న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: మనీష్ పాండేతో పాటు ఆ ముగ్గురిని వదిలేయనున్న లక్నో సూపర్ జెయింట్స్!

 IPL 2023: Lucknow Super Giants (LSG) To Release Manish Pandey And 2 Others From The Team

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన లక్నో.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపింది. లీగ్ దశలో 9 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఒత్తిడికి చిత్తయిన లక్నో.. క్యాచ్‌లు నేలపాలు చేసి విజయాన్ని చేజార్చుకుంది.

హాఫ్ సెంచరీతో కేఎల్ రాహుల్ పోరాడినా ఫలితం దక్కలేదు. దాంతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఆల్‌రౌండర్లు అధికంగా ఉండటం ఆ జట్టుకు కలిసిరాగా.. అంతర్జాతీయ స్టార్ బౌలర్లు లేకపోవడం ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. మోహ్‌సిన్ ఖాన్, దుష్మంత్ చమీరా వంటి పేసర్లు సత్తా చాటడంతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరింది. ఈ క్రమంలోనే వచ్చే సీజన్‌కు తమ లోపాలను సరిచేసుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే ముగ్గురు ఆటగాళ్లను వదిలేయాలనుకుంటుంది.

మనీశ్ పాండే

మనీశ్ పాండే

ఐపీఎల్ 2014 ఫైనల్లో తన సారథ్యంలోని కేకేఆర్‌ను గెలిపించాడనే కృతజ్ఞతో మనీశ్ పాండేను లక్నో మెంటార్

గౌతమ్ గంభీర్ ఏరి కోరి తీసుకున్నాడు. గత రెండు, మూడు సీజన్లుగా దారుణంగా విఫలమైనా అతని కోసం ఏకంగా రూ.4.6 కోట్లు ఖర్చు పెట్టాడు. అంతేకాకుండా సీజన్ ఆరంభంలో వరుసగా 6 మ్యాచ్‌ల్లో అవకాశం ఇచ్చాడు. కానీ ఈ సదావకాశాన్ని మనీశ్ పాండే అందిపుచ్చుకోలేకపోయాడు. ఆరు మ్యాచ్‌ల్లో 110 స్ట్రైక్‌రేట్‌తో 88 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. అయితే మరో మిడిలార్డర్ బ్యాటర్ దీపక్ హుడా అద్భుతంగా రాణించడంతో పాండే వైఫల్యం పెద్దగా కనిపించలేదు. యువ ప్లేయర్ ఆయూష్ బదానీ కూడా సత్తా చాటడంతో లక్నో వరుస విజయాలందుకుంది. అయితే మనీశ్ పాండేను రిలీజ్ చేసి మంచి మిడిలార్డర్ బ్యాటర్‌ను తీసుకోవాలని లక్నో భావిస్తోంది.

 అంకిత్ రాజ్‌పుత్..

అంకిత్ రాజ్‌పుత్..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంకిత్ రాజ్‌పుత్‌ను లక్నో వేలంలో రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే జట్టులో విదేశీ, స్వదేశీ బౌలర్లతో సెటిల్ అవడంతో అంకిత్‌కు చోటు లేకుండా పోయింది. జాసన్ హోల్డర్ వంటి స్టార్ ఆల్‌రౌండర్‌నే పక్కనపెట్టే పరిస్థితి ఆ జట్టులో ఉంది. మోహ్‌సిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్, దుష్మంత్ చమీరాలు సత్తా చాటుతుండటంతో ఈ దేశవాళీ పేసర్‌కు అవకాశం కష్టంగా మారింది. చివరిసారిగా ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆడిన రాజ్‌పుత్ నిలకడలేమి కారణంగా వరుసగా అవకాశాలు అందుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేయాలని లక్నో వదులుకునే అవకాశం ఉంది.

ఆండ్రూ టై

ఆండ్రూ టై

ఆస్ట్రేలియా వెటరన్ పేసర్ ఆండ్రూ టైని లక్నో మార్క్ వుడ్‌కు రిప్లేస్‌మెంట్‌గా లక్నో తీసుకుంది.

దాంతో అతను కోటీ రూపాయలకే వచ్చాడు. అయితే టీమ్ బౌలింగ్ కాంబినేషన్ సెట్ అవ్వడం.. పైగా మార్క్ వుడ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్న నేపథ్యంలో టైని లక్నో వదులుకోనుంది. పైగా అతని వయసు కూడా 35 ఏళ్లు ధాటింది. గతంలో సీఎస్‌కే, ఆర్‌ఆర్, గుజరాత్ లయన్స్, పంజాబ్ కింగ్స్‌కు ఆడిన అనుభవం ఉంది. కానీ ఈ సీజన్‌లో అతను మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసాడు. ఓవర్‌కు 9.5 చొప్పున పరుగులిచ్చుకున్నాడు. మార్క్ వుడ్ కోసం టైని లక్నో వదులుకోనుంది.

Story first published: Monday, June 6, 2022, 19:34 [IST]
Other articles published on Jun 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X