న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: రోహిత్ శర్మ.. ఇక ముంబై ఇండియన్స్ ఫినిషర్‌గా.. ఎందుకంటే?

 IPL 2023: 3 reasons why Rohit Sharma should play in the middle-order for MI

హైదరాబాద్: ఐపీఎల్ చరిత్రలోనే రోహిత్ శర్మ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్. అతను సాధించిన టైటిళ్లే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. 2013,15,17,19,20 సీజన్లలో ముంబై ఇండియన్స్‌ను రోహిత్ చాంపియన్‌గా నిలబెట్టాడు. బ్యాటర్‌గానూ 222 ఇన్నింగ్స్‌లో 5879 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు. అయితే 2017 సీజన్‌ నుంచి రోహిత్.. బ్యాటింగ్‌లో విఫలమవుతున్నాడు. అతని గణంకాలు కూడా గత ఆరేళ్లుగా పడుతూ వచ్చాయి. ఈ ఆరేళ్లలో ముంబై ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే అప్‌కమింగ్ సీజన్‌లో అతన్ని మిడిలార్డర్‌లో ఆడాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. రోహిత్ మిడిలార్డర్‌లో ఆడటం ముంబైకి బలాన్ని ఇస్తుందని అభిప్రాయపడుతున్నారు. రోహిత్ ఓపెనర్‌గా వద్దనేందుకు మూడు బలమైన కారణాలున్నాయంటున్నారు.

 కామెరూన్ గ్రీన్ కోసం..

కామెరూన్ గ్రీన్ కోసం..

ఐపీఎల్ 2023 మీనీ వేలంలో ముంబై ఇండియన్స్ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను రూ. 17.50 కోట్ల భారీ ధరకు తీసుకుంది. ఈ క్రమంలోనే రోహిత్‌ను మిడిలార్డర్‌కు పంపిస్తే కామెరూన్ గ్రీన్‌ను ఇషాన్ కిషన్‌తో కలిపి ఓపెనర్‌గా పంపించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత్ వేదికగా జరిగిన సిరీస్‌లో కామెరూన్ గ్రీన్ ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్‌గానే బరిలోకి దిగి సత్తా చాటాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో 215 స్ట్రైక్‌రైట్‌తో 118 పరుగులు చేశాడు. జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ వంటి టాప్ క్లాస్ బౌలర్లను పవర్ ప్లేలో చితక్కొట్టాడు. ఈ క్రమంలోనే గ్రీన్‌ను ఓపెనర్‌గా పంపించి సూర్య, తిలక్ వర్మ, రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రేవిస్, టీమ్ డేవిడ్‌లతో మిడిలార్డర్ ఫిల్ చేయాలని సూచిస్తున్నారు. రోహిత్ శర్మ మిడిలార్డర్‌కు వస్తే యువ ఆటగాళ్లు స్వేచ్చగా ఆడగలరని పేర్కొంటున్నారు.

 మిడిలార్డర్‌లో రోహిత్‌‌కు మంచి రికార్డు..

మిడిలార్డర్‌లో రోహిత్‌‌కు మంచి రికార్డు..

ఇక ఐపీఎల్‌లో రోహిత్ శర్మకు మిడిలార్డర్‌లో మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా ఐదో స్థానంలో 22 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ 33 సగటు, 144 స్ట్రైక్‌రేట్‌తో 563 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. నాలుగో స్థానంలో 86 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్.. 33.12 సగటు, 128.67 స్ట్రైక్‌రేట్‌తో 2392 రన్స్ చేశాడు. ఇందులో 19 హాఫ్ సెంచరీలున్నాయి. భారత్ తరఫున ఓపెనర్‌గా అదిరిపోయే రికార్డు రోహిత్‌కు ఉన్నప్పటికీ.. ముంబై ఇండియన్స్ తరఫున మాత్రం రోహిత్ ఆ జోరును కొనసాగించలేకపోయాడు. మిడిలార్డర్‌లో రోహిత్ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ కూడా ఆడాడు. 2018లో ఆర్‌సీబీతో ఓ మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో వచ్చిన రోహిత్ 52 బంతుల్లో 94 పరుగులతో జట్టును గెలిపించాడు. ఇది అతని కెరీర్‌కే హైలైట్‌గా నిలిచింది.

మిడిలార్డర్ మరింత బలంగా..

మిడిలార్డర్ మరింత బలంగా..

ముంబై ఇండియన్స్ మిడిలార్డ్‌లో అనుభవం లేమి బ్యాటర్లున్నారు. మ్యాచ్‌ను ఫినిష్ చేయగలిగే వెటరన్ బ్యాటర్లు లేరు. ఈ రోల్‌ను రోహిత్ శర్మ తీసుకుంటే ముంబై బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా మారనుంది. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన మ్యాచ్‌ల్లో రోహిత్.. యువ ఆటగాళ్లకు మార్గదర్శకంగా ఉండనున్నాడు. బంగ్లాదేశ్‌తో ఇటీవల ముగిసిన రెండో వన్డేలో రోహిత్.. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి దుమ్మురేపాడు. బౌలర్లపై విరుచుకుపడుతూ.. భారత్‌ను గెలిపించినంత పనిచేశాడు. ఇదే రోల్‌ను ముంబైకి పోషిస్తే.. అంబానీ టీమ్ మళ్లీ పూర్వ వైభవం అందుకోనుంది.

Story first published: Saturday, January 7, 2023, 16:49 [IST]
Other articles published on Jan 7, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X