న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: ఐపీఎల్‌లో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలు అవే: పాట్ కమిన్స్

IPL 2021: KKR bowler Pat Cummins recalls his favourite IPL Moment

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌)లో తన మధుర క్షణాలను ఆస్ట్రేలియా స్టార్ పేసర్‌ పాట్‌ కమిన్స్ గుర్తుచేసుకున్నాడు. 2014 టైటిల్‌ సొంతం చేసుకున్న క్షణాలే ఐపీఎల్‌ టోర్నీలో తనకు గుర్తుండిపోయిన అత్యంత మధుర జ్ఞాపకమని తెలిపాడు. తాను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ఆడిన తొలి సీజన్‌లోనే కప్‌ గెలవడం అమిత ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడేందుకు భారత్‌కి వచ్చిన కమిన్స్.. కోల్‌కతా క్యాంప్‌లో చేరాడు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఏప్రిల్ 11న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెపాక్ వేదికగా కోల్‌కతా తన మొదటి మ్యాచ్‌ ఆడనుంది.

గుర్తుండిపోయే క్షణాలు అవే

గుర్తుండిపోయే క్షణాలు అవే

తొలి ‌మ్యాచ్‌కి సన్నద్ధమవుతున్న పాట్ కమిన్స్ సోషల్ మీడియాలో సరదాగా అభిమానులతో ముచ్చటించాడు. ఈ క్రమంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఐపీఎల్‌లో గుర్తుండిపోయే క్షణం ఏదని ఒకరు అడగ్గా.. '2014లో టైటిల్‌ నెగ్గడమే నాకు ఐపీఎల్‌తో ముడిపడిన అందమైన జ్ఞాపకం. మేం గెలిచిన మరుసటి రోజు, వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్న తీరు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. గౌతమ్ గంభీర్‌ ఓ సారథిగా ఎల్లప్పుడూ దూకుడుగానే ఉంటాడు. అతడి కెప్టెన్సీలో ఆడటాన్ని నేను పూర్తిగా ఆస్వాదించాను' అని బదులిచ్చాడు.

గంభీర్‌కు ఓటేసిన కమిన్స్

గంభీర్‌కు ఓటేసిన కమిన్స్

ఐపీఎల్‌లో మీరు ఆడిన ప్రాంచైజీలలో మంచి కెప్టెన్‌గా ఎవరని ప్రశ్నించగా.. గౌతమ్ గంభీర్‌కు పాట్ కమిన్స్ ఓటు వేశాడు. గంభీర్‌ కెప్టెన్సీలో 2012, 2014లో టైటిళ్లు గెలిచిన కేకేఆర్‌.. గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. అయితే ఈసారి ఎలాగైనా అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో ముందుకు సాగుతోంది. ఇక జస్ప్రీత్‌ బుమ్రా, కమలేశ్‌ నాగర్‌కొటి బౌలింగ్‌ను తాను ఇష్టపడతానని మరో అభిమానికి కమిన్స్ సమాధానం ఇచ్చాడు.

గబ్బా టెస్టు ఓటమికి కారణమేంటి

గబ్బా టెస్టు ఓటమికి కారణమేంటి

గబ్బా టెస్టు ఓటమికి కారణమేంటి? అని మరో అభిమాని ప్రశ్నించగా.. 'టీమిండియా ఎక్కువ పరుగులు చేసింది' అని పాట్ కమిన్స్ సరదాగా సమాధానమిచ్చాడు. నాలుగు టెస్టుల సిరీస్‌ 1-1తో సమమవగా.. గబ్బాలో గత 32 ఏళ్లలో ఆస్ట్రేలియా టెస్టుల్లో ఓడింది లేదు. దాంతో ఫేవరెట్‌గా ఆసీస్ బరిలోకి దిగారు. చివరి మ్యాచ్‌లో రిషబ్ పంత్, శుభమన్ గిల్, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ అద్భుతంగా ఆడి టీమిండియాకు విజయాన్ని అందించారు. దాంతో భారత్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.

ఈసారైనా న్యాయం చేస్తాడేమో చూడాలి

ఈసారైనా న్యాయం చేస్తాడేమో చూడాలి

ఐపీఎల్ 2020 సీజన్‌లో పాట్ కమిన్స్‌ని రూ.15.5 కోట్లకి కోల్‌కతా నైట్ ‌రైడర్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఓ విదేశీ ప్లేయర్ అంత భారీ మొత్తం దక్కించుకోవడం అదే మొదటిసారి. దాంతో కమిన్స్‌పై కేకేఆర్‌ భారీ ఆశలు పెట్టుకుంది. అయితే గత ఏడాది ఈ ఆసీస్ పేసర్ 14 మ్యాచ్‌లాడి 12 వికెట్లే పడగొట్టాడు. అయినప్పటికీ ఐపీఎల్ 2021 సీజన్ కోసం కమిన్స్‌ని కోల్‌కతా అట్టిపెట్టుకుంది. ఈ సీజన్లో అయినా కమిన్స్‌ తనపై పెట్టిన ధరకు న్యాయం చేస్తాడేమో చూడాలి.

IPL 2021: ధోనీ ఆటను చూస్తూ పెరిగా.. ఇప్పుడు తొలి మ్యాచ్‌లోనే మహీ బాయ్‌ను ఎదుర్కొంటున్నా: పంత్

Story first published: Tuesday, April 6, 2021, 18:50 [IST]
Other articles published on Apr 6, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X