న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: డ్వేన్ బ్రావో ప్లేస్ కోసం ఆ ముగ్గురిపై కన్నేసిన సీఎస్‌కే!

IPL 2023: 3 players CSK could buy at Mini Auction to replace Dwayne Bravo

హైదరాబాద్: ఐపీఎల్ 2023 మినీ వేలానికి రంగం సిద్దమైంది. డిసెంబర్ 23న మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మినీ వేలానికి తెరలేవనుండగా.. 405 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 991 మంది ఆటగాళ్లు మినీ వేలానికి రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీలు 405 మంది ఆటగాళ్ల పేర్లను షార్ట్‌లిస్ట్ చేశాయి. ఇందులో గరిష్టంగా 88 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. అయితే సీఎస్‌కేకు ఈ మినీవేలం చాలా కీలకంగా మారింది.

కెప్టెన్ ధోనీ వయసు 41 ఏళ్లకు చేరడం.. అతను ఈ సీజనే వీడ్కోలు పలికే అవకాశం ఉండటంతో పాటు డ్వేన్ బ్రావో రిటైర్మెంట్ ప్రకటించడంతో వారి స్థానాలను భర్తీ చేయాల్సిన పెద్ద బాధ్యత ఆ జట్టుపై ఉంది. ఆ జట్టులో మొత్తం ఏడు స్థానాలు ఖాళీగా ఉండగా.. ఇద్దరు ఓవర్‌సీస్ ఆటగాళ్లకు అవకాశం ఉంది.

అయితే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన డ్వేన్ బ్రావోను భర్తీ చేసే ఆటగాడిని తీసుకురావడం సీఎస్‌కేకు తలకు మించిన భారంగా మారింది. అటు బంతితో పాటు ఇటు బ్యాట్‌తో రాణించగల బ్రావో స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు దొరకడం చాలా కష్టం. అయితే ఓ ముగ్గురి ఆటగాళ్లతో బ్రావో స్థానాన్ని భర్తీ చేయాలని సీఎస్‌కే భావిస్తోంది.

సామ్ కరన్..

సామ్ కరన్..

గతంలో తమ జట్టుకే ఆడిన సామ్ కరన్‌ను మళ్లీ కొనుగోలు చేయాలని సీఎస్‌కే భావిస్తోంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన 24 ఏళ్ల సామ్ కరన్‌కు ఈ మినీ వేలంలో ఫుల్ డిమాండ్ ఉంది. ఈ యువ పేస్ ఆల్‌రౌండర్‌ను తీసుకునేందుకు 10 ఫ్రాంచైజీలు పావులు కదుపుతున్నాయి.

డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అయిన సామ్ కరన్‌కు బ్యాటింగ్ చేసే సామర్థ్యం కూడా ఉండటంతో ఫ్రాంచైజీలు ఈ ఇంగ్లండ్ ప్లేయర్ కోసం ఆసక్తి కనబరుస్తున్నాయి. ఐపీఎల్ 2020, 21లో సీఎస్‌కేకు ఆడిన సామ్ కరన్.. 23 మ్యాచ్‌ల్లో 22 వికెట్లతో సత్తా చాటాడు. ఐపీఎల్ 2020 వేలంలో రూ.5.5 కోట్ల భారీ ధరకు సామ్ కరన్‌ను సీఎస్‌కే కొనుగోలు చేసింది. కానీ ఈసారి మాత్రం రూ.8-10 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బెన్ స్టోక్స్..

బెన్ స్టోక్స్..

సామ్ కరన్ చేజారితే సీఎస్‌కే.. బెన్ స్టోక్స్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉంది. బ్యాట్, బాల్‌తో సత్తా చాటగలిగే బెన్ స్టోక్స్‌కు కూడా సామ్ కరన్ తరహాలో ఫుల్ డిమాండ్ ఉంది. బిగ్ మ్యాచ్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన స్టోక్స్.. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ సత్తా చాటాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు అద్భుతమైన ఫీల్డర్ కావడం బెన్ స్టోక్స్‌కు అదనపు బలం.

ఈ క్రమంలోనే డ్వేన్ బ్రావ్ స్థానాన్ని బెన్ స్టోక్స్ భర్తీ చేయగలడని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అంతేకాకుండా ధోనీ వారుసుడిగా స్టోక్స్‌‌కు జట్టు పగ్గాలు అందించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటి వరకు 43 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన స్టోక్స్ రెండేసి సెంచరీలు, హాఫ్ సెంచరీలతో 920 పరుగులు చేశాడు. 28 వికెట్లు పడగొట్టాడు.

డానియల్ సామ్స్..

డానియల్ సామ్స్..

సామ్ కరన్, బెన్ స్టోక్స్ వేలంలో చిక్కకపోతే.. సీఎస్‌కే డానియల్ సామ్స్‌ను తీసుకునే అవకాశం ఉంది. ఇంగ్లండ్ ప్లేయర్లకు బ్యాకప్‌గా ఈ ఆసీస్ ఆల్‌రౌండర్‌ను సీఎస్‌కే పెట్టుకుంది. వేలంలో ఆ ఇద్దరు చేజారితే డానియల్ సామ్స్‌ను తీసుకోనుంది. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున సామ్స్ విఫలమైనా.. బ్యాటింగ్, బౌలింగ్ చేసే సామర్థ్యం ఉండటంతో అతనిపై సీఎస్‌కే కన్నేసింది.

అనామక ఆటగాళ్లను స్టార్లుగా మలచడం సీఎస్‌కేకు కొత్త కాదు. ఫామ్‌లో లేని ఆటగాళ్లు కూడా సీఎస్‌కే తరఫున సంచలన ప్రదర్శనలు ఇచ్చిన ధాఖలాలు ఉన్నాయి. కాబట్టి సామ్స్‌ను కూడా మేటీ ఆటగాడిగా తీర్చిదిద్దే సత్తా తమ టీమ్‌కు ఉందని సీఎస్‌కే భావిస్తోంది.

Story first published: Tuesday, December 20, 2022, 15:42 [IST]
Other articles published on Dec 20, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X