న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మనీష్ పాండేను రెండు మ్యాచ్‌లు పక్కనబెడితే సెట్ అవుతాడు: ప్రజ్ఞాన్ ఓజా

IPL 2021: Pragyan Ojha says Will be good for Manish Pandey if he gets a break for couple of games

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో దారుణంగా విఫలమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండేను రెండు మ్యాచ్‌లకు పక్కనబెడితే సెట్ అవుతాడని భారత మాజీ స్పిన్నర్, హైదరాబాద్ ప్లేయర్ ప్రజ్ఞాన్ ఓజా అన్నాడు. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఫ్రాంచైజీ అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడన్నాడు. కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి కల్పిస్తే.. అతని తప్పిదాలేంటో తెలిసొస్తాయని చెప్పాడు.

శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. బెయిర్‌స్టో (22 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మంచి శుభారంభాన్ని అందించినా.. మరోసారి మిడిలార్డర్ చేతులెత్తయడంతో గెలిచే మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమి చవిచూసింది.

జాదవ్‌ను తీసుకోవాలి..

జాదవ్‌ను తీసుకోవాలి..

ఇండియాటుడేతో ఈ ఫలితంపై స్పందించిన ప్రజ్ఞాన్ ఓజా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌మేనేజ్‌మెంట్‌కు కొన్ని విలువైన సూచనలు చేశాడు. మనీశ్ పాండే‌కు విశ్రాంతినిచ్చి అతనిస్థానంలో కేదార్ జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని ఈ హైదరాబాద్ స్టార్ చెప్పుకొచ్చాడు. చెన్నై పిచ్‌లపై కేదార్‌కు మంచి అనుభవం ఉందని, అతను మిడిలార్డర్‌లో రాణించగలడని పేర్కొన్నాడు.

'సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కేదార్ జాదవ్ వంటి ఆటగాడు అవసరం. ఎందుకంటే ఆ జట్టు మిడిలార్డర్ మరీ బలహీనంగా ఉంది. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో అందించిన మంచి శుభారంభాన్ని కూడా ముందుకు తీసుకోలేనంత బలహీనమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. విఫలమవుతున్న మనీష్ పాండేను రెండు మూడు మ్యాచ్‌లకు పక్కనపెడితే అంతా సెట్ అవుతుంది. అతనికి కూడా ఉపయోగపడుతుంది. అతని స్థానంతో కేదార్ జట్టులోకి తీసుకుంటే టీమ్ బ్యాలెన్సింగ్‌గా ఉంటుంది. పైగా కేదార్ బౌలింగ్ కూడా చేయగలడు.

అనుభవ రాహిత్యం..

అనుభవ రాహిత్యం..

కొన్నేళ్లుగా మనీష్ పాండే సన్‌రైజర్స్ తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. కానీ అనుభవరాహిత్యం కారణంగా ఈ మిడిలార్డర్ బాధ్యతలను మోయలేకపోతున్నాడు. జట్టులో మూడో నెంబర్ చాలా ముఖ్యమైంది. అతను స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ముఖ్యంగా ఒత్తిడిని అధిగమించలేకపోతున్నాడు. కాబట్టి అతనికి కపుల్ ఆఫ్ గేమ్స్ బ్రేక్ ఇస్తే.. తన తప్పిదాలేంటో తెలుసుకుంటాడు. ఏ ఆటగాడికైనా వరుసగా ఆడుతుంటే తప్పిదాలు తెలియవు. తన చుట్టూ అసేలం జరుగుతోందో తెలియదు. ఇలాంటప్పుడే ఓ చిన్న బ్రేక్ ఇవ్వాలి'అని ప్రజ్ఞాన్ ఓజా చెప్పుకొచ్చాడు.

మూడు మ్యాచ్‌ల్లో..

మూడు మ్యాచ్‌ల్లో..

ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో మనీష్ పాండే(44 బంతుల్లో 61 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించినా మ్యాచ్‌ను ముగించలేకపోయాడు. దాంతో ఆ మ్యాచ్‌ను సన్‌రైజర్స్ తృటిలో చేజార్చుకోవాల్సింది. అనంతరం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో 38 రన్స్ చేసిన పాండే మరోసారి 150 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 7 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. ఇక ముంబై జరిగిన తాజా మ్యాచ్‌లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైన మనీశ్ పాండే మరోసారి ఓటమికి కారణమయ్యాడు. దాంతో హైదరాబాద్ ఫస్ట్ టైమ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది.

గెలిచే మ్యాచ్‌లో..

గెలిచే మ్యాచ్‌లో..

శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 13 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్‌ డికాక్‌ (39 బంతుల్లో 40; 5 ఫోర్లు) రాణించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్, విజయ్‌ శంకర్‌ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్‌ 19.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. బెయిర్‌స్టో (22 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) కాసేపే ఉన్నా కసిదీరా బాదేశాడు. రాహుల్‌ చహర్‌ (3/19) స్పిన్‌ మాయాజాలం, బౌల్ట్‌ (3/28) పేస్‌ అటాక్‌ ముంబైని విజేతగా నిలబెట్టాయి.

Story first published: Sunday, April 18, 2021, 15:38 [IST]
Other articles published on Apr 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X