న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్!

 IPL 2023: KKR Appoint Ranji Legend Chandrakant Pandit as Their New Head Coach

న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) తమ కొత్త కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్, దిగ్గజ రంజీ కోచ్ చంద్రకాంత్ పండిట్‌ను నియమించింది. ఈ మేరకు కేకేఆర్ మేనేజ్‌మెంట్ బుధవారం ట్విటర్‌ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇన్నాళ్లు కేకేఆర్ హెడ్ కోచ్‌గా ఉన్న న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెక్‌కల్లమ్ ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో కేకేఆర్ కొత్త కోచ్‌ను చూసుకుంది. రంజీ క్రికెట్‌లో కోచ్‌గా అపార అనుభవం ఉన్న చంద్రకాంత్ పండిట్‌ను ఎంచుకుంది. ఐపీఎల్ 2023 టైటిలే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది.

మధ్యప్రదేశ్‌‌ను విజేతగా..

మధ్యప్రదేశ్‌‌ను విజేతగా..

ఈ సీజన్ రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌ తొలిసారి విజేతగా అవతరించడంలో కోచ్‌గా చంద్రకాంత్‌ పండిట్‌ కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు రంజీ క్రికెట్‌లో అత్యంత సూపర్‌ సక్సెస్‌ కోచ్‌గా ఆయనకు మంచి పేరు ఉంది. ప్రస్తుత తరుణంలో హెడ్‌కోచ్‌గా చంద్రకాంత్‌ పండిట్‌ సరైనవాడని కేకేఆర్‌ అభిప్రాయపడుతోంది. అందుకే చంద్రకాంత్‌ పండిట్‌ను ఏరికోరి కేకేఆర్‌ కోచ్‌గా తీసుకొచ్చింది.

సంతోషంగా ఉంది..

సంతోషంగా ఉంది..

ఇదే విషయమై కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూర్‌ మాట్లాడుతూ.. 'దేశవాలీ దిగ్గజ కోచ్‌ చంద్రకాంత్‌ కేకేఆర్‌ ఫ్యామిలీలోకి రావడం మమ్మల్ని ఉత్సాహపరిచింది. కోచ్‌ పాత్రలో మా జట్టును విజయవంతంగా నడిపించాలని.. జర్నీ సాఫీగా సాగిపోవాలని కోరకుంటున్నా. ఆట పట్ల అతనికున్న అంకితభావం, నిబద్ధత.. మరెవరికి లేదు. అందుకే దేశవాళి క్రికెట్‌లో దిగ్గజ కోచ్‌గా అవతరించాడు. మా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు విలువైన సలహాలు ఇస్తూ ఐపీఎల్‌ టైటిల్‌ అందించాలి'అని కోరుతున్నా అంటూ తెలిపాడు.

భారత్ తరఫున 23 వన్డేలు..

భారత్ తరఫున 23 వన్డేలు..

ఇక చంద్రకాంత్‌ పండిట్‌ భారత్ తరపున 1986-92 వరకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్‌ తరపున చంద్రకాంత్‌ 5 టెస్టులు, 23 వన్డేలు ఆడాడు. టీమిండియా ఆటగాడిగా అంతగా సక్సెస్‌ కాలేకపోయిన రంజీ కోచ్‌గా అందరి ప్రశంసలు అందుకున్నాడు. చంద్రకాంత్‌ రంజీ కోచ్‌గా అడుగుపెట్టాకా ముంబైని(2002-03, 2003-04,2015-16) మూడుసార్లు, విదర్భను(2017-18, 2018-19) రెండుసార్లు రంజీ చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా మధ్యప్రదేశ్‌ను తొలిసారి రంజీ విజేతగా నిలిపి చంద్రకాంత్ దిగ్గజ కోచ్‌గా అవతరించాడు. ఆటగాడిగా సాధించలేని రంజీ టైటిల్‌ను కోచ్‌గా మధ్యప్రదేశ్‌కు సాధించిపెట్టాడు.

 రెండు టైటిళ్లు మాత్రమే..

రెండు టైటిళ్లు మాత్రమే..

ఇక గౌతమ్‌ గంభీర్‌ సారథ్యంలో 2012, 2014లో చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్‌.. మరోసారి టైటిల్ సాధించలేకపోయింది. 2021లో ఇయాన్‌ మోర్గాన్‌ సారధ్యంలో ఫైనల్‌ చేరినప్పటికి.. సీఎస్‌కే చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఇక 2022 ఐపీఎల్‌ సీజన్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని కేకేఆర్‌ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కనీసం ప్లేఆఫ్‌ చేరకుండా ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.

Story first published: Wednesday, August 17, 2022, 19:09 [IST]
Other articles published on Aug 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X