న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL Media Rights: బీసీసీఐకి మరో ఎదురు దెబ్బ..ఈవేలం రేసు నుంచి తప్పుకున్న మరో సంస్థ!

IPL Media Rights: Big SETBACK for BCCI, ‘ZEE Unlikely to BID for IPL Rights’

న్యూఢిల్లీ: భారత దేశ క్రికెట్ పండుగ ఐపీఎల్ మీడియా హక్కులు(2023-2027) ద్వారా భారీ ఆధాయాన్ని ఆర్జించాలని భావిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే అమెజాన్, గూగుల్ ఈ వేలం నుంచి తప్పుకోగా తాజాగా జీ సంస్థ కూడా వైదొలిగినట్లు తెలుస్తోంది. ఆదివారం జరుగనున్న ఈ వేలానికి ముందు.. శుక్రవారం నిర్వహించిన టెక్నికల్ బిడ్డింగ్ లో అమెజాన్ పాల్గొనలేదు.

అమెజాన్ తో పాటు గూగుల్ కూడా ఉన్నఫళంగా బిడ్డింగ్ నుంచి తప్పుకున్నాయి. తాజాగా జీ నెట్‌వర్క్ సైతం పక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఇన్‌సైడ్ స్పోర్ట్స్ వెబ్‌సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది.

తప్పుకోవడానికి కారణం ఇదే..

తప్పుకోవడానికి కారణం ఇదే..

ఈ కథనం ప్రకారం ప్యాకేజి ఏ(భారత ఉపఖండ టీవీ హక్కులు) రేసు నుంచి జీ నెట్ వర్క్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. కేవలం డిజిటల్ మీడియా రైట్స్ పోటీలో మాత్రమే నిలిచినట్లు సమాచారం. ప్యాకేజి-ఏ లో బిడ్డింగ్ ప్రక్రియ నుంచి జీ తప్పుకోవడానికి కారణాలున్నాయి. జీ త్వరలోనే సోనీతో కలవబోతున్నది. టెలివిజన్ రంగంలో చాలా కాలంగా దిగ్గజాలుగా ఉంటున్న ఈ రెండు సంస్థలు.. త్వరలోనే మెర్జ్ కాబోతున్నాయి. దీంతో తమతో తమకే పోటీ ఎందుకనే కారణంతో ప్యాకేజీ-ఏ నుంచి జీ తప్పుకున్నట్టు తెలుస్తున్నది.

నాలుగు ప్యాకేజీలు..

నాలుగు ప్యాకేజీలు..

ఈ మీడియా ప్రసార హక్కులను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ 'ఎ'లో భారత ఉపఖండ టీవీ హక్కులు, 'బి'లో భారత ఉపఖండ డిజిటల్‌ హక్కులు, 'సి'లో ప్లేఆఫ్స్‌తో సహా కొన్ని ప్రత్యేక మ్యాచ్‌ల డిజిటల్‌ హక్కులు (భారత ఉపఖండంలోనే), 'డి'లో భారత్‌ మినహా మిగతా ప్రపంచ దేశాల్లో టీవీ, డిజిటల్‌ హక్కులు చేర్చారు. ప్యాకేజీ 'సి'లో భాగంగా ప్రత్యేక మ్యాచ్‌లంటే.. సీజన్‌ ఆరంభ, వారాంతాల్లో జరిగే సాయంత్రం మ్యాచ్‌లు, ఫైనల్‌ సహా నాలుగు ప్లేఆఫ్స్‌ ఉంటాయి. సీజన్‌లో మ్యాచ్‌ల సంఖ్యను బట్టి వీటిని నిర్ణయిస్తారు.

ఒక్కో మ్యాచ్‌కు చెల్లించే ధరనే

ఒక్కో మ్యాచ్‌కు చెల్లించే ధరనే

ఒక సీజన్‌లో 74 మ్యాచ్‌లు జరిగితే ప్రత్యేక మ్యాచ్‌ల సంఖ్య 18గా ఉంటుంది. ఈ ఒప్పందంలోని చివరి రెండు సీజన్లలో మ్యాచ్‌ల సంఖ్యను 94కు పెంచే అవకాశాలున్నాయి. అప్పుడు ప్రత్యేక మ్యాచ్‌ల సంఖ్య 22 అవుతుంది. ఈ ఒక్కో ప్యాకేజీలో ఒక్కో మ్యాచ్‌ ధర వేర్వేరుగా ఉంటుంది. ఒక్కో మ్యాచ్‌కు చెల్లించే ధరనే సంస్థలు బిడ్‌ చేయాల్సి ఉంటుంది. చివరకు అన్ని మ్యాచ్‌లకు కలిపి వాటిని లెక్కగట్టి అయిదేళ్ల కాలానికి ఎంత అవుతుందో తేలుస్తారు. ఒక్కో సంస్థ ఎన్ని ప్యాకేజీలకైనా బిడ్లు దాఖలు చేయవచ్చు.

తొలిసారి ఈవేలం..

తొలిసారి ఈవేలం..

ఐపీఎల్ మీడియా హక్కుల కోసం తొలిసారి బీసీసీఐ ఈ- వేలం నిర్వహిస్తుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ వేలం ప్రారంభమవుతుంది. ఈ వేలానికి ప్రత్యేకంగా ముగింపు తేదీని ప్రకటించలేదు. కానీ సోమవారం లేదా మంగళవారం ఇది ముగిసే అవకాశం ఉంది. మిగతా సంస్థలన్నీ పక్కకు తప్పుకుని, అత్యధిక బిడ్‌ దాఖలయ్యే వరకూ ఈ వేలం కొనసాగుతుంది. ఆన్‌లైన్‌ పోర్టల్‌లో సంస్థలు తమ బిడ్లు దాఖలు చేస్తాయి.

ఒక్కొక్క సంస్థ వేలం నుంచి తప్పుకుంటూ చివరకు ఒక్కటి మాత్రమే మిగిలేంత వరకూ వేలం జరుగుతుంది. సంస్థలు వేసిన బిడ్లు ఎప్పటికప్పుడూ ప్రత్యక్షంగా తెర మీద కనిపిస్తాయి. కానీ వాటి పేర్లు మాత్రం బయటపెట్టరు. చివరకు అత్యధిక బిడ్‌ దాఖలు చేసిన సంస్థ పేరును ప్రకటిస్తారు.

టెక్నికల్ బిడ్డింగ్ క్లీయర్ చేసిన సంస్థలివే..

టెక్నికల్ బిడ్డింగ్ క్లీయర్ చేసిన సంస్థలివే..

- డిస్నీ స్టార్

- రిలయన్స్ వయాకామ్ 18

- సోనీ నెట్వర్క్

- జీ ఎంటర్టైన్మెంట్

- టైమ్స్ ఇంటర్నెట్ (డిజిటల్ రైట్స్ కు మాత్రమే)

- రిలయన్స్ జియో (డిజిటల్ రైట్స్)

- సూపర్ స్పోర్ట్ (ఉపఖండం ఆవల - ప్యాకేజీ డీ)

Story first published: Saturday, June 11, 2022, 14:55 [IST]
Other articles published on Jun 11, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X