న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: పంజాబ్ కింగ్స్ పేసర్ కగిసో రబడా ఒక్క బంతి ధర రూ.2.27 లక్షలు!

IPL 2022: Kagiso Rabada will earn 2.27 lakh per ball from Punjab Kings (PBKS)

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడాను పంజాబ్ కింగ్స్ రూ.9.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ సఫారీ పేసర్‌ను తీసుకునేందుకు నయా ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆసక్తి కనబర్చడంతో రబడా ధర అమాంతం పెరిగిపోయింది. గత మూడు సీజన్లలో రబడా అద్భుత ప్రదర్శన కనబర్చడంతో అతని కోసం ఫ్రాంచైజీలు ఆసక్తికనబర్చాయి.

అప్పట్లో రూ.5 కోట్లు..

అప్పట్లో రూ.5 కోట్లు..

ఐపీఎల్ 2018 సీజన్ కోసం జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ రబడాను రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే వెన్ను గాయం కారణంగా ఆ సీజన్ మొత్తానికి రబడా దూరమయ్యాడు. ఇక 2019 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగిన రబడా వరుసగా మూడు సీజన్లలో దుమ్మురేపాడు. ఈ మూడు సీజన్లలో ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరిందంటే దానికి ప్రధాన కారణం రబడా. 2020 సీజన్‌లో అయితే ఫైనల్ చేరి తృటిలో టైటిల్‌ను చేజార్చుకుంది.

నాలుగున్నర రెట్లు ఎక్కువ..

నాలుగున్నర రెట్లు ఎక్కువ..

ఈ సీజన్‌లో రబడా హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా పర్పుల్ క్యాప్ కూడా అందుకున్నాడు. ఇక ఐపీఎల్ 2022 సీజన్‌లో రూ.2 కోట్ల కనీస ధరతో అందుబాటులో ఉన్న 26 ఏళ్ల రబడాకు పంజాబ్ కింగ్స్ భారీ ధర వెచ్చించింది. దాంతో రబడా జీతం నాలుగున్నర(4.625) రెట్లు పెరిగిపోయింది. ఇప్పటి వరకు ఢిల్లీ తరఫున 50 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన రబడా 20.53 సగటుతో 76 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ 8.21 ఉండగా.. స్ట్రైక్ రేట్ 15గా ఉంది. బెస్ట్ బౌలింగ్ 4/21.

సౌతాఫ్రికా ప్లేయర్లలో టాప్..

సౌతాఫ్రికా ప్లేయర్లలో టాప్..

ఇక ఐపీఎల్ 2022 మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన సౌతాఫ్రికా ప్లేయర్‌గా రబడా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత రూ.7 కోట్లకు ఆర్‌సీబీ కొనుగోలు చేసిన ఫాఫ్ డుప్లెసిస్ నిలిచాడు. వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ రూ.6.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్‌ తీసుకోగా.. మార్కో జాన్సెన్‌ను రూ.4.2 కోట్లకు సన్‌రైజర్స్ ఎంపిక చేసుకుంది. అండర్ 19 సెన్సేషన్, బేబీ ఏబీడీగా గుర్తింపు పొందిన డేవాల్డ్ బ్రెవిస్‌ను ముంబై రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది.

ఒక్క బాల్‌‌కు రెండు లక్షల పైనే..

ఒక్క బాల్‌‌కు రెండు లక్షల పైనే..

అప్‌కమింగ్ సీజన్‌లో ప్రతీ జట్టు 14 లీగ్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. దాంతో పాటు ప్లేఆఫ్స్, ఫైనల్ కలిపి మరో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ లెక్కన కగిసో రబడా గరిష్టంగా 68 ఓవర్ల బౌలింగ్ చేయనున్నాడు. అంటే 408 బంతులు వేయనున్నాడు. ఈ లెక్కన అతను ఒక్క బంతికి రూ. 2.27 లక్షలు తీసుకోనున్నాడు. అంటే ఐపీఎల్‌లో అతను వేసే ఒక్కో బంతికి పంజాబ్ కింగ్స్ రూ.2.27 లక్షలు చెల్లించనుందన్నమాట.

Story first published: Thursday, February 17, 2022, 18:33 [IST]
Other articles published on Feb 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X