఏడాది కొందరిపైనే నమ్మకం ఉంచిన ముంబై విజేతగానూ నిలిచింది. ప్రస్తుతం పూరన్​ ఐపీఎల్​లో అత్యుత్తమ బ్యాట్స్​మన్​గా కొనసాగుతున్నాడు. పంజాబ్ తరఫున గత సీజన్‌లో అదరగొట్టాడు. కానీ ఈ సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు.

బ్రెండన్ టేలర్ (సన్​రైజర్స్ హైదరాబాద్)

బ్రెండన్ టేలర్ (సన్​రైజర్స్ హైదరాబాద్)

జింబాబ్వే జట్టులో గొప్ప ఆటగాడిగా పేరుగాంచిన బ్రెండన్ టేలర్‌కు కూడా ఐపీఎల్‌లో నిరాశే ఎదురైంది. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ అయిన బ్రెండన్.. జింబాబ్వే ట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. 2014లో అతనికి ఐపీఎల్​ ఆడే అవకాశం దక్కింది. సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు అతన్ని కొనుగోలు చేసింది. డారెన్ సామి కెప్టెన్సీ వహించిన ఈ సీజన్​లో అంచనాలను అందుకోవడంలో విఫలమైన సన్​రైజర్స్ పాయింట్ల పట్టికలో 6వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆరోన్ ఫించ్, వార్నర్​లాంటి విదేశీ బ్యాట్స్​మెన్ జట్టులో ఉండటం వల్ల మరో ఓవర్సీస్ బ్యాట్స్​మన్​కు అవకాశం లేకుండా పోయింది. అలాగే సీజన్ మొత్తం నమన్ ఓజా కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. దీంతో బ్రెండన్ టేలర్​కు తుదిజట్టులో చోటు లభించలేదు.

Story first published: Tuesday, May 11, 2021, 13:14 [IST]
Other articles published on May 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X