న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: కేకేఆర్‌లోకి శార్దూల్ ఠాకూర్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్యాష్ డీల్!

IPL 2023: Shardul Thakur will be playing for Kolkata Knight Riders in upcoming season

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 రిటెన్షన్ ప్రక్రియను మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌(కేకేఆర్) ట్రేడ్ విండోతో పూర్తి చేయాలని భావిస్తున్నట్లుంది. ఇప్పటికే ట్రేడ్ విండో ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి లాకీ ఫెర్గూసన్, రహ్మనుల్లా గుర్బాజ్‌లను తీసుకున్న ఆ జట్టు.. తాజాగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ బిగ్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్యాష్ డీల్‌తోనే శార్దూల్ ఠాకూర్‌ను కేకేఆర్ తమ జట్టులోకి తెచ్చుకుందని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ ఫో పేర్కొంది.

అప్‌కమింగ్ సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియకు బీసీసీఐ నవంబర్ 15 డెడ్‌లైన్‌గా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ప్రాంఛైజీలు ఈ ప్రక్రియను పూర్తి చేసే పనిలో పడ్డాయి. ఇక ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ టీమిండియా ఆల్‌రౌండర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా పోటీపడటంతో ఢిల్లీ భారీ ధర వెచ్చించాల్సి వచ్చింది. అయితే శార్దూల్‌తో తమ జట్టుకు వచ్చిన ఫైదా ఏం లేదని భావించిన ఢిల్లీ.. కేకేఆర్‌తో డీల్ చేసుకొని వదిలించుకుంది. కేకేఆర్‌కు

కొత్త సారథి శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్ సరైన బౌలింగ్ అటాక్ లేక తడబడింది. దాంతోనే ఆ సమస్యను అధిగమించడంపై ఫోకస్ పెట్టిన కేకేఆర్.. ఫెర్గూసన్, ఠాకూర్‌లను ట్రేడ్ విండో ద్వారా సొంతం చేసుకుంది. ఇప్పటికే సామ్ బిల్లింగ్స్, ప్యాట్ కమిన్స్ అప్‌కమింగ్ సీజన్‌కు దూరంగా ఉంటామని చెప్పిన నేపథ్యంలో ఆ స్థానాలను భర్తీ చేయడంపై కేకేఆర్ ఫోకస్ పెట్టింది. ఇక శార్తూల్ ఠాకూర్ ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచి ఆ జట్టు నాలుగో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

Story first published: Monday, November 14, 2022, 16:13 [IST]
Other articles published on Nov 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X