న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: మినీ వేలంలో ఆ జింబాబ్వే ప్లేయర్‌కు భారీ డిమాండ్.. ఎందుకంటే..?

 IPL 2023: Zimbabwe all-rounder Sikandar Raza is going to be very expensive in Mini auction

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియ పూర్తయ్యింది. బీసీసీఐ విధించిన గడువు ముగియడంతో 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాలను ప్రకటించాయి. ఇక డిసెంబర్ 23న కేరళలోని కొచ్చి వేదికగా మినీ వేలం జరగనుంది. పేరుకు మినీ వేలమే అయినా.. కావాల్సిన ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించేందుకు ఫ్రాంచైజీలు సిద్దంగా ఉన్నాయి. అయితే ఈ మినీ వేలంలో జింబాబ్వే స్పిన్ ఆల్‌రౌండర్ సికిందర్ రాజా పంట పండనుంది. ఆస్ట్రేలియా వేదికగా ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2022లో సికిందర్ రాజా దుమ్మురేపాడు. మొత్తం 8 ఇన్నింగ్స్‌ల్లో 27.37 సగటుతో 219 పరుగులు చేసిన సికిందర్ రాజా.. 11 సిక్స్‌లు బాదాడు. 15.60 యావరేజ్‌తో 10 వికెట్లు పడగొట్టాడు.

ప్రపంచకప్ ప్రదర్శనతో..

ప్రపంచకప్ ప్రదర్శనతో..

జింబాబ్వే సూపర్ -12 చేరడంతో పాటు రన్నరప్ పాకిస్థాన్‌ను ఓడించడంలో సికిందర్ రాజా కీలక పాత్ర పోషించాడు. ఈ పెర్పామెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన సికిందర్ రాజా.. అప్‌కమింగ్ ఐపీఎల్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ ఆడే అవకాశం ఈ జింబాబ్వే ప్లేయర్‌కు దక్కలేదు. కానీ తాజా ప్రపంచకప్ ప్రదర్శనతో అతనిపై ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్నుపడింది. ఈ క్రమంలోనే అతని కోసం పలు ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి. అదే జరిగితే సికిందర్ రాజా భారీ ధర పలికే అవకాశం ఉంది.

 ఈజీగా రూ.5 కోట్లు..

ఈజీగా రూ.5 కోట్లు..

డిసెంబర్ 23న జరిగే మినీ వేలంలో దాదాపు రూ.5 కోట్లకు పైగానే సికిందర్ రాజా పలికే అవకాశం ఉన్నట్లు ఆకాశ్ చోప్రా వంటి క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. వచ్చే సీజన్ భారత్‌లోనే జరుగుతుండటం, సికిందర్ రాజా క్వాలిటీ స్పిన్ ఆల్‌రౌండర్ కావడంతో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండటం కలిసొచ్చే అంశం. అంతేకాకుండా మిడిలార్డర్ ధాటిగా ఆడగలడు. కాబట్టి ఐపీఎల్ ఫ్రాంచైజీలు అతని కోసం పోటీపడే అవకాశం ఉంది.

కన్నేసిన మూడు జట్లు..

కన్నేసిన మూడు జట్లు..

ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ ఫ్రాంచైజీలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ 2022 రిటెన్షన్ ప్రక్రియలో మొత్తం 163 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకున్న పది ఫ్రాంచైజీలు.. 85 మంది ప్లేయర్లను వేలంలోకి విడుదల చేశాయి. ఇక రిటెన్షన్ ప్రక్రియ తర్వాత అత్యధికంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ దగ్గర పర్స్ మన్ ఉంది.

మస్త్ పైసల్..

మస్త్ పైసల్..

ఆ జట్టు దగ్గర 42.25 కోట్లు ఉండగా.. అతి తక్కువ కేకేఆర్ దగ్గర రూ.7.05 కోట్లు ఉన్నాయి. సన్‌రైజర్స్ తర్వాత పంజాబ్ కింగ్స్ దగ్గర 32.2 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ రూ.23.35 కోట్లు, ముంబై ఇండియన్స్ రూ.20.55 కోట్లు, సీఎస్‌కే రూ. 20.45 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 19.45 కోట్లు, గుజరాత్ టైటాన్స్ రూ.19.25 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ రూ.13.2 కోట్లు, ఆర్‌సీబీ రూ.8.75 కోట్లు ఉన్నాయి.

Story first published: Wednesday, November 16, 2022, 7:01 [IST]
Other articles published on Nov 16, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X