న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: ముంబై ఇండియన్స్ వదిలేసిన ఆ ముగ్గురికి మినీ వేలంలో ఫుల్ డిమాండ్!

IPL 2023: 3 Released Players of Mumbai Indians who might be in high demand in mini auction

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌‌కు సంబంధించిన మినీ వేలానికి రంగం సిద్దమైంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేసిన బీసీసీఐ.. ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ విండోను కూడా పూర్తి చేసింది. కేరళలోని కొచ్చి వేదికగా జరగనున్న ఈ మినీ వేలానికి 991 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 714 మంది భారతీయులు ఉండగా.. 277 మంది ఓవర్‌సీసీ ప్లేయర్లు ఉన్నారు.

ఇందులో నుంచి గరిష్టంగా 87 మంది ప్లేయర్లకు అవకాశం దక్కనుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్ అప్‌కమింగ్ సీజన్ కోసం 13 మంది ఆటగాళ్లను వదిలేసింది. ఈ జాబితాలోని ఓ ముగ్గురికి ఐపీఎల్ 2023 మినీ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది.

డానియల్ సామ్స్

డానియల్ సామ్స్

ఆస్ట్రేలియా యువ పేసర్ డానియల్ సామ్స్.. టీ20 ఫార్మాట్‌లో నిలకడగా రాణించే ఆటగాడు. ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకు 109 మ్యాచ్‌లు ఆడిన సామ్స్.. 8.74 ఎకానమీతో 124 వికెట్లు తీసాడు. బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటం సామ్స్‌కు అదనపు బలం. లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేసే సామ్స్ 153.91 స్ట్రైక్‌రేట్‌తో అతను 1042 పరుగులు చేశాడు.

ఈ లెక్కలతోనే ముంబై ఇండియన్స్ డానియల్ సామ్స్‌ను రూ.2.6 కోట్లు పెట్టి తీసుకుంది. అద్భుతంగా రాణించకపోయినా.. 11 మ్యాచ్‌ల్లో 13 వికెట్లతో పర్వాలేదనిపించాడు.

అయితే ముంబై ఆశించిన స్థాయిని అందుకోకపోవడంతో ఈ లెఫ్టార్మ్ పేసర్‌ను రోహిత్ సేన వదులుకుంది. అయితే ఈ లెఫ్టార్మ్ పేసర్‌ను తీసుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్.. డానియల్ సామ్స్ కోసం పోటీ పడవచ్చు. అతను ఈజీగా రూ.2 కోట్లకు పైనే పలికే అవకాశం ఉంది.

రిలే మెరిడిత్..

రిలే మెరిడిత్..

ఆస్ట్రేలియా పేసర్ రిలే మెరిడిత్‌కు కూడా టీ20 ఫార్మాట్‌లో మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా బిగ్‌బాష్ లీగ్ అతను మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో నిలకడగా వేయగలడు. ఇప్పటి వరకు 63 మ్యాచ్‌లు ఆడిన రిలే మెరిడిత్.. 8.39 ఎకానమీతో 79 వికెట్లు తీసాడు. ఈ గణంకాలతోనే ఈ యువ పేసర్‌ను ముంబై ఇండియన్స్ గత సీజన్ మెగా వేలంలో కొనుగోలు చేసింది.

8 మ్యాచ్‌లు ఆడిన మెరిడిత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దాంతో ముంబై వదులుకుంది. అయితే టీ20 ఫార్మాట్‌లో ఎంతో అనుభవం ఉన్న మెరిడిత్‌‌ను తీసుకునేందుకు ఇతర ఫ్రాంచైజీలు ఆసక్తికనబరుస్తున్నాయి. రూ. కోటిన్నర బేస్ ప్రైజ్‌తో అందుబాటులో ఉన్న మెరిడిత్ రూ.3 కోట్ల వరకు పలికే అవకాశం ఉంది.

జయదేవ్ ఉనాద్కత్..

జయదేవ్ ఉనాద్కత్..

ఐపీఎల్‌లో జయదేవ్ ఉనాద్కత్ కెరీర్ పడుతూ లేస్తూ సాగుతోంది. 2010లో అరంగేట్రం చేసిన ఉనాద్కత్.. 2017లో 24 వికెట్లతో సత్తా చాటాడు. ఈ ప్రదర్శనతో అత్యధిక ధర కూడా పలికాడు. ఈ యువ పేసర్‌పై నమ్మకం ఉంచిన ముంబై ఇండియన్స్ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఐదు మ్యాచ్‌ల్లో 6 వికెట్లు మాత్రమే తీసిన ఉనాద్కత్.. ధారళంగా పరుగులిచ్చాడు.

దాంతోనే ముంబై అతన్ని వదులుకుంది. అయితే దేశవాళీ క్రికెట్‌లో ఉనాద్కత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ముఖ్యంగా విజయ్ హజారే ట్రోఫీలో 19 వికెట్లతో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అటు కెప్టెన్‌గా 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ సౌరాష్ట్రకు విజయ్ హజారే ట్రోఫీ అందించాడు. ఈ గణంకాలు ఫ్రాంచైజీలను టెంప్ట్ చేస్తున్నాయి. మినీ వేలంలో ఉనాద్కత్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. అతను ఈజీగా రూ.2-3 కోట్ల ధర పలికే అవకాశం ఉంది.

Story first published: Friday, December 2, 2022, 17:11 [IST]
Other articles published on Dec 2, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X