న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: మ్యాక్స్‌వెల్.. కలర్‌ఫుల్‌గా ఉన్నావ్! మంగళవారం ప్రారంభించడానికి ఇంతకంటే గొప్పగా ఏముంటుంది?!

IPL 2021: Glenn Maxwell shine in RCBs jersey

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ మరో మూడు రోజులో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2021 ఏప్రిల్ ‌9న ప్రారంభమయి మే 30తో ముగుస్తుంది. ఏప్రిల్ ‌9వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ప్రాంచైజీల ఆటగాళ్లు తమతమ జట్లతో కలిసి ముమ్మర సాధన చేస్తున్నారు. ఇటీవలే ఆర్‌సీబీతో కలిసిన ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్..‌ ఆ జట్టు ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్‌ను ఆరంభించాడు. ఈ క్రమంలో మైదానంలో భారీ షాట్లతో అలరించాడు. రివర్స్ స్వీప్ షాట్ కూడా ఆడాడు.

కలర్‌ఫుల్‌గా ఉన్నావ్

ఆర్‌సీబీ జెర్సీ ధరించి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఫోటోను తమ ట్విటర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంచైజీ షేర్‌ చేసింది. 'మ్యాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ జెర్సీలో చూడండం కంటే.. మంగళవారంను ప్రారంభించడానికి గొప్పగా ఇంకా ఏముంటుంది?' అని ఆర్‌సీబీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.. ఫాన్స్ తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'ఆర్‌సీబీ జెర్సీతో మ్యాక్సీ ఫోటో కోసం కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నా', 'మ్యాక్సీ.. విరాట్‌ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభిస్తే బాగుంటుంది', 'మ్యాక్స్‌వెల్.. ఆర్‌సీబీ జెర్సీలో కలర్‌ఫుల్‌గా ఉన్నావ్' అంటూ కెమెంట్లు పెట్టారు.

13 మ్యాచ్‌లాడి 108 పరుగులు

13 మ్యాచ్‌లాడి 108 పరుగులు

గతేడాది పంజాబ్‌ కింగ్స్‌ తరపున గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఘోరంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌లాడిన మ్యాక్సీ 108 పరుగులు మాత్రమే చేశాడు. భారీ హిట్టర్ అని పేరున్న అతడు కనీసం ఒక్క సిక్స్‌ కూడా కొట్టలేకపోయాడు. మ్యాక్స్‌వెల్ తీవ్రంగా నిరాశపరచడంతో పంజాబ్‌ జట్టు అతన్ని రిలీజ్‌ చేసింది. అయితే మ్యాక్స్‌వెల్‌ బిగ్‌బాష్‌ లీగ్‌తో పాటు అంతర్జాతీయ టీ20ల్లో దుమ్మురేపే ప్రదర్శన చేయడంతో.. ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో రూ. 14.25 కోట్లకు ఆర్‌సీబీ దక్కించుకుంది. మరి ఈసారి ఎలా ఆడుతాడో చూడాలి. మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 82 మ్యాచ్‌లాడి 1505 పరుగులు సాధించాడు.

కోహ్లీ సారథ్యంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నా

కోహ్లీ సారథ్యంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నా

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని మ్యాక్స్‌వెల్ ఇప్పటికే తెలిపాడు. 'కోహ్లీ మల్టీ పెర్ఫార్మర్. ఫార్మాట్‌కు తగ్గట్లు ఆడే అసాధారణ ఆటగాడు. అతను గేమ్‌ను అందిపుచ్చుకున్నాడు. కొన్నేళ్లుగా తన ఆటతో ఆధిపత్యం చెలాయిస్తున్నాడు.

కెప్టెన్‌గా, ఉత్తమ ఆటగాడిగా అతనిపై ఉన్న ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. కోహ్లీ నుంచి ఇవన్నీ నేర్చుకోవడానికి నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అతను నెట్స్‌లో చెమటోడ్చే దగ్గరి నుంచి సారథ్యం వరకు అన్ని దగ్గరుండి పరిశీలించి, వీలైనంత నేర్చుకోవాలనుకుంటున్నాను. మానసిక ఒత్తిళ్లను జయించడానికి గతంలో కొన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్నాను. నేను తీసుకున్న నిర్ణయాన్ని విరాట్ సమర్థించాడు. ప్రపంచ క్రికెటర్లందరికీ ఇది అవసరమని సూచించాడు' అని మ్యాక్సీ చెప్పాడు.

IPL 2021: మ్యాచ్‌లకు అనుమతి ఇచ్చిన రోజే.. మరో ముగ్గురికి కరోనా!!

Story first published: Tuesday, April 6, 2021, 15:32 [IST]
Other articles published on Apr 6, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X