న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'తొలి టెస్టు అనంతరం జట్టులో చోటు దక్కక పోవడం బాధించింది.. నా టెక్నిక్‌ గురించి కలత చెందా'

IPL 2021: Prithvi Shaw said I was worried about my technique after getting dropped in Australia

ముంబై: ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో తొలి టెస్టు తర్వాత జట్టులో చోటు దక్కపోవడం చాలా బాధించిందని ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ పృథ్వీ షా తెలిపాడు. పదే పదే బౌల్డ్‌ అవుతున్నానంటే.. తన బ్యాటింగ్‌ టెక్నిక్‌లో ఏదో సమస్య ఉందని గ్రహించానని చెప్పాడు. ఐపీఎల్‌ 2021‌లో ఇప్పటివరకూ ఢిల్లీ ఆడిన మూడు మ్యాచ్‌లకు గాను రెండు మ్యాచ్‌ల్లో షా మెరిశాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 బంతుల్లో 72 పరుగులు చేసిన షా.. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ఏదో సమస్య ఉందని గ్రహించా

ఏదో సమస్య ఉందని గ్రహించా

ఆదివారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం పృథ్వీ షా మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియా సిరీస్‌లో తొలి టెస్టు తర్వాత జట్టులో చోటు దక్కపోవడం చాలా బాధించింది. ఆ సిరీస్‌లో తొలి టెస్టు తర్వాత నాకు జట్టులో చోటు దక్కలేదు. నా టెక్నిక్‌ గురించి విపరీతమైన కలత చెందా. నేను పదే పదే బౌల్డ్‌ అవుతున్నానంటే.. నా బ్యాటింగ్‌ టెక్నిక్‌లో ఏదో సమస్య ఉందని గ్రహించా. అది చిన్న సమస్య అయినా దాన్ని అధిగమించాలనుకున్నా. దానిపైనే ప్రధానంగా దృష్టి సారించి అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా' అని తెలిపాడు.

అంచనా వేయడంపై ఫోకస్‌ చేశా

అంచనా వేయడంపై ఫోకస్‌ చేశా

'బౌలర్లు బంతులు వేసే ముందు వాటిని అంచనా వేయడంపై ఫోకస్‌ చేశా. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వెంటనే నా కోచ్‌ ప్రశాంత్‌ షెట్టి సర్‌, ప్రవీణ్‌ ఆమ్రే సర్‌ల పర్యవేక్షణలో దాన్ని సరిచేసుకున్నా. విజయ్‌ హజారే ట్రోఫీకి వెళ్లేముందే నా టెక్నిక్‌ సమస్యను సరిచేసుకోవడంతో టోర్నీలో రాణించా. విజయ్‌ హజారే ట్రోఫీలో నా సహజ సిద్ధమైన ఆట ఆడాను. నేను సరిచేసుకున్నది కేవలం చిన్న టెక్నిల్‌ సమస్యే అయినా అది నాకు చాలా తలనొప్పిగా మారింది. నేను ఐపీఎల్‌ ​కోసం ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయలేకపోయాను. పాంటింగ్‌ సర్‌, ఆమ్రే సర్‌, ప్రశాంత్‌ షెట్టి సర్‌ల సూచనలతో నాకు మంచి ప్రాక్టీస్‌ సెషన్స్‌ లభిస్తున్నాయి' అని షా చెప్పుకొచ్చాడు.

నాయకుడిగా నాకెంతో సంతోషంగా ఉంది

నాయకుడిగా నాకెంతో సంతోషంగా ఉంది

'ఢిల్లీ జట్టుకు నాయకుడిగా నాకెంతో సంతోషంగా ఉంది. మ్యాచులు గెలిపించడంపైనే దృష్టి సారించాం. ఇక ఈ మ్యాచ్ ఆరంభంలో మాపై బాగా ఒత్తిడి ఉంది. పిచ్‌ అంతగా సహకరించలేదు. మా బౌలర్లు పంజాబ్‌ను 190 పరుగులకే కట్టడి చేయడం మంచి ప్రదర్శన. ఛేదనలో శిఖర్‌ ధావన్ మాకు పూర్తి ఆధిపత్యం వచ్చేలా ఆడాడు. జట్టు ఎప్పుడూ ఉల్లాసంగా ఉండాలనే కోరుకుంటాను. అలాగే ఆటలోనూ చక్కగా రాణించాలని ఆశిస్తాను' అని ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ అన్నాడు.

250 పరుగులు చేస్తారేమో అనుకున్నా

250 పరుగులు చేస్తారేమో అనుకున్నా

'పది ఓవర్లు అయ్యేసరికి మ్యాచ్‌లో రాహుల్‌ సేన 250 పరుగులు చేస్తుందేమో అనుకున్నా. కానీ బాగా ఆపగలిగాం. బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. మా జట్టులో శిఖర్ ధావన్‌ అద్భుతంగా ఆడాడు. గతేడాది ఫాంనే కొనసాగిస్తున్నాడు. అతని పరుగుల దాహం ఇంకా తీరలేదు. ఐపీఎల్‌ తొలి అర్ధ భాగంలో ప్రతి మ్యాచూ ఫైనల్‌లాగే ఉంటుంది. మరింత మంచి ప్రదర్శన చేయాలి' అని ఢిల్లీ స్టార్ ఆల్‌రౌండర్‌ మార్కస్ స్టోయినిస్‌ పేర్కొన్నాడు.

RCB vs KKR: బెంగళూరు మూడు మ్యాచ్‌లు గెలవడం ఇదే తొలిసారి!!

Story first published: Monday, April 19, 2021, 17:14 [IST]
Other articles published on Apr 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X