న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ ఆల్‌స్టార్స్ మ్యాచ్ రద్దవ్వలేదు.. కొంచెం ఆలస్యం.!

IPL All-Stars Match Postponed To End Of Tournament
IPL All-Stars match postponed to end of tournament

ముంబయి: సహాయ కార్యక్రమాల నిధుల సేకరణ కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ముందు ఎనిమిది జట్ల ఆటగాళ్లతో ఆల్‌స్టార్ మ్యాచ్ నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఈ ఆల్‌స్టార్‌ గేమ్ కాన్సెప్ట్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీలు విముఖత వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. వ్యాపార కోణంలో ఈ మ్యాచ్ వల్ల తమకు తీరని నష్టాలు వస్తాయని, ఆటగాళ్లకు గాయాలయ్యే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపించాయి. దీంతో ఆల్‌స్టార్స్‌ మ్యాచ్‌ జరక్కపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. కచ్చితంగా రద్దు చేస్తారని గురువారం సాయంత్రం వరకు ఊహాగానాలు వినిపించాయి.

వాయిదానే..

వాయిదానే..

అయితే ఇవన్నీ గాలీ వార్తలేనని, ఈ మ్యాచ్ రద్దు చేయలేదని కొంచెం ఆలస్యంగా సీజన్ చివర్లో నిర్వహిస్తామని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశాడు. 'ఆల్‌స్టార్స్‌ మ్యాచ్‌ను రద్దు చేయడం లేదు. కాకపోతే టోర్నీ చివరకు వాయిదా వేస్తున్నాం. ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలనుకుంటున్నాం. ఫామ్‌ ఆధారంగా జట్లను ఎంపిక చేస్తాం' అని బ్రిజేష్ పటేల్‌ తెలిపాడు.

రికార్డుల రారాజు కోహ్లీకి ఏమైంది? గత 19 ఇన్నింగ్స్‌లుగా ఒక్క సెంచరీ లేదు

ఆల్ స్టార్ గేమ్ అంటే..?

ఆల్ స్టార్ గేమ్ అంటే..?

ఈ ఆల్ స్టార్ గేమ్ కాన్సెప్ట్‌ ఐపీఎల్‌కు కొత్త. కానీ నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) ఈ తరహా మ్యాచ్‌లను ఎక్కువగా నిర్వహిస్తుంది. ఇక క్రికెట్‌లో వరల్డ్ ఎలెవన్ , ఆసియా ఎలెవన్ మధ్య జరిగిన మ్యాచ్‌లు ఈ తరహా కాన్సెప్ట్‌కు చెందినవే. ఆసియా దేశాల్లోని ఆటగాళ్లంతా ఒక జట్టైతే.. మిగతా ప్రపంచ ఆటగాళ్లంత మరో జట్టుగా తలపడ్డారు. ఇప్పుడు ఐపీఎల్ టీమ్‌ల్లోని అన్ని జట్ల ఆటగాళ్లు సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ టీమ్‌లుగా విడిపోయి ఆడనున్నారు. అభిమానులకు కావాల్సిన మజా ఇవ్వనున్నారు.

ఒకేజట్టులో ధోని, కోహ్లీ, రోహిత్ ..

ఒకేజట్టులో ధోని, కోహ్లీ, రోహిత్ ..

ఈ ఆల్‌స్టార్ గేమ్ కాన్సెప్ట్‌లో భాగంగా ఐపీఎల్‌లోని మొత్తం 8 జట్ల ఆటగాళ్లను రెండు గ్రూపులుగా విభజించనున్నారు. ఒక గ్రూప్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఉండనుండగా.. రెండో గ్రూప్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు ఉండనున్నారు.

ఇలా నాలుగు జట్లలోని కీలక ఆటగాళ్లు తుది జట్లుగా బరిలోకి దిగి పోటీపడనున్నారు. దీంతో టీమిండియా లెజండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ప్రస్తుత టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ ఒకే జట్టులో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక వీరితో పాటు జస్ప్రిత్ బుమ్రా, విలియమ్సన్, రషీద్ ఖాన్‌లు కూడా ఉండనున్నారు. మరో జట్టు కూడా కేఎల్ రాహుల్, స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, అశ్విన్, ఆర్చర్, అయ్యర్, రిషబ్ పంత్‌లతో ధీటుగా ఉండనుంది.

కెప్టెన్లుగా ధోని, స్మిత్

కెప్టెన్లుగా ధోని, స్మిత్

విరాట్, రోహిత్ ఉన్న కూడా అనుభవం దృష్ట్యా సౌత్ వెస్ట్ టీమ్‌కు కెప్టెన్‌గా ధోనినే కొనసాగే అవకాశం ఉంది. నార్త్ ఈస్ట్ టీమ్‌ కెప్టెన్సీకి స్టీవ్ స్మిత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌ల మధ్య పోటీ ఉన్నా.. ఆస్ట్రేలియా ప్లేయర్‌కే జట్టు పగ్గాలు అందొచ్చు. ఏదీ ఏమైనా ఈ ఆల్ స్టార్‌ మ్యాచ్‌తో అభిమానులకు కావాల్సిన మజా.. బోర్డు‌కు కావాల్సిన విరాళాలు పుష్కలంగా రానున్నాయి.

Story first published: Friday, February 21, 2020, 14:35 [IST]
Other articles published on Feb 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X