న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs PBKS:అంపైర్‌ వార్నింగ్‌.. దెబ్బకి బౌలింగ్‌ శైలి మార్చేసిన రియాన్‌ పరాగ్‌! చివరికి ఏమైందంటే(వీడియో)

IPL 2021, RR vs PBKS: Ryan Parag gets warning from umpire for underarm bowling action
#IPL2021,RR vs PBKS : Riyan Parag Gets వార్నింగ్ From Umpire For Bowling Round Arm | Oneindia Telugu

ముంబై: ఇటీవల కాలంలో 'రౌండ్‌ ఆర్మ్'‌ బౌలింగ్‌ను మనం తరుచు చూస్తున్నాం. బౌలర్లు తమ బౌలింగ్ శైలికి బిన్నంగా బంతిని విరుసురుతారు. బ్యాట్స్‌మన్‌ను కన్‌ఫ్యూజ్‌ చేసి.. వికెట్ తీసేందుకు ఈ తరహా బౌలింగ్‌ను వేస్తుంటారు. బౌలర్లు బంతిని విడుదల చేసే సమయంలో తమ చేతిని శరీరం నుంచి 90 డిగ్రీల వరకు వంచుతారు. రౌండ్‌ ఆర్మ్ బౌలింగ్‌ను 19వ శతాబ్దం మొదటి త్రైమాసికంలో ప్రవేశపెట్టారు. ఈ రౌండ్‌ ఆర్మ్ బౌలింగ్‌ను అంతర్జాతీయ స్టార్ స్పిన్నర్లు కూడా వేసిన ఘటనలు చాలా ఉన్నాయి. అందులో టీమిండియా స్పిన్నర్లు కూడా ఉన్నారు.

రౌండ్‌ ఆర్మ్ బౌలింగ్

రౌండ్‌ ఆర్మ్ బౌలింగ్

టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, కేదార్‌ జాదవ్‌లు కూడా 'రౌండ్‌ ఆర్మ్' బౌలింగ్‌ వేసిన జాబితాలో ఉన్నారు. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అశ్విన్..‌ రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ వేసి విమర్శలు పాలయ్యాడు. టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌.. అశ్విన్‌ బౌలింగ్‌ను తప్పుబట్టాడు. ఆఫ్‌ స్పిన్‌ను వదిలేసి ఈ బౌలింగ్‌ వేస్తున్నావేంటి అని ప్రశ్నించాడు. తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ రియాన్‌ పరాగ్‌ కూడా రౌండ్‌ ఆర్మ్ బౌలింగ్‌ వేశాడు. సోమవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ వేశాడు‌.

అంపైర్‌ వార్నింగ్

పంజాబ్‌ ఇన్నింగ్స్ సందర్భంగా హిట్టర్ క్రిస్ గేల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 10 ఓవర్‌ మూడో బంతిని రియాన్‌ పరాగ్‌ 'రౌండ్‌ ఆర్మ్'‌ బంతిగా వేశాడు.బంతి వేసే సమయంలో అతని మోచేతి గ్రౌండ్‌కు దాదాపు సమాంతరంగా ఉండటంతో అంపైర్‌ వార్నింగ్ ఇచ్చాడు. రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ వేస్తే నిబంధనలకు విరుద్ధమయ్యే అవకాశం ఉందని హెచ్చరించాడు. దాంతో వెంటనే పరాగ్‌ బౌలింగ్‌ యాక్షన్‌ మార్చేశాడు. తన మునపటి స్టైల్‌ బౌలింగ్‌ వేశాడు. అయినప్పటికీ గేల్‌ వికెట్ పడగొట్టాడు,. ఆ ఓవర్‌ ఐదో బంతిని గేల్‌ భారీ షాట్‌ ఆడగా.. బెన్‌ స్టోక్స్‌ సూపర్ క్యాచ్‌ పట్టాడు. లాంగాన్‌ వైపు భారీ షాట్ ఆడగా.. పరుగెత్తుకుంటూ వచ్చిన స్టోక్స్‌ క్యాచ్ పట్టుకోవడంతో గేల్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ వెంటనే రియాన్‌ సంబరాలు చేసుకున్నాడు.

ఏం పేరు పెడుతారు

ఏం పేరు పెడుతారు

రియాన్‌ పరాగ్‌ బౌలింగ్ యాక్షన్‌కు సంబందించిన వీడియోను ఐపీఎల్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'ఇది రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ అంటారా?. మీరు దీనికి ఏం పేరు పెడుతారో ఆలోచించండి' అని ట్వీట్ చేసింది. దీనికి అభిమానులు తమదైన శైలిలో సమాధానాలు ఇస్తున్నారు. ఈ మ్యాచులో పరాగ్‌ ఒకే ఓవర్ వేసి 7 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయినా కూడా కెప్టెన్ సంజు శాంసన్‌ అతనికి మరో ఓవర్ ఇవ్వకపోవడం విశేషం.

శాంసన్‌ మెరిసినా

శాంసన్‌ మెరిసినా

సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 4 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై గెలిచింది. కేఎల్ రాహుల్‌ (91; 50 బంతుల్లో 7×4, 5×6), దీపక్‌ హుడా (64; 28 బంతుల్లో 4×4, 6×4) చెలరేగడంతో మొదట పంజాబ్‌ 6 వికెట్లకు 221 పరుగులు చేసింది. గేల్‌ (40; 28 బంతుల్లో 4×4, 2×6) మెరిశాడు. రాజస్థాన్ పేసర్ చేతన్‌ సకారియా (3/31) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ 7 వికెట్లు కోల్పోయి 217 పరుగులే చేసింది. కెప్టెన్‌ సంజు శాంసన్‌ (119; 63 బంతుల్లో 12×4, 7×6)‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

మూడు జట్లతోనే ఐపీఎల్‌.. కెప్టెన్‌లు వారే!!

Story first published: Tuesday, April 13, 2021, 8:07 [IST]
Other articles published on Apr 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X