న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs KKR బిగ్ ఫైట్.. గెలుపే టార్గెట్! రస్సెల్ X మోరీస్.. రాజస్థాన్ జట్టులోకి యువ హిట్టర్! తుది జట్లు ఇవే!

IPL 2021: RR vs KKR Predicted Playing 11, Dream11 Tips For Match 18

ముంబై: ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభంలో ఒక్కో విజయంతో జోరు చూపెట్టి తర్వాత డీలా పడ్డ రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ కీలక పోరుకు సిద్దమయ్యాయి. శనివారం రాత్రి జరిగే లీగ్ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటివరకు చెరో నాలుగు మ్యాచ్‌లు ఆడిన రెండు జట్లు ఒకే ఒక్కదాంట్లో గెలిచి మూడింటిలో ఓడాయి. దాంతో ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి గాడిలో పడాలని కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ భావిస్తున్నాయి. అయితే గత మ్యాచ్‌లో ఓడినా కోల్‌కతా విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. రస్సెల్, కమిన్స్, దినేశ్ కార్తీక్ చెలరేగడంతో తమ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. ఇదే జోరును కొనసాగిస్తూ రాజస్థాన్‌ను మట్టికరిపించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు గత మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన రాజస్థాన్.. తమ తప్పిదాలను సరిదిద్దుకోవాలనే పట్టుదలతో ఉంది. మరి ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి!

Happy Birthday Sachin Tendulkar: ఏడారిలో పరుగుల తుఫాన్ .. బర్తేడే రోజు ఆస్ట్రేలియాను మాములుగా ఆడుకోలేదు!Happy Birthday Sachin Tendulkar: ఏడారిలో పరుగుల తుఫాన్ .. బర్తేడే రోజు ఆస్ట్రేలియాను మాములుగా ఆడుకోలేదు!

ఆ తప్పిదమే మా కొంపముంచింది: రోహిత్ శర్మఆ తప్పిదమే మా కొంపముంచింది: రోహిత్ శర్మ

 సమష్టిగా రాణిస్తేనే..?

సమష్టిగా రాణిస్తేనే..?

ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ పేపర్‌ మీద బలంగా కనిపిస్తున్నా.. సమష్టిగా రాణించడంలో విఫలమవుతోంది. అప్పుడెప్పుడో సన్‌రైజర్స్ హైదరాబాద్ మీద గెలిచిన తర్వాత మళ్లీ ఆ స్థాయిలో మెరుపులు మెరిపించలేదు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గెలుపు అంచల్లోకి వచ్చినా విజయాన్నందుకోలేకపోయింది. స్టార్ పేసర్ కమిన్స్.. బ్యాట్స్‌మెన్‌గా ఆకట్టుకోవడం జట్టుకు అదనపు ప్రయోజనం. రస్సెల్, కార్తీక్ ఫామ్‌లోకి రావడం మంచి పరిణామం. అయితే ఓపెనింగ్‌లో గిల్, రాణా నుంచి మంచి ఆరంభం లభించడం లేదు. ఈ ఇద్దరిలో ఒకరు రాణిస్తే మరొకరు విఫలమవుతున్నారు. దీనిపై టీమ్‌మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టాల్సి ఉంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వైఫల్యం కూడా టీమ్‌పై ప్రభావం చూపిస్తున్నది. డేత్ ఓవర్స్‌లో కేకేఆర్ బౌలర్లు రన్స్‌ను కట్టడి చేయలేకపోతున్నారు. దీంతో చేజింగ్‌లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించుకుంటే కేకేఆర్‌ విజయం సాధించవచ్చు. తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. కమలేష్ నాగర్ కోటి, శివం మావీలో ఒకరికి అవకాశం దక్కవచ్చు.

టాప్-4 చెలరేగితేనే

టాప్-4 చెలరేగితేనే

మరోవైపు రాజస్థాన్‌ పరిస్థితి కూడా సేమ్ ఇలాగే ఉంది. బెంగళూరు చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడటం టీమ్ కాన్షిడెన్స్‌ను దెబ్బతీసింది. రాజస్థాన్ రాయల్స్‌పై సెంచరీ కొట్టిన శాంసన్.. మళ్లీ ఆస్థాయిలో ఆడటం లేదు. బట్లర్, మనన్ వోహ్రా, మిల్లర్ ఫామ్‌లేమి వైఫల్యాలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నది. బ్యాటింగ్‌తో పాటు రాయల్స్ బౌలింగ్ కూడా ఆందోళనకరంగానే ఉంది. కాస్ట్‌లీ ప్లేయర్ మోరిస్‌తో పాటు ముస్తాఫిజుర్ ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు. రన్స్ కట్టడి చేయలేక వికెట్లు తీయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్చర్, స్టోక్స్ లేకపోవడం అతిపెద్ద లోటుగా కనిపిస్తున్నది. ఓవరాల్‌గా తమకున్న సమస్యలను పరిష్కరించుకుంటే తప్ప.. కేకేఆర్‌ను కట్టడి చేయడం రాయల్స్‌కు అంత ఈజీ కాబోదు. తుది జట్టులో మార్పలు జరగవచ్చు. గత నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైన మనన్ వోహ్రాపై వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో యువ హిట్టర్ యశస్వి జైస్వాల్‌కు అవకాశం రావచ్చు. ముస్తాఫిజుర్‌కు బదులు ఆండ్రూ టైని అడించవచ్చు.

ముఖా ముఖి..

ముఖా ముఖి..

ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 23 మ్యాచ్‌ల్లో తలపడగా కేకేఆర్ 12 విజయాలతో పై చేయి సాధించింది. రాజస్థాన్ మాత్రం 10 విజయాలతో సరిపెట్టుకోగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక గత సీజన్‌లో రెండు సార్లు కేకేఆర్‌నే విజయం వరించింది. యూఏఈ వేదికగా జరిగిన ఈ సీజన్‌లో కేకేఆర్ భారీ స్కోర్లు చేయగా.. రాజస్థాన్ చేతులెత్తేసి దారుణ ఓటములు చవిచూసింది. అయితే కేకేఆర్‌పై సంజూ శాంసన్‌(261)కు మంచి రికార్డు ఉంది. అయితే వాంఖడే మైదానంలో కోల్‌కతాకు మెరుగైన రికార్డు లేకపోవడం రాజస్థాన్‌కు కలిసొచ్చే అంశం. ఈ మైదానంలో జరిగిన 9 మ్యాచ్‌ల్లో కేకేఆర్ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలుపొందింది. పైగా రస్సెల్‌పై క్రిస్ మోరీస్‌కు మంచి రికార్డు ఉంది.

తుది జట్లు(అంచనా):

తుది జట్లు(అంచనా):

కోల్‌కతా నైట్‌రైడర్స్: నితీష్ రాణా, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), దినేశ్ కార్తీక్(కీపర్), ఆండ్రీ రస్సెల్, ప్యాట్ కమిన్స్, కమలేష్ నాగర్‌కోటి/శివం మావి, వరుణ్ చక్రవర్తీ, ప్రసిధ్ కృష్ణ

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్/అనుజ్ రావత్, సంజూ శాంసన్(కెప్టెన్), శివమ్ దూబే, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరీస్, జయదేవ్ ఉనాద్కత్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్/ఆండ్రూ టై

డ్రీమ్11 ప్రిడిక్షన్:

జోస్ బట్లర్(కెప్టెన్), సంజూ శాంసన్, నితీష్ రాణా, శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, ఆండ్రూ రస్సెల్(వైస్ కెప్టెన్), క్రిస్ మోరీస్, శివమ్ దూబే, ప్రసిధ్ కృష్ణ, ఆండ్రూటై, వరుణ్ చక్రవర్తీ

Story first published: Saturday, April 24, 2021, 10:34 [IST]
Other articles published on Apr 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X