న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022 Mega Auction:లక్నో జట్టులోకి రాహుల్, స్టోయినీస్, రవి బిష్ణోయ్.. జీతాలు ఎంతంటే!

IPL 2022: KL Rahul Charged 15 Cr, Stoinis 11 Cr From Lucknow Team

న్యూఢిల్లీ: అప్‌కమింగ్ ఐపీఎల్ 2022 సీజన్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినీస్, యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ నయా ఫ్రాంచైజీ లక్నోకు ప్రాతినిథ్యం వహించనున్నారు. అత్యధిక ధరకు లక్నో ఫ్రాంచైజీని దక్కించుకున్న ఆర్‌పీఎస్‌జీ గోయెంకా గ్రూప్.. అప్‌కమింగ్ సీజన్‌ కోసం అన్ని విధాలుగా సమాయత్తం అవుతోంది. ఇప్పటికే జట్టు హెడ్ కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్, బ్యాటింగ్ కోచ్‌గా విజయ్ దహియాను నియమించిన లక్నో టీమ్.. మెంటార్‌గా గౌతమ్ గంభీర్‌ను ఎంపిక చేసింది.

లక్నో డ్రాప్ట్ ఇదే..

లక్నో డ్రాప్ట్ ఇదే..

మెగా వేలానికి ముందు కీలక ఘట్టమైన రిటెన్షన్ ప్రక్రియ ముగియగా.. కొత్త జట్లు ముగ్గురేసి ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంది. ఈ నెల 22లోపు కొత్తగా లీగ్‌లోకి వచ్చిన అహ్మదాబాద్, లక్నో ఈ ప్రక్రియను ముగించాల్సి ఉంది. ఈ క్రమంలోనే లక్నో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, ఆల్‌‌రౌండర్ మార్కస్ స్టోయినీస్, రవి బిష్ణోయ్‌లను తీసుకుందని కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్‌ల పేర్లు పెద్దగా వినిపించలేదు. అయితే ఈఎస్‌పీఎన్ మాత్రం లక్నో డ్రాఫ్ట్ ఇదేనంటూ ముగ్గురి జాబితాను ప్రకటించింది.

ఎవరీ జీతం ఎంతంటే..?

ఎవరీ జీతం ఎంతంటే..?

అంతేకాకుండా ఈ ముగ్గురి ఆటగాళ్ల సాలరీ డ్రాఫ్ట్ వివరాలను కూడా వెల్లడించింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంటే రూ.15 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 7 కోట్లు చెల్లిచాలి. కానీ లక్నో కేఎల్ రాహుల్‌కు రూ.15 కోట్లు చెల్లించేందుకు సిద్దమైందని, మార్కస్ స్టోయినిస్ రూ. 11 కోట్లు, రవిబిష్ణోయ్ రూ. 4 కోట్లకు తీసుకుందని తెలిపింది. గత సీజన్ వరకు పంజాబ్ కింగ్స్‌కు సారథ్యం వహించిన కేఎల్ రాహుల్.. ఈ సారి టీమ్ మారాలని భావించాడు. ఆ క్రమంలోనే పంజాబ్ కింగ్స్ రిటెన్షన్‌కు ఒప్పుకోలేదు.

పంజాబ్ కింగ్స్‌ను వదిలి..

పంజాబ్ కింగ్స్‌ను వదిలి..

ఇక 2013లో ఆర్‌సీబీ తరఫున ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన రాహుల్.. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్, 2016లో మళ్లీ ఆర్‌సీబీలోకి వెళ్లాడు. ఇక 2018లో పంజాబ్ కింగ్స్ అతనికి రూ. 11 కోట్లు చెల్లించి తీసుకుంది. ఐపీఎల్ 2020, 21 సీజన్లలో కెప్టెన్‌గా బాధ్యతలను కూడా ఇచ్చింది. అయితే రాహుల్ అద్భుత ప్రదర్శన కనబర్చినా ఆ జట్టు విజయాలందుకోలేకపోయింది. 55 ఇన్నింగ్స్‌లు ఆడిన 56.62 సగటుతో 2548 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు 25 హాఫ్ సెంచరీలున్నాయి. ఐపీఎల్ 2020, 2021 సీజన్‌లో అత్యధిక పరుగులు చేశాడు.

ఢిల్లీని వదిలి..

ఢిల్లీని వదిలి..

ఇక మార్కో స్టోయినిస్ 2015 నుంచి గత సీజన్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. 27 మ్యాచ్‌ల్లో 441 రన్స్‌తో పాటు 15 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా గత రెండు సీజన్లుగా మంచి టచ్‌లో ఉన్నాడు. అంతకు ముందు ఆర్‌సీబీతో పాటు పంజాబ్‌కు ఆడాడు. 2020 అండర్ 19 ప్రపంచకప్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన రవిబిష్ణోయ్‌ను పంజాబ్ కింగ్స్ తీసుకుంది. ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లో 12 వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబర్చిన బిష్ణోయ్ తన కెప్టెన్ కేఎల్ రాహుల్‌తోనే లక్నోలో చేరాడు.

Story first published: Tuesday, January 18, 2022, 16:27 [IST]
Other articles published on Jan 18, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X