న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL Final 2022: షేన్ వార్న్‌కు ప్రేమతో.. ఈసారి రాజస్థాన్ రాయల్స్ ..!

IPL Final 2022: RR Captain Sanju Samson Wants To Win Trophy For Shane Warne

దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్.. 14సంవత్సరాల క్రితం ఐపీఎల్ టోర్నమెంట్‌లో తొలి ట్రోఫీని రాజస్థాన్ రాయల్స్‌కు అందించాడు. ఆ తర్వాత ఈసారే రాజస్థాన్ రాయల్స్ మళ్లీ ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఈఏడాది మార్చిలో షేన్ వార్న్ అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫస్ట్ రాయల్ అయిన లెజెండ్ షేన్ వార్న్ కోసం ఈసారి ట్రోఫీ గెలవాలని రాజస్థాన్ రాయల్స్ జట్టు భావిస్తోంది. ఇకపోతే క్వాలిఫయర్ 2లో సెంచరీ అనంతరం స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ షేన్ వార్న్‌కు నివాళులుర్పించాడు.

ఇక క్వాలిఫయర్ 2లో ఆర్సీబీని చిత్తు చేసిన ఆర్ఆర్.. గుజరాత్ టైటాన్స్‌‌తో నేడు ఫైనల్లో తలపడనుంది. ఇకపోతే మ్యాచ్ అనంతరం బట్లర్ మాట్లాడుతూ.. 'రాజస్థాన్ రాయల్స్ టీం కోసం షేన్ వార్న్ చేసిన సేవ ఎనలేనిది. మొదటి సీజన్‌లోనే జట్టును విజయపథంలో నడిపించాడు. ఇక అతని మరణం మమ్మల్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. మేము అతన్ని చాలా మిస్ అవుతున్నాం. కానీ ఆయన ఎక్కడున్నా.. ఈ రోజు మా టీం ప్రదర్శన చూసి గర్వపడుతాడని భావిస్తున్నాం.' అని బట్లర్ పేర్కొన్నాడు.

ఇప్పటికే డివై పాటిల్ స్టేడియంలో వార్న్ కు ఘన నివాళులు

ఇప్పటికే డివై పాటిల్ స్టేడియంలో వార్న్ కు ఘన నివాళులు

ఇకపోతే ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్‌లోని 132,000 మంది ప్రేక్షకుల సామర్థ్యం గల నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు పూర్తిగా సన్నద్ధమైంది. ఇక ఆ జట్టుకు ప్రధాన బలం అనుభవశీలురైన ప్లేయర్లు ఉండడం. ఇక ఈ సీజన్‌లో ఇప్పటికే వార్న్ కోసం రాజస్థాన్ భావోద్వేగ నివాళులర్పించింది.

ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో స్టేడియాన్ని వార్న్ చిత్రాలతో అలంకరించడంతో పాటు రాజస్థాన్ సిబ్బంది తమ కాలర్లపై 'SW23' ఉన్న షర్టులు ధరించి నివాళులర్పించారు. వార్న్ 2008లో డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మొదటి సీజన్‌లో రాయల్స్‌‌కు తొలి టైటిల్ అందించాడు.

షేన్ వార్న్ కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలన్ సంజూ శాంసన్

షేన్ వార్న్ కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలన్ సంజూ శాంసన్

ఇకపోతే రాయల్స్ లేని లోటును రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుత కెప్టెన్ సంజూశాంసన్ ప్రస్తావించాడు. ఇక టోర్నమెంట్ ప్రారంభం నుంచి అతను మా వెంటే ఉన్నాడని భావిస్తున్నాం. ఫస్ట్ రాయల్‌గా మా జట్టును అతను నడిపించిన విధానం మాకు ఎప్పటికీ స్పూర్తివంతమే. మేము ఇప్పటికే ఈ సీజన్లో చాలా పురోగతి సాధించాం. అతని కోసం టైటిల్ సాధించాలనే మరో అడుగు వేయాలని భావిస్తున్నాం అని ప్రస్తుత రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు.

అలాగే ఇది మాకు చాలా ప్రత్యేక సందర్భం. అయినా నేను ఎక్కువగా దీని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. మేము కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాం. మేము వార్న్ కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటున్నామని శాంసన్ పేర్కొన్నాడు.

అతి తక్కువ ఖర్చు పెట్టిన ఫ్రాంఛైజీని విజేతగా నిలిపిన వార్న్

అతి తక్కువ ఖర్చు పెట్టిన ఫ్రాంఛైజీని విజేతగా నిలిపిన వార్న్

ప్రారంభ 2008 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ ఎనిమిది ఫ్రాంచైజీల్లో తమ జట్టు కోసం అతి తక్కువ ఖర్చు చేసిన ఫ్రాంఛైజీగా నిలిచింది. ఇక ఆ జట్టు తన అరంగేట్రం మ్యాచ్‌లోనే తొమ్మిది వికెట్ల తేడాతో ఢిల్లీతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే తర్వాత వార్న్ తన కెప్టెన్సీ పవర్ ద్వారా జట్టులో ఉన్న ఆటగాళ్లలోని మేటి ఆటను బయటకు తీసుకొచ్చాడు. తోటి ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్ భీకర ఫాంలోకి రావడం, యూసుఫ్ పఠాన్ చెలరేగడం, మునాఫ్ పటేల్ తదితరులు రాణించడంతో రాజస్థాన్ లీగ్ దశలో 11మ్యాచ్‌లు గెలిచింది. అనంతరం ఫైనల్‌కు అర్హత సాధించి గెలుపొందింది.

తొలి ఐపీఎల్ ఫైనల్లో..

తొలి ఐపీఎల్ ఫైనల్లో..

2008లో ఐపీఎల్ తొలి సీజన్ ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగింది. ఈ సీజన్లో వార్న్ కెప్టెన్‌గా వ్యవహరించిన రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలవగా.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా షాన్ మార్ష్ ఆరెంజ్ క్యాప్‌ను పొందాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సోహిల్ తన్వీర్ పర్పుల్ క్యాప్‌ని పొందాడు. షేన్ వాట్సన్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఫైనల్లో యూసుఫ్ పఠాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఫైనల్లో చెన్నైని 163పరుగులకు కట్టడి చేసిన రాజస్థాన్.. తర్వాత ఛేజింగ్లో చివరి బంతికి థ్రిల్లింగ్ విజయం సాధించింది.

Story first published: Sunday, May 29, 2022, 10:59 [IST]
Other articles published on May 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X