న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021 Points Table: టాప్‌లో ఆర్‌సీబీ.. అట్టడుగున సన్‌రైజర్స్ హైదరాబాద్!

IPL 2021: Points Table, Orange Cap Holder And Purple Cap Holder List After DC vs PBKS Match
IPL 2021 Points Table: RCB on Top, SRH At Bottom TOP 4 | Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దుమ్మురేపుతోంది. బ్యాటింగ్‌లో పరుగుల సునామీ సృష్టిస్తూ.. హ్యాట్రిక్ విజయంతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో నిలకడైన ప్రదర్శనతో ఎదురొచ్చిన ప్రతీ ప్రత్యర్థిని చిత్తు చేస్తోంది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లోనూ 38 రన్స్ తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ గెలుపుతో మొత్తం 6 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆర్‌సీబీ అగ్రస్థానానికి ఎగబాకింది. పంజాబ్ కింగ్స్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ 4 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. కోల్‌కతాతో మ్యాచ్ ముందు వరకూ నెట్ రన్‌రేట్‌‌లో వెనకబడిన బెంగళూరు.. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఒక్కసారిగా అన్ని జట్ల కంటే మెరుగైన నెట్ రన్‌రేట్‌ (+0.750)ను సొంతం చేసుకుంది.

పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతం ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి. ఐపీఎల్ 2021 సీజన్ లీగ్ దశలో మొత్తం 56 మ్యాచ్‌లు జరగనుండగా.. లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు ముగిసే సమయానికి టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే. టేబుల్‌ల్లో ఐదో స్థానంలో రాజస్థాన్ రాయల్స్.. ఆ తర్వాత వరుసగా కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉన్నాయి. తాజా సీజన్‌లో ఇప్పటికే 11 మ్యాచ్‌లు ముగియగా.. గెలుపు బోణి కొట్టని ఏకైక జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే. ఆ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.

ఈ క్యాష్ రిచ్ టోర్నీలో భాగంగా నేడు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఒకవేళ చెన్నై గెలిస్తే..? పాయింట్ల పట్టికలో ఆ జట్టు నాలుగు నుంచి రెండో స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీ, ముంబైతో పోలిస్తే ధోనీసేనకు మెరుగైన నెట్ రన్‌రేట్ ఉంది.

ఇక ఆరెంజ్ క్యాప్‌ను ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ సొంతం చేసుకున్నాడు. ఈ రేసులో ధావన్‌(186)తో పాటు ఆర్‌సీబీ గ్లేన్ మ్యాక్స్‌వెల్(176), పంజాబ్ కింగ్స్ కేఎల్ రాహుల్(157), కేకేఆర్ నితీష్ రాణా(155) పోటీ పడుతున్నారు. పర్పుల్ క్యాప్‌ను ఆర్‌సీబీ యువ బౌలర్ హర్షల్ పటేల్ సొంతం చేసుకున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో అతను 9 వికెట్లు తీసి టాప్‌లో ఉన్నాడు. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ రాహుల్ చాహర్(7), ఢిల్లీ అవేశ్ ఖాన్(6), ట్రెంట్ బౌల్ట్(6), ఆండ్రూ రస్సెల్(6) రేసులో ఉన్నారు.

DC vs PBKS trolls: అయ్యా రాహుల్.. ఆ ఆరెంజ్ క్యాప్ కోసం కాకుండా జట్టుకోసం ఆడయ్యా!DC vs PBKS trolls: అయ్యా రాహుల్.. ఆ ఆరెంజ్ క్యాప్ కోసం కాకుండా జట్టుకోసం ఆడయ్యా!

Story first published: Monday, April 19, 2021, 8:33 [IST]
Other articles published on Apr 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X