Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: ధోనీ ఆటను చూస్తూ పెరిగా.. ఇప్పుడు తొలి మ్యాచ్‌లోనే మహీ బాయ్‌ను ఎదుర్కొంటున్నా: పంత్

DC skipper Rishabh Pant excited to face MS Dhoni in first match as Captain in IPL 2021
IPL 2021, CSK VS DC : Rishabh Pant Game Plan VS Dhoni, 'Mahi Bhai' నే డీ కొట్టబోతున్న పంత్

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆటను చూస్తూ పెరిగా అని ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ తెలిపాడు. తన జీవితంలో మహీ బాయ్‌కి ప్రత్యేకస్థానం ఉందని, ఇప్పుడు ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌గా అతడితో ఆడుతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. భారత యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా గాయపడడంతో మొత్తం ఐపీఎల్ 2021‌కు దూరమయ్యాడు. అయ్యర్‌ గైర్హాజరీలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌కు ఢిల్లీ యాజమాన్యం నాయకత్వ బాధత్యలు అప్పజెప్పింది. ఏప్రిల్‌ 10న చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో ఢిల్లీ తలపడనుంది.

ధోనీ బాయ్‌కి ప్రత్యేకస్థానం

ప్రాక్టీస్ అనంతరం రిషబ్‌ పంత్‌ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'కెప్టెన్సీ బాధ్యతలతో చాలా ఉత్సాహంగా ఉన్నా. ఒక కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే మహీ బాయ్‌ను ఎదుర్కొంటున్నా. నా జీవితంలో ధోనీ బాయ్‌కి ప్రత్యేకస్థానం ఉంది. ధోనీ ఆటను చూస్తూ పెరిగిన నాకు ఈరోజు అతని ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌గా ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. మహీ ఆట నుంచి ఎన్నో మెళుకువలు నేర్చుకున్న నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. ధోనీ లాంటి వ్యక్తితో ఆడేందుకు ఏ ఆటగాడైనా సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు నేను దానికోసం ఎదురుచూస్తున్నా' అని అన్నాడు.

 టైటిల్‌ అందిస్తానో లేదో తెలియదు

టైటిల్‌ అందిస్తానో లేదో తెలియదు

'కెప్టెన్‌గా ఢిల్లీకి టైటిల్‌ అందిస్తానో లేదో తెలియదు. కానీ ఒక మంచి సారథిగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తా. నాకు తెలిసి ఢిల్లీ గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తుంది. జట్టులో ఉండే ప్రతీ ఆటగాడు వంద శాతం తన ఆటకు న్యాయం చేస్తున్నాడు. ఇలా అయితే జట్టుగా మేం బలంగా ఉన్నట్లు నమ్ముతున్నా. జట్టులో ఆహ్లదకర వాతావరణం ఉంటే మ్యాచ్‌ ఫలితాలు అనుకూలంగా వస్తాయి. శ్రేయాస్ అయ్యర్‌ లేని లోటు తీర్చడం కష్టం కానీ అతన్ని మరిపించే విధంగా జట్టు రాణించాలని కోరుకుంటున్నా' అని ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్ తెలిపాడు.

తిరుగులేని ఫామ్‌లో పంత్

తిరుగులేని ఫామ్‌లో పంత్

ఆస్ట్రేలియా పర్యటన నుంచి రిషబ్ పంత్‌ తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో మూడో టెస్టులో 97, నాలుగో టెస్టులో 89 నాటౌట్ పరుగులతో అదరగొట్టాడు. ఇక ఇంగ్లండ్‌పైనా అదే జోరు కనబరిచాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ఆఖరి రెండు వన్డేల్లో వరుసగా అర్ధ శతకాలు సాధించాడు. ఇదే ఫామ్‌ను ఐపీఎల్‌ 2021లోనూ కొనసాగించాలని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆశిస్తోంది.

ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు

ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు

ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. అసలు 2019 ముందు వరకూ ఆ జట్టుపై పెద్దగా అంచనాల్లేవు.. ఎందుకంటే అంతకుముందు ఆరు సీజన్లలో ఆ జట్టు ప్రదర్శన పేలవం. ఆఖరి స్థానంలో లేదా చివరి నుంచి రెండో స్థానంలో నిలుస్తూ వచ్చింది. కానీ గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ సీజన్ ఆరంభానికి ముందే అయ్యర్ సేవలను కోల్పోయింది. దాంతో పంత్ తొలిసారి జట్టును నడిపించనున్నాడు. సీనియర్లు, జూనియర్ల మేళవింపుతో.. అనుభవం, దూకుడు కలగలిసి.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న ఢిల్లీ ఈ సారైనా టైటిల్ సాధిస్తుందో? లేదో చూడాలి.

IPL 2021: ముంబై ఇండియన్స్.. ఆ అరుదైన రికార్డు సాదించాలని కోరుకుంటున్నా: పార్థివ్‌ పటేల్‌

Story first published: Tuesday, April 6, 2021, 18:06 [IST]
Other articles published on Apr 6, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+