రికార్డుల రారాజు కోహ్లీకి ఏమైంది? గత 19 ఇన్నింగ్స్‌లుగా ఒక్క సెంచరీ లేదు

హైదరాబాద్: రికార్డుల రారాజు, నిలకడకు మారుపేరైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. న్యూజిలాండ్ పర్యటనలో దారుణంగా విఫలమవుతున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో నిరాశపర్చిన ఈ రన్ మెషిన్
శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్ట్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. కేవలం రెండు పరుగుల మాత్రమే చేసి అరంగేట్ర బౌలర్ కైలీ జేమీసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
మైదానంలో అడుగుపెడితే బౌలర్లపై విరుచుకుపడుతూ సెంచరీల మోత మోగించే కోహ్లి.. మూడు ఫార్మాట్లలో కలిపి గత 19 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సెంచరీ చేయలేదంటే ప్రతీ ఒక్కరిని ఆశ్యర్యానికి గురిచేస్తోంది. గత వన్డే సిరీస్‌లో దారుణంగా విఫలమైన కోహ్లీ.. టెస్ట్ సిరీస్‌లోనూ ఆశించిన ఆరంభాన్ని అందుకోలేకపోయాడు.

బంగ్లాపై చివరిసారిగా..
గతేడాది నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో కోల్‌కతా వేదికగా జరిగిన డేనైట్ టెస్ట్‌లో చివరిసారిగా సెంచరీ సాధించిన ఈ రన్ మెషిన్.. ఆపై ఇప్పటివరకూ మరో శతకాన్ని అందుకోలేకపోయాడు. ఇక గత ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఒకే హాఫ్ సెంచరీ సాధించిన విరాట్.. పరుగులు చేయడానికి అపోసోపాలు పడుతున్నాడు. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ ముందు అతని పేలవ ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది.
స్వయం కృతాపరాధం.. దొంగగా మారిన స్టార్ క్రికెటర్

ఇది మూడో సారే..
ఇక కోహ్లీ గత 19 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో ఆరు హాఫ్ సెంచరీలు సాధించినా వాటిని సెంచరీలుగా మలచుకోలేకపోయాడు. ఇలా వరుసగా 19 అంతకంటే ఎక్కువ ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి సెంచరీ సాధించకపోవడం ఇది మూడోసారి.
గతంలో 2011 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకూ 24 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి ఒక్క శతకం బాధలేకపోయాడు. ఇక 2014 ఫిబ్రవరి నుంచి అక్టోబర్ 25 వరకు వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ నమోదు చేయలేకపోయాడు. 2011లో వరుసగా 24 ఇన్నింగ్స్‌లాడిన కోహ్లీ.. 4 అర్థ శతకాలకే పరిమితమయ్యాడు. 2014లో 25 వరుస ఇన్నింగ్స్‌ల్లో ఆరు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ చేస్తూ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

ప్రతీ ఆరు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ ..
2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్రాత్మక డే/నైట్ మ్యాచ్ సెంచరీ వరకు ప్రతీ ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఒక శతకం సాధించిన కోహ్లీ.. తాజాగా వరుసగా 19 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేయలేకపోవడం అందరిని కలవరపెడుతోంది. కోహ్లిలో పస తగ్గిందా అనే అనుమానం కలుగుతోంది.

భారత్ 122/5
ఇక వర్షం అంతరాయంతో తొలి రోజు ఆట అర్ధాంతరంగా ముగియగా.. ఆట ముగిసే సమయానికి భారత్ 55 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. క్రీజులో అజింక్యా రహానే (38 బ్యాటింగ్), రిషభ్ పంత్(10 బ్యాటింగ్) ఉన్నారు. అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను అరంగేట్ర బౌలర్ కైలీ జేమీసన్ దెబ్బతీశాడు. పుజారా(11), విరాట్ కోహ్లీ(2) విహారి(7)ను పెవిలియన్‌కు చేర్చి భారత్ పతనాన్ని శాసించాడు. పృథ్వీషా(16)ను టీమ్ సౌథీ ఔట్ చేయగా.. మయాంక్ అగర్వాల్(38) బౌల్ట్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 101 పరుగులకే భారత్ 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో రహానే-పంత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications