For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI Playing XI: ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్.. ముంబై ఇండియన్స్ తుది జట్టు ఇదే!

ఐపీఎల్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఐదు సార్లు(2013, 2015, 2017, 2019, 2020) విజేతగా నిలిచింది. 8 ఏళ్ల వ్యవధిలో 5 టైటిళ్లు అందుకున్న ముంబై.. గత ఐదు సీజన్లలో మాత్రం ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది. గత సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరినా.. ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలవాలనే యోచనలో ఉంది.

జట్టు నిండా స్టార్ ఆటగాళ్లున్నా.. మునపటిలా ముంబై సత్తా చాటలేకపోతుంది. కానీ ఇటీవల టీమిండియా టీ20 ప్రపంచకప్‌ నిలబెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా, సూర్యకుమార్, హార్దిక్, తిలక్ ఫుల్‌ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్‌ఫుల్ కెప్టెన్లుగా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, మిచెల్ సాంట్నర్‌లు ఉన్న జట్టును హార్దిక్ పాండ్యా ఎలా నడిపిస్తాడనేది కీలకం.

Mumbai Indians Predicted Playing XI for IPL 2026 Rohit Sharma Set to Continue as Impact Player

ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్..

ముంబైకి ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మ ఈసారి కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్.. కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ కోసం ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు.

రోహిత్ శర్మతో కలిసి క్వింటన్ డికాక్ ఓపెనింగ్ చేయనుండగా.. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, విల్ జాక్స్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్‌లు ఫినిషర్ పాత్ర పోషించనున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి లాగేసుకోవడంలో వీరికి అపార అనుభవం ఉంది.

డికాక్ ఒక్కడే..

బ్యాటింగ్ ఆర్డర్‌లో ఒక్క డికాక్ మినహా మిగిలిన వాళ్లంతా భారత ఆటగాళ్లే కావడంతో.. విదేశీ ఆటగాళ్ల సేవలను వినియోగించుకునే విషయంలో ఫ్రాంచైజీ మంచి వెసులు బాటు ఉంది. విదేశీ కోటాలో డికాక్, రికెల్టన్, రూథర్‌ఫర్డ్, సాంట్నర్, విల్ జాక్స్, బాష్, ట్రెంట్ బౌల్డ్, ఘజన్‌ఫర్ అందుబాటులో ఉండగా.. డికాక్, జాక్స్, సాంట్నర్, బౌల్ట్ తుది జట్టులో ఉండటం ఖాయం. పరిస్థితులను బట్టి రూథర్‌ఫర్డ్, ఘజన్‌ఫర్‌ను ఆడించవచ్చు.

బౌలింగ్ భారాన్ని బుమ్రా మోయనున్నాడు. దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ నుంచి సహకారం అందితే ముంబై ఇండియన్స్‌కు తిరుగుండదు. విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్‌తో పాటు మయాంక్ మార్కండే స్పిన్ బాధ్యతలు మోయనున్నారు.

ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్/షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్/శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే(ఇంపాక్ట్)

Story first published: Saturday, March 21, 2026, 14:59 [IST]
Other articles published on Mar 21, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+