IPL 2021: ఉతప్పని జట్టులోకి తీసుకున్న చెన్నై.. అందుకోసమేనా?

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2021ని ఏప్రిల్‌, మేలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. టీ20 లీగ్‌ 14వ సీజన్‌లో ఎవరెవరిని అట్టిపెట్టుకోవాలో, ఎవరెవరిని వదిలించుకోవాలో ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం అన్ని జట్లూ తమకు కావాలసిన, అవసరం లేని ఆటగాళ్ల జాబితాలను విడుదల చేశాయి. అందరిలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా స్టార్ ఆటగాళ్లను వదులుకుంది.

ఉతప్పని జట్టులోకి తీసుకున్న చెన్నై

ఉతప్పని జట్టులోకి తీసుకున్న చెన్నై

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ షేన్ వాట్సన్‌, హర్భజన్ సింగ్, పీయూస్ చావ్లా, మురళీ విజయ్, కేదార్ జాదవ్, మోనూ సింగ్‌‌లను వేలంలోకి విడిచిపెట్టింది. తాజాగా ట్రేడ్ రూపంలో రాజస్థాన్ రాయల్స్ నుంచి సీనియర్ ఓపెనర్ రాబిన్ ఉతప్పని జట్టు‌లోకి తీసుకుంది. చెన్నై టీమ్‌కి మూడు సవంత్సరాలుగా ఓపెనర్‌గా ఆడిన షేన్ వాట్సన్ ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పడంతో.. అతడి స్థానాన్ని భర్తీ చేయడం కోసం చెన్నై ఉతప్పను తీసుకుందని తెలుస్తోంది. ఐపీఎల్ 2020 సీజన్ వేలంలో రూ.3 కోట్లకి ఉతప్పని రాజస్థాన్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

12 మ్యాచ్‌లలో 196 రన్స్

12 మ్యాచ్‌లలో 196 రన్స్

ఐపీఎల్ 2020 సీజన్‌లో రాబిన్ ఉతప్ప రాజస్థాన్ రాయల్స్ తరఫున 12 మ్యాచ్‌లు ఆడాడు. 16.33 సగటుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 19 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. గత సీజన్లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలిపించే ఇన్నింగ్స్‌ లేదు. అయినా కూడా ఉతప్పని వేలంలోకి వదిలిపెట్టని రాజస్థాన్.. గత బుధవారం రిటైన్ చేసుకుంకుంది. కానీ తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌కి ట్రేడ్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. రాజస్థాన్ తరఫున స‌ంజు శాంస‌న్‌, జోస్ బ‌ట్ల‌ర్‌, మ‌న‌న్ వోహ్రా, బెన్ స్టోక్స్‌ ఓపెనర్లుగా ఆడే అవకాశం ఉంది.

4607 పరుగులు

4607 పరుగులు

ఐపీఎల్ 2008 సీజన్ నుంచి రాబిన్ ఉతప్ప ఆడుతున్నాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పుణె వారియర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌కి ఆడిన ఉతప్ప.. ఐపీఎల్ 2021 సీజన్‌కి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడబోతున్నాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటి వరకూ 189 మ్యాచ్‌లు ఆడిన ఉతప్ప.. 129.99 స్ట్రైక్‌రేట్‌తో 4607 పరుగులు బాదాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్ తరఫున 46 వన్డేలు, 13 టీ20లు కూడా ఆడాడు.

చెన్నై సూప‌ర్ కింగ్స్‌

చెన్నై సూప‌ర్ కింగ్స్‌

రిటేన్ చేసుకున్న ప్లేయ‌ర్స్‌: ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా, అంబ‌టి రాయుడు, డ్వేన్ బ్రేవో, జోష్ హేజిల్‌వుడ్‌, సామ్ క‌ర‌న్‌, కేఎం ఆసిఫ్‌, దీప‌క్ చ‌హ‌ర్‌, ఫాఫ్ డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్‌, ఎన్ జ‌గ‌దీశ‌న్‌, క‌రణ్ శ‌ర్మ‌, లుంగి ఎంగిడి, మిచెల్ సాంట్న‌ర్‌, రవీంద్ర జ‌డేజా, రుతురాజ్ గైక్వాడ్‌, శార్దూల్ ఠాకూర్, సాయి కిశోర్‌.

రిలీజ్ చేసిన ప్లేయ‌ర్స్‌: పియూష్ చావ్లా, హ‌ర్భ‌జ‌న్ ‌సింగ్‌, కేదార్ జాద‌వ్‌, ముర‌ళీ విజ‌య్‌, మోను సింగ్‌, షేన్ వాట్స‌న్‌.

క్రికెట్‌ అంటే ఆట మాత్రమే కాదు.. అంతకన్నా ఎక్కువ! నట్టూ స్వాగతంపై సెహ్వాగ్!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Friday, January 22, 2021, 11:44 [IST]
Other articles published on Jan 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X