Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

5 బంతుల్లో 5 సిక్స్‌లు.. SRHలో మరో విధ్వంసకర బ్యాటర్!

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు సన్‌‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు మరో విధ్వంసకర బ్యాటర్ దొరికాడు. టీమిండియా సెన్సేషన్ రింకూ సింగ్ తరహాలో విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే ఆటగాడు జట్టుకు తోడయ్యాడు.

అభిషేక్, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, హెన్రీచ్ క్లాసెన్ వంటి డేంజరస్ బ్యాటర్లు ఉన్న సన్‌రైజర్స్‌కు మరో యువ సంచలనం జత కలిసాడు. అతను ఎవరో కాదు.. ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలంలో కోటిన్నర పలికి అందర్నీ ఆశ్చర్యపరిచిన సలీల్ అరోరా.

శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో సలీల్ అరోరా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా 5 బంతుల్లో 5 సిక్స్‌లు బాదాడు. 198 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై విరుచుకుపడి 40 పరుగులు చేశాడు. అతడు బాదిన నో లుక్ సిక్సర్లు నెటిజన్లను ఆకట్టుకున్నాయి.

SRH Uncapped Star Salil Arora Smashes 5 Consecutive Sixes in IPL 2026 Intra Squad Practice Match at Uppal
Photo Credit: screen grab for SunrisersIPL

పంజాబ్‌కు చెందిన సలిల్ అరోరా దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 190 స్ట్రైక్‌రేట్‌తో 350 ప్లస్ రన్స్ చేశాడు. ఈ టోర్నీలో జార్ఖండ్‌పై కేవలం 39 బంతుల్లోనే సెంచరీ బాది టాక్ ఆఫ్ ది నేషన్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతోనే రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతన్ని ఆరెంజ్ ఆర్మీ ఐదు రెట్లు పెంచి రూ.1.50 కోట్లు ధరకు కొనుగోలు చేసింది.

ఈ ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాటర్లు ప్రాక్టీస్ కోసం రెండు, మూడు సార్లు బ్యాటింగ్ చేశారు. తొలి సారి బ్యాటింగ్‌కు దిగిన అభిషేక్ శర్మ 42 బంతుల్లో 94 పరుగులు చేసి తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. రెండోసారి బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ నిరాశపర్చాడు. రెండు భారీ సిక్స్‌లు బాది ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.

తొలి రెండు ప్రయత్నాల్లో విఫలమైన ఇషాన్ కిషన్ మూడో ప్రయత్నంలో 25 బంతుల్లోనే 72 పరుగులు చేశాడు. హెన్రీచ్ క్లాసెన్(31 బంతుల్లో 49), హర్ష్ దూబే (14 బంతుల్లో 37)కూడా దూకుడుగా ఆడారు. రెండో ప్రయత్నంలో సలీల్ అరోరా 26 బంతుల్లోనే 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. పరుగుల వరద పారిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో జయదేవ్ ఉనాద్కత్ (5/48) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. నితీష్ రెడ్డి(3/32), హర్షల్ పటేల్(3/42) మూడేసి వికెట్లు తీసారు. బ్రైడన్ కార్స్‌కు ఒక వికెట్ దక్కింది.

Story first published: Sunday, March 22, 2026, 10:56 [IST]
Other articles published on Mar 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+