ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఫ్రాంచైజీని విరాట్ కోహ్లీ చార్టెడ్ ఫ్లైట్ డిమాండ్ చేశాడనే వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్‌ల మధ్య 3 రోజుల గ్యాప్ వస్తే లండన్ వెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయాలని కోహ్లీ కోరాడని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ వార్తలపై విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. కన్నీటి ఏమోజీలను షేర్ చేశాడు. ఇలాంటి వార్తలు ఎలా క్రియేట్ చేస్తార్రా? అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని తన పోస్ట్ ద్వారా స్పష్టం చేశాడు.
విరాట్ కోహ్లీ హేటర్స్ ఈ ఫేక్ వార్తను క్రియేట్ చేసినట్లు అర్థమవుతుంది. ఇప్పటికే ఆర్‌సీబీ ప్రాక్టీస్ క్యాంప్‌లో చేరిన విరాట్ కోహ్లీ.. టైటిలే లక్ష్యంగా సన్నదమవుతున్నాడు. తన సహచరులకు కూడా ఒక్క క్షణం కూడా వృథా చేయవద్దని దిశానిర్దేశం చేశాడు.

శనివారం ప్రాక్టీస్ అనంతరం సహచరులతో కోహ్లీ మాట్లాడిన వీడియోను ఆర్‌సీబీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 'ఈ రోజులను మనం వృథా చేయకూడదు. మనం ఎప్పుడూ ముందంజలో ఉండాలి. సీజన్ మొత్తంలో ఒక్క నిమిషం కూడా వృథా కాకూడదు. మనం ఈ రెండున్నర నెలలు 120 శాతం ప్రదర్శనను ఇవ్వాలి. ఛాలెంజర్స్ కావడానికి అందరిలోనూ ఉత్సాహం ఉందని మీ ముఖాలు చేస్తే అర్థమవుతోంది.'అని కోహ్లీ పేర్కొన్నాడు.
గత మూడే సీజన్లలో 600 పైగా పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ.. ఈ సారి కూడా అదే స్థాయిలో రాణించి టైటిల్ నిలబెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యాంటీ ఫ్యాన్స్ మాత్రం అతనికి సంబంధించి ఫేక్ ట్వీట్స్ వైరల్ చేస్తూ శునకానందం పొందుతున్నారు.

విరాట్ కోహ్లీ.. తన ఫ్యామిలీతో లండన్‌లో సెట్ అయిన సంగతి తెలిసిందే. తన పిల్లలు సాధారణ జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో అనుష్క శర్మ, కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత మ్యాచ్‌లు ఉన్నప్పుడు మాత్రమే కోహ్లీ ఇక్కడికి వచ్చి ఆడుతున్నాడు. ఆ తర్వాత లండన్ వెళ్లిపోతున్నాడు.