న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: ఆండ్రీ రసెల్‌ విధ్వంసం.. దినేష్‌ కార్తిక్‌కు తప్పిన ప్రమాదం (వీడియో)!!

IPL 2021: KKR Wicket keeper Dinesh Karthik saves himself from a Andre Russells powerful shot

ముంబై: మరో ఐదు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 14వ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆటగాళ్లు తమ ప్రాంచైజీతో కలిసి సాధన చేస్తున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఆటగాళ్లు కూడా ముమ్మర ప్రాక్టీస్ చేస్తున్నారు. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో శనివారం కేకేఆర్ ఆటగాళ్లు ప్రాక్టీస్‌ మ్యాచ్ ఆడారు. కేకేఆర్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలో రసెల్‌ ఆడిన ఓ షాట్ నుంచి దినేష్‌ కార్తిక్ తృటిలో తప్పించుకున్నాడు. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేది.

మెరుపు వేగంతో స్పందించి

శనివారం కేకేఆర్‌ జట్టు ఇంట్రా స్క్వాడ్‌ టీమ్‌ ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడాయి. ఒక జట్టుకు బెన్‌ కటింగ్‌ సారధ్యం వహించగా.. మరొ జట్టుకు మోర్గాన్‌ నాయకత్వం వహించాడు. ఇన్నింగ్స్‌ మధ్యలో ఆండ్రీ రసెల్‌ కొన్ని భారీ షాట్లతో అలరించాడు. ఈ నేపథ్యంలో రసెల్‌ కొట్టిన ఒక షాట్‌ నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న దినేష్‌ కార్తిక్‌ వైపు దూసుకెళ్లింది. అయితే కార్తిక్‌ మెరుపు వేగంతో స్పందించి మొకాళ్ల మీద కిందకు వంగడంతో రెప్పపాటులో బంతి అతని పై నుంచి వెళ్లిపోయింది. రసెల్‌ కొట్టిన పవర్‌పుల్‌ షాట్‌ ఒకవేళ కార్తిక్‌కు తగిలి ఉంటే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేది.

రెప్పపాటులో తప్పించుకున్నాడు

రెప్పపాటులో తప్పించుకున్నాడు

ఆండ్రీ రసెల్ ఆడిన భారీ షాట్‌కు సంబంధించిన వీడియోనూ కేకేఆర్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెట్టారు. 'రసెల్‌ పవర్‌ హిట్టింగ్‌ నుంచి కార్తిక్‌ తప్పించుకున్నాడు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఆ బంతి కార్తిక్‌కు తగిలి ఉంటే ఏమై ఉండేదో' అని మరొకరు ట్వీటారు. 'కార్తిక్‌.. రెప్పపాటులో తప్పించుకున్నాడు', 'ఆ షాట్ తగిలితే.. పెద్ద ప్రమాదమే జరిగేది' అంటూ కామెంట్స్‌ చేశారు. కేకేఆర్‌ ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 11న చెన్నై వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆడనుంది.

ఆరంభానికి ముందే షాక్

ఆరంభానికి ముందే షాక్

‌ఐపీఎల్ 2021 ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. కేకేఆర్‌ స్టార్ బ్యాట్స్‌మన్‌ నితీష్ రాణాకు కరోనా సోకింది. గురువారం రాణాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం రాణా ముంబైలోని కేకేఆర్‌ టీమ్ బసచేస్తున్న హోటల్‌లో క్వారెంటైన్‌లో ఉన్నాడు. వైద్యులు నిరంతరం ఆయను పరీక్షిస్తున్నారు. అయితే రాణాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని సమాచారం. రాణా మొదటి మ్యాచ్ ఆడడం అనుమానంగానే ఉంది.

మధ్యలోనే తప్పుకున్న కార్తీక్‌

మధ్యలోనే తప్పుకున్న కార్తీక్‌

ఐపీఎల్లో కేకేఆర్ ప్రయాణం ఒడుదొడుకులతో సాగుతుంది. తొలి మూడు సీజన్లలో లీగ్‌ దశలోనే ఇంటిబాట పట్టిన కేకేఆర్.. గౌతమ్‌ గంభీర్‌ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 2012, 2014 సీజన్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత గంభీర్‌ ఢిల్లీకి వెళ్ళిపోయినప్పయికీ.. ప్లేఆఫ్‌ వరకూ వెళ్తూ వచ్చింది. అయితే గత రెండు సీజన్లుగా ప్రదర్శన మరీ పేలవంగా మారింది. గతేడాది దినేశ్‌ కార్తీక్‌ మధ్యలోనే సారథ్య బాధ్యతలను ఇయాన్ మోర్గాన్‌కు కట్టబెట్టాడు. అయినప్పటికీ జట్టు తలరాత మారలేదు. ఈసారి ఎలా ఆడుతుందో చూడాలి.

IPL 2021: సీఎస్‌కే ఆఫర్‌ను తిరస్కరించిన స్టార్ పేసర్లు!! అసలు కారణం ఇదే?

Story first published: Sunday, April 4, 2021, 13:14 [IST]
Other articles published on Apr 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X