న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: ముంబై ఇండియన్స్‌లోకి 16 ఏళ్ల నాగాలాండ్ స్పిన్నర్!

IPL 2021: Mumbai Indians Call Up 16-year-old Nagaland Spinner Khrievitso Kense For Trials
IPL 2021 Auction : Mumbai Indians Call Up 16-year-old Nagaland Spinner For Trials

ముంబై: ఐపీఎల్ 2021 సీజన్ వేలం కోసం ముంబై ఇండియన్స్ అన్ని విధాలుగా సిద్దమవుతుంది. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌కు సంబంధించిన మినీ వేలాన్ని చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న నిర్వహిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై తమ ప్రణాళికలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎక్స్‌ట్రా స్పిన్నర్ కోసం అన్వేషిస్తున్న ఈ ఫైవ్ టైమ్ చాంపియన్.. నాగాలాండ్‌కు చెందిన ఓ యువ స్పిన్నర్‌ను ట్రయల్స్‌కు ఆహ్వానించింది.

16 ఏళ్ల లెగ్ స్పిన్నర్..

16 ఏళ్ల లెగ్ స్పిన్నర్..

దేశావాళీ ప్రతిష్టాత్మక టీ20 లీగ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇటీవలే నాగాలాండ్ తరఫున అరంగేట్రం చేసిన 16 ఏళ్ల ఖ్రివిట్సో కెన్స్ ప్రదర్శనకు ముంబై ఫ్రాంచైజీ అధికారులు ముగ్దులయ్యారు. లెగ్ స్పిన్నర్ అయిన ఖ్రివిట్సో కెన్స్.. ఈ దేశవాళీ ధనాధన్ లీగ్‌లో నాలుగు మ్యాచ్‌లాడి ఏడు వికెట్లు తీశాడు. అతని బౌలింగ్ యావరేజ్ 12 ఉండగా.. స్ట్రైక్‌రేట్ 13.1తో పాటు ఎకానమీ 5.47గానే ఉంది. టీ20 క్రికెట్‌లో ఇంత మంచి గణంకాలున్న స్పిన్నర్లు చాలా అరుదు. ఇక మిజోరంతో జరిగిన మ్యాచ్‌లో కెన్స్ (3/16) మూడు వికెట్లతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. దాంతో ఈ యువ ఆటగాడి సత్తాను పరీక్షించేందుకు ముంబై ఫ్రాంచైజీ ట్రయల్స్‌కు ఆహ్వానించిందని ఓ జాతీయ దినపత్రిక పేర్కొంది.

తొలి ఈశాన్య క్రికెటర్‌గా..

నాగాలాండ్‌లోని ఓ చిన్న గ్రామానికి చెందిన ఈ యువ లెగ్ స్పిన్నర్‌ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ నుంచి పిలుపు రావడం పట్ల ఉత్సాహంగా ఉన్నాడు. ఒకవేళ ఖ్రివిట్సో కెన్స్ వేలంలోకి ప్రవేశించి, అతన్ని ఏ జట్టు అయిన కొనుగోలు చేస్తే అది నాగాలాండ్ క్రికెట్ జట్టుకు గోప్ప విషయం కానుంది. అలాగే ఈశాన్య రాష్ట్రాల నుంచి ఐపీఎల్ ఆడిన తొలి క్రికెటర్‌గా కూడా ఈ 16 ఏళ్ల ఖ్రివిట్సో కెన్స్ రికార్డుకెక్కనున్నాడు.

 అదరగొట్టిన కెన్స్..

అదరగొట్టిన కెన్స్..

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నాగాలాండ్ తరఫున కెన్స్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. అంతేకాకుండా నార్త్ ఈస్ట్ జట్ల తరఫున కూడా అతనే టాప్ పెర్ఫార్మర్‌గా ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన నాగాలాండ్ నాలుగింటిలో విజయం సాధించగా చండీఘడ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దయింది. దాంతో ప్లేట్ గ్రూప్‌లో బిహార్, చండీఘడ్ తర్వాతి స్థానంలో నిలిచింది. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తుది దశకు చేరుకున్న విషయం తెలిసందే. తమిళనాడు, బరోడా, రాజస్థాన్, పంజాబ్ సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. శుక్రవారం సెమీఫైనల్స్ జరగనుండగా.. ఆదివారం ఫైనల్ జరగనుంది.

 ముంబై ఇండియన్స్ రిటెన్షన్ లిస్ట్

ముంబై ఇండియన్స్ రిటెన్షన్ లిస్ట్

రిటైన్ ప్లేయర్లు: రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, క్రిస్ లిన్, సౌరభ్ తివారీ, ధావల్ కులకర్ణి, బుమ్రా, రాహుల్ చాహర్, బౌల్ట్, ఎం ఖాన్, హార్దిక్ పాండ్యా, జయంత్ యాదవ్, పొలార్డ్, కృనాల్ పాండ్యా, అనుకూల్ రాయ్, ఇషాన్ కిషన్, డికాక్, ఆదిత్యా తారే.

వదులుకున్న ప్లేయర్లు: మలింగ, కౌల్టర్​నీల్, ప్యాటిన్సన్, రూథర్​పొర్డ్, దిగ్విజయ్, ప్రిన్స్, మెక్​క్లెనగన్

Story first published: Thursday, January 28, 2021, 15:54 [IST]
Other articles published on Jan 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X